06/05/2024
🔸మాస్టర్ నారాయణ గారికే మా ఓటు..... దామవరపు రాజశేఖర్...🔸 నెల్లూరు నగరంలోని స్థానిక తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్, నేడు తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వి,పి,ఆర్ నారాయణ గార్లకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని బంగ్లాతోట పలు ప్రాంతాలలో మండుటెండలో సైతం నిర్వహించారు, ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియజేశారు, ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ నేడు ఏ ప్రాంతంలో పర్యటిస్తున్న మాస్టర్ నారాయణ గారికే మా మద్దతు గతంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏ నాయకుడు చేయలేదని మా కోసం నెల్లూరు నగర అభివృద్ధి కోసం నారాయణ విపిఆర్ గార్లకు ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రజలు వారి యొక్క మద్దతు తెలియజేస్తున్నారని, మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి, విపిఆర్, నారాయణ గార్లను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.