Kovurupalli

Kovurupalli Kovurupalli is a Village in Bogole Mandal in Spsr Nellore District of Andhra Pradesh State, India. I

14/05/2018

Save Farmers life,He is the Almighty of Our Energetic life.Farmers
All are backbone of
Luminous India,
మీరు రైతు బిడ్డలే ఐతే షేర్ చెయ్యండి.. 🙏🙏🙏
వ్యవసాయమంటే ఎంత కష్టమో తెలియజేయండి అందరికీ

22/03/2017

కోవూరుపల్లి గ్రామంలో వైభవంగా కనకదుర్గ అమ్మ వారి పొంగళ్ళు

22/03/2017
20/03/2017
కోవూరుపల్లి గ్రామంలో  వైభవంగా కనకదుర్గ అమ్మ వారి పొంగళ్ళు
20/03/2017

కోవూరుపల్లి గ్రామంలో వైభవంగా కనకదుర్గ అమ్మ వారి పొంగళ్ళు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వర్ధ తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. ప్రస్తుతం అది విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా,మచిలీపట్నంకు వాయువ్...
10/12/2016

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వర్ధ తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. ప్రస్తుతం అది విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా,మచిలీపట్నంకు వాయువ్యంగా కేంద్రీకృతమయ్యి, గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది. ఇది సూపర్ సైక్లోన్ గానే పయనించి, ఈనెల 12వ తేదీన మధ్యాహ్నం నుండి సాయంత్రం లోగా నెల్లూరు – మచిలీపట్నం మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.

దీని ప్రభావంతో ఆదివారం నుండి కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

మరో వైపు తుఫాను నెల్లూరుజిల్లాలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయింది. జిల్లా కలెక్టర్ తీరప్రాంత మండలాలను అప్రమత్తం చేశారు. ఆయా మండలాల తహసీల్ధార్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రప్పించారు. అన్నీ శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తుఫాను తీవ్రతను బట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలని, భారీ వర్షాలకు ఆస్కారం ఉంటే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్… 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ పెట్టి, ఎక్కడ పోటీ...
11/11/2016

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్… 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ పెట్టి, ఎక్కడ పోటీ చేయకుండా టిడిపి-బిజేపి కూటమికి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్… ఆ తర్వాత ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించటం ప్రారంభించారు. జనసేన పార్టీకి కూడా రాజకీయ పార్టీగా గుర్తింపు రావటంతో, ఇక తన పార్టీని విస్తృతం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించాడు. జనసేనాని అభిమానుల కోరిక మేరకు తన నివాసాన్ని, ఓటు హక్కును కూడా… హైదరాబాద్ నుండి ఏలూరుకి మార్చుకోవాలని నిర్ణయించారు.

ఇదంతా వినటానికి సినిమా స్క్రిప్ట్ లాగా వున్నా… పవన్ వెనుక వున్న అసలు వ్యూహం ఏంటి అన్నది మాత్రం చాలా మందికి కన్ఫ్యూజన్ గానే వుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ ప్రజలంతా గళం విప్పారు.. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశంపై తన ఉద్యమాలు కొనసాగిస్తున్నాడు. ఈ సమయంలో అప్పటి వరకు మిత్రపక్షంగా వున్న జనసేనాని, హఠాత్తుగా ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తెలుగుదేశం ఎంపిలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కేంద్రం ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు. దీంతో ఏపి ప్రజల్లో గబ్బర్ సింగ్ ఇమేజ్ మళ్ళీ పెరిగింది. అధికార తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ప్రత్యేక హోదాపై జగన్మోహన్ రెడ్డి ఆందోళనలు రాజకీయమంటూ ఆరోపిస్తూ, పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం రాష్ట్రం కోసం పోరాడుతున్నాడంటూ బిల్డప్ లు ఇవ్వటం ప్రారంభించారు.

అయితే వైఎస్ జగన్ ఉద్యమాన్ని తప్పుపట్టి, పవన్ కళ్యాణ్ ను వెనుకేసుకుని రావటానికి వెనుక చిదంబర రహస్యమే దాగి వుందట… ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కాపు ఉద్యమాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ తమకు వ్యతిరేకంగా మారుతున్నాయని గ్రహించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆ ఓటు బ్యాంకును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళకుండా అడ్డుకట్ట వేయాలని ఆలోచించి, తన ట్రంప్ కార్డు అయిన పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించారట. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశంలో బిజేపితో విభేదించాల్సి వచ్చినా, తమతో కలుపుకుపోవటానికి పవన్ కళ్యాణ్ ను రెడీ చేసుకుంటున్నారట. కొంత ఆర్థికంగా మద్దతిచ్చి పవన్ కళ్యాణ్ ను నిలబెడితే, వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ కు అధికారం రాకుండా చేయవచ్చన్నది చంద్రబాబు నాయుడు హైటెక్ బుర్ర ఆలోచించిన వైనమట. అందుకోసం అన్న చిరంజీవి చేసిన తప్పు చేయకుండా పవన్ కళ్యాణ్ తన నివాసం, ఓటు హక్కు ఏలూరుకు కూడా మార్చుకునేలా ప్లాన్ వేశారు. తమ కంటెంట్, పవన్ కళ్యాణ్ కటౌట్ ను వాడుకోవాలని చూస్తున్న చంద్రబాబునాయుడు ఆలోచనలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే….?

India salutes Uri bravehearts18 bravehearts make ultimate sacrificeHow will India repay 18 lives?   #
19/09/2016

India salutes Uri bravehearts
18 bravehearts make ultimate sacrifice
How will India repay 18 lives?
#

హృదయాలు కొల్లగొట్టిందిసాక్షి మలిక్‌ స్వర్ణం గెలిచింది..!సాక్షి గెలిచింది కాంస్యమైతే.. స్వర్ణమేంటి..?ఆటలో పోరాటానికి ఆమెక...
19/08/2016

హృదయాలు కొల్లగొట్టింది
సాక్షి మలిక్‌ స్వర్ణం గెలిచింది..!సాక్షి గెలిచింది కాంస్యమైతే.. స్వర్ణమేంటి..?ఆటలో పోరాటానికి ఆమెకు దక్కింది కాంస్యమే.. కానీ ఆమె చేసిన జీవిత పోరాటానికి మాత్రం స్వర్ణమే ఇవ్వాలి!
ఆమె కుస్తీ చేసింది.. అమ్మాయిలకు ఆటలేంటి అంటూ ఇంట్లో వాళ్లే అమ్మాయిల్ని అణిచేసే గ్రామంతో! కుస్తీ మగాళ్ల ఆట, ఆడాళ్లకు ప్రవేశం లేదంటూ నిరసనలకు దిగిన వాళ్లతో! నిక్కర్లేసి కుస్తీ ఆడుతున్నందుకు మగరాయుడివంటూ చేసిన ఎగతాళి ఆకతాయిలతో! ఇలాంటి ఆటలాడితే ఈమెను పెళ్లి చేసుకునేదెవరు అంటూ ఎకసెక్కాలాడిన వాళ్లతో!
తనను వెనక్కి లాగడానికి ప్రయత్నించిన వాళ్లందరినీ ‘ఉడుం పట్టు’ పట్టేసి.. తనకు ఎదురైన సవాళ్లన్నింటినీ ‘తిప్పి’కొట్టేసి.. జీవితపు ఆటలోనూ గెలిచి పోడియంపై సగర్వంగా నిలుచుంది సాక్షి మలిక్‌. ఒకప్పుడు ఆమెను తమ వూరికే కళంకంగా భావిస్తే.. ఈ రోజు ఆమె ఈ దేశానికే గర్వకారణంగా నిలిచింది!

మాదే స్వప్నం.. నీదే స్వర్ణం పతకాల పట్టికలో భారత్‌ సింధుకు రజతం ఖాయం.. స్వర్ణంపై గురి బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఫైనల్లో ప్...
19/08/2016

మాదే స్వప్నం.. నీదే స్వర్ణం
పతకాల పట్టికలో భారత్‌
సింధుకు రజతం ఖాయం.. స్వర్ణంపై గురి
బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఫైనల్లో ప్రవేశం
రియో ఒలింపిక్స్‌లో తెలుగు తేజం సింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్‌కు సువర్ణాధ్యాయాన్ని లిఖించేందుకు చేరువైంది. ఇంకొక్కవిజయం సాధిస్తే చాలు పసిడి పల్లకి ఎక్కేందుకు! ఫైనల్‌ చేరడం ద్వారా సింధు ఇప్పటికే దేశానికి కనీసం రజతం ఖాయం చేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో 9వ సీడ్‌ సింధు 21-19, 21-10తో ఆరో సీడ్‌ నొజొమి ఒకుహర (జపాన్‌)పై ఘన విజయం సాధించింది. కేవలం 49 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించింది. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సింధు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో అదరగొట్టింది. బ్యాడ్మింటన్‌లో ఉన్న అన్ని రకాల షాట్లను అద్భుతంగా ఆవిష్కరించింది. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఒలింపిక్స్‌లో ఫైనల్‌ చేరుకున్న భారత తొలి షట్లర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సైనా నెహ్వాల్‌ను అధిగమించి సరికొత్త అధ్యాయం లిఖించుకుంది. శుక్రవారం జరిగే ఫైనల్లో కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)తో స్వర్ణ పతకం కోసం సింధు తలపడుతుంది.
‘‘ఒలింపిక్స్‌లో ఫైనల్‌ చేరడం చాలా గొప్పగా ఉంది. కరోలినాతో మ్యాచ్‌లో వంద శాతం మెరుగ్గా ఆడడానికి ప్రయత్నిస్తా. జీవితంలో అరుదుగా వచ్చే అద్భుత అవకాశమిది. నాకౌట్లో నేను ఓడించిన వాళ్లు టాప్‌ షట్లర్లు. భారత్‌లో కోట్లాది అభిమానులతో పాటు స్టేడియంలో అభిమానులు మద్దతుగా నిలవడం నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఫైనల్లో స్వర్ణం కోసమే బరిలో దిగుతా’’

06/07/2016

This wat India needs. Worth to share . That relief in her face :)

Address

Kovurupalli
Nellore
524142

Telephone

9494290430

Website

Alerts

Be the first to know and let us send you an email when Kovurupalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share