Nellore TDP Forum

Nellore TDP Forum నెల్లూరు అంటే ధైర్యం
నెల్లూరు అంటే మ?

31/01/2026

Good motivate message dear

నగర నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. భారీ వర్షాల నేపథ్యంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి విజ్ఞప్తి.....
14/10/2024

నగర నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. భారీ వర్షాల నేపథ్యంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి విజ్ఞప్తి..

నెల్లూరు జిల్లాకు రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో.. నెల్లూరు నగరం నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి.. తీవ్రమైన పెనుగాలులు పిడుగులు పడే అవకాశం ఉంటుంది.. అవసరమైతే తప్ప ఇంట్లోంచి ఎవరు బయటకు రావద్దు.. విద్యుత్ స్తంభాలను ఎవరు ముట్టుకోవద్దు.. భారీ వర్షాల కారణంగా ఎవరు బయటకు వచ్చి ఇబ్బంది పడొద్దు.. మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నేతలకు సమాచారం ఇవ్వండి.. మాతోపాటు మా పార్టీ కార్యకర్తలు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారు..

కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

17/07/2024

చంద్రబాబు గారి సారధ్యంలో కూటమి ప్రభుత్వం, 30 రోజుల్లో చేసిన, 30 కార్యక్రమాలు

1. 16,347 టీచర్ పోస్టులతో, మెగా డీఎస్సీ నోటిఫికేషన్
2. వృద్ధాప్య, వితంతు పెన్షన్ రూ.4000 కి పెంపు
3. దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి రూ.6000 కి పెంపు
4. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ
5. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
6. ఉచిత ఇసుక అమలు (కేవలం లోడింగ్, రవాణా చార్జీలు చెల్లిస్తే చాలు)
7. ఆగస్టు 15 నుంచి 183 అన్న క్యాంటీన్లు ప్రారంభం
8. గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు
9. ఎర్ర చందనంపై ఉక్కుపాదం
10. రాజధాని అమరావతి పనులు ప్రారంభం
11. పోలవరం నిర్మాణం పునః ప్రారంభం
12. స్కిల్ సెన్సెస్ కసరత్తు ప్రారంభం
13. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి, తల్లికి వందనం మార్గదర్శకాలు విడుదల
14. జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో పాసు పుస్తకాలు
15. పట్టిసీమ మొదలు పెట్టి, కృష్ణా డెల్టాకి నీరు విడుదల
16. 48 గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితుల అరెస్ట్
17. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు పరిశీలించి, 2026కి పూర్తి చేయాలని ఆదేశం
18. తిరుమల ప్రక్షాళన ప్రారంభం
19.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి
20. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన అందిన జీతాలు
21. ఏపీలో రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న బీపీసీఎల్
22. రాజధానిలో XLRI విద్యా సంస్థ
23. 5 ఏళ్ళ తరువాత పలాసకు సాగు నీరు
24. 5 ఏళ్ళ తరువాత పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్ళు
25. ఒక్క వాట్సప్ కాల్‌తో 25 మంది దివ్యాంగ విద్యార్ధులకు అండగా లోకేష్
26. ఇంటర్ విద్యార్ధులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు
27. తెలంగాణాతో విభజన సమస్యలపై ముందడుగు
28. విజయవాడ తూర్పు బైపాస్‌కి కేంద్రం ఆమోదం
29. నిత్యావసర ధరల నియంత్రణకు చర్యలు. రైతు బజార్లలో బియ్యం, కంది పప్పు తక్కువ రేట్లకే
30. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో, ఏడుగురు మంత్రులు, ప్రధానితో రాష్ట్ర సమస్యలపై సమావేశం

గత ప్రభుత్వంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లక్ష్యంగా పోలీసులు పెట్టిన అక్రమ కేసులు స...
24/06/2024

గత ప్రభుత్వంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లక్ష్యంగా పోలీసులు పెట్టిన అక్రమ కేసులు సంఖ్య 64.. ఈ అక్రమ కేసులు ఆయన్ని ఆపలేకపోయాయి.. నిరంతరం కార్యకర్తలు కోసం పోరాటం చేశారు..

అమ‌రావ‌తి రైతుల‌తో నారాయ‌ణ‌- భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌పై మంత్రి పొంగూరు నారాయ‌ణ‌తో చ‌ర్చించిన రైతులు ,మ‌ళ్లీ మీరే మంత్రిగా ర...
23/06/2024

అమ‌రావ‌తి రైతుల‌తో నారాయ‌ణ‌- భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌పై మంత్రి పొంగూరు నారాయ‌ణ‌తో చ‌ర్చించిన రైతులు ,మ‌ళ్లీ మీరే మంత్రిగా రావ‌డం మా అదృష్టం సార్ అన్న రైతులు..

మీ పోరాటం చరిత్రలో నిలిచిపోయింది..- అమరావతి రైతులతో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి..

- జగన్ తుగ్లక్ విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు..

- అమరావతి రైతులు చేసిన పోరాటాలు అన్ని వర్గాల వారికి స్ఫూర్తిగా నిలిచాయి..

- ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో గొంతు ఎత్తేంది అమరావతి రైతులే..

- సామాజిక వర్గాల వారీగా ప్రజలను విడగొట్టి.. వారిలో విద్వేషాన్ని రెచ్చగొట్టిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డి ది..

- చంద్రబాబు పాలనలో అమరావతి రైతులు స్వర్ణ యుగాన్ని చూస్తారు..

- మంత్రివర్యులు పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో రైతులకు అండగా ఉంటాం..

అమరావతి రైతులు చేసిన పోరాటాలు.. రాష్ట్ర ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు.. జగన్ తుగ్లక్ విధానాలను.. దేశానికి తెలియజేసేలా అమరావతి రైతులు అనేక పోరాటాలు చేశారని ఆయన కొనియాడారు..మంత్రి పొంగూరు నారాయణతో కలిసి అమరావతి రైతులతో ఆయన మాట్లాడారు.. అమరావతి రైతులపై జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టి.. వారిని అనేక ఇబ్బందులకు గురి చేశారని కోటంరెడ్డి మండిపడ్డారు.. జగన్ అరాచకాలను, ఆయన విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో తొలిసారి గొంతు ఎత్తింది అమరావతి రైతులే అని కోటంరెడ్డి కొనియాడారు.. సామాజిక వర్గాల వారీగా ప్రజలను, రైతులను జగన్మోహన్ రెడ్డి విడగొట్టి.. వారిలో విద్వేషాలను రెచ్చగొట్టారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. వారి గుండె ఘోష, వారు పడిన బాధలు జగన్మోహన్ రెడ్డికి శాపాలుగా మారాయని.. అందుకే 11 స్థానాలకి ఆ పార్టీ పరిమితమైందని కోటంరెడ్డి అన్నారు.. చంద్రబాబు పాలనలో అమరావతి రైతులు స్వర్ణ యుగాన్ని చూస్తారంటూ రైతులకు ఆయన భరోసా ఇచ్చారు.. మంత్రి నారాయణ సహకారంతో అమరావతి రైతులుకి అండగా ఉంటామని కోటంరెడ్డి హామీ ఇచ్చారు.. మరో 30 ఏళ్లు తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉండబోతుందంటూ కోటంరెడ్డి వెల్లడించారు..

𝐀𝐦𝐚𝐫𝐚𝐯𝐚𝐭𝐢 𝐅𝐚𝐫𝐦𝐞𝐫𝐬 𝐌𝐞𝐞𝐭 𝐰𝐢𝐭𝐡 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐞𝐫 𝐍𝐚𝐫𝐚𝐲𝐚𝐧𝐚

Farmers discussed future plans with Minister Ponguru Narayana, expressing their fortune in having him back as their minister..

, , , ,

Srinivasulu Reddy Kotamreddy

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణని మర్యాద పూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి..నందమూరి బాలకృష్ణ అనే...
21/06/2024

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణని మర్యాద పూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి..

నందమూరి బాలకృష్ణ అనే నేను.. ఈ మాట కోసం ఎదురుచూసిన వారిలో మొదటి వరుసలో ఉంటారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ వరుస విజయాలను అందుకున్న అనంతరం.. శుక్రవారం మూడోసారి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.. ప్రమాణస్వీకారం అనంతరం టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.. రాష్ట్రంలో ఉండే ఎంతోమంది యువ రాజకీయ నాయకులకు బాలకృష్ణ ఆదర్శప్రాయుడని కోటంరెడ్డి అన్నారు..

18/04/2024

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when Nellore TDP Forum posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Nellore TDP Forum:

Share