Mannemala Sukumar Reddy

Mannemala Sukumar Reddy Mannemala Sukumar Reddy is a well-known People leader in Kavali, Nellore District, Andhra Pradesh.

10/03/2025

Sukumar reddy Press meet

10/03/2025

Mannemala sukumar reddy Press meet

01/11/2023

మన్నెమాల సుకుమార్‌ రెడ్డి... కావలి రాజకీయాల్లో విలువలు కలిగిన విలక్షణ నాయకుడు. సుకుమార్‌ రెడ్డి వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాజకీయాల కన్నా నమ్ముకున్న కార్యకర్తలకు, స్నేహానికి విలువనిచ్చే మనిషి సుకుమార్‌ రెడ్డి. సుకుమార్‌ రెడ్డితో ఒకసారి స్నేహం చేసిన వ్యక్తులు, నమ్ముకున్న కార్యకర్తలు మళ్ళీ వదిలిపెట్టి పోయే ప్రసక్తే ఉండదు. అందుకే పార్టీలతో పని లేకుండా ఈరోజుకీ ఏగ్రామానికి వెళ్ళినా సుకుమార్‌ రెడ్డికి ఘనస్వాగతాలు పలికేది. ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ కాలనీలు, మత్స్యకార పల్లెల్లో సుకుమార్‌ రెడ్డి అంటే ప్రాణం పెడుతాయి. కరోనా రెండో వేవ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో కావలి ఏరియా ఆసుపత్రి, అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి లలో ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం రాత్రీపగలు అధికారులను పరుగులు తీయించిన వైనాన్ని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈరోజుల్లో ఎవరుంటాబ్బా ఇంత ఇదిగా...

Mannemala Sukumar Reddy is a well-known People leader in Kavali, Nellore District, Andhra Pradesh.

26/10/2023

ఓక పేదవాడికి కష్టం వచ్చినా...పోలీస్‌స్టేషన్‌ నుంచి పిలుపు వచ్చినా...ఇంట్లో బిడ్డకు ఆరోగ్యం బాగలేక డబ్బులు అవసరమైనా...కష్టం ఏదైనా కావలి పట్టణ ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది మన్నెమాల సుకుమార్‌ రెడ్డి అన్న పేరు. సుకుమార్‌ రెడ్డి గొంతుగట్టిగా ఉన్నా, మాట కరుకుగా ఉన్నా వాటి వెనుక చల్లని మనస్సు దాగి ఉంటుంది. కొంతమందికి అది నచ్చకపోవచ్చు కానీ ఆయన మాత్రం పద్దతి మార్చుకోడు. ఒకసందర్భంలో...సుకుమార్‌ రెడ్డితో మాట్లాడుతూ నీకెందుకన్నా ఇంత నోటి దురుసుగా, నెమ్మదిగా చెప్పొచ్చు కదా, మళ్ళీ రేపు వాళ్ళ ఓట్లు అవసరం కదా’ అని అంటే ఆయన ఒకే మాట చెప్పాడు. ఇప్పుడు ఇంత పెద్దగా అరిచాను కదా గొడవపెట్టుకున్న ఇద్దరూ వెనక్కి తగ్గారు. స్టేషన్‌కు వెళ్ళాల్సిన వాళ్ళు ఇద్దరూ ఒక్కడే సర్థుకుని ఇళ్ళకు వెళ్ళిపోయారు. అదే స్టేషన్‌కి వెళితే కేసులు, జైలు, బెయిలు అంటూ పరువు, డబ్బు పోగొట్టుకోవడంతో పాటు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు నరకం అనుభవిస్తారు. దీని బదులు నేను నాలుగు మాటలు గట్టిగా మాట్లాడిపంపిస్తే మేలు కదా అని సూక్ష్మంలో మోక్ష్యాన్ని చక్కగా వివరించాడు.❤️❤️

Mannemala Sukumar Reddy is a well-known People leader in Kavali, Nellore District, Andhra Pradesh.

జనంలోనే...జనం కోసమే...కావలిలో హాట్‌ టాపిక్‌ ఏదైనా ఉంది అంటే అది మన్నెమాల సుకుమార్‌ రెడ్డికి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప...
26/10/2023

జనంలోనే...జనం కోసమే...
కావలిలో హాట్‌ టాపిక్‌ ఏదైనా ఉంది అంటే అది మన్నెమాల సుకుమార్‌ రెడ్డికి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ రెడ్డికి మధ్య జరుగుతున్న వివాదమే. టీకప్పులో తుఫాన్‌ లాంటి ఈచిన్న విషయమే ఇప్పుడు కావలి రాజకీయాల్లో కీలక మార్పులకు నాందీ కానుంది. రామలక్ష్మణుల్లా కలిసి మెలిసి ఉంటూ, ప్రతిపక్షాలను మరో పది తరాల వరకూ రాజకీయాల్లోకి రాకుండా తరిమికొట్టిన వీరికి ఎవరి దిష్టి తగిలిందో కానీ ఇద్దరి మధ్య చిరు విబేధాలు పొడచూపాయి. వీటికి మధ్యలో కొంత మంది శకుని అవతారం ఎత్తి అగ్నికి ఆజ్యం పోయడంతో సుకుమార్‌ రెడ్డిని సస్పెన్షన్‌ వరకూ వెళ్ళింది. సస్పెన్షన్‌ తరువాత సుకుమార్‌ రెడ్డి పనైపోయిందని ప్రతిపక్షాలు సంబరాలు చేసుకునే లోపే మళ్ళీ సుకుమార్‌ రెడ్డి జనంలో కనిపిస్తుండటం ఆపార్టీలకు మింగుడుపడటం లేదు. ఎక్కడ చూసినా సుకుమార్‌ రెడ్డే కనిపిస్తున్నాడేంటి అంటూ మళ్ళీ మధ్యలోనే తలలు పట్టుకుంటున్నారు. ఒకవైపు సోషల్‌ మీడియాలో, మరో వైపు జనంలో మన్నెమాలకు పెరుగుతున్న మాస్‌ ఫాలోయింగ్‌ కుళ్ళుబోతులకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా గురువారవ రాత్రి ఆదినారాయణపురంలో ఓపెళ్ళి వేడుకకు మన్నెమాల వెళ్ళగా వందలాది మంది మన్నెమాలను చూసేందుకు వచ్చారు. అప్పుడు అనిపించింది ఇది కదా అసలైన అభిమానం అని.

Address

Kavali
Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when Mannemala Sukumar Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share