06/02/2026
ఒకే రక్తం… ఒకే ప్రేగు...
ఒకే రక్తం పంచుకున్నవారు,
ఒకే పేగు తెంచుకుని పుట్టిన అన్నా–చెల్లెళ్ళు.
ఒకే గర్భగుడిలో
తొమ్మిది నెలలు నివసించిన భక్తులు,
ఒకే దేవత చనుపాలు తాగి
జీవితాన్ని మొదలుపెట్టిన బిడ్డలు.
ఒకే తల్లి ఒడిలో
ముద్దులు, మురిపాలు పంచుకున్న తోబుట్టువులు,
ఒకే పక్షి కూనలై
ఒకరి వెంగలిచనుపాలు
మరొకరికి అమృతమై నిలిచిన బంధం.
ఒకే కుండలో వండిన అన్నం,
ఒకే పళ్లెంలో పంచుకుని తిన్న రోజులు,
ఒకే మంచం మీద
తల్లి ఇరువైపులా నిద్రించిన బాల్యం.
ఒకే రంగు యూనిఫాం,
ఒకే బడి, ఒకే అక్షరాలు,
ఒకే చెట్టుపై
ఒకే గూడు కట్టుకున్న పక్షుల్లా…
అలాంటి మనుషుల మధ్య
ఈ రోజు ఎందుకు ద్వేషం?
ఎందుకు పంతం?
ఎందుకు సమరం?
ఆ సమరమే పెను ప్రమాదమై
తోబుట్టువునే తుడిచిపెట్టిందా?
ఆస్తి… ధనం… నగదు…
స్వార్థమే పరమార్థమైపోయిందా?
తోబుట్టువే
నిన్ను కాటికి పంపే
నరరూప హంతకుడై మారాడా?
మానవత్వం మంటల్లో కరిగి
స్మశాన మార్గం చూపించిందా?
చెల్లమ్మ…
న్యాయవాది స్వప్న చెల్లమ్మ…
పాడు లోకం
నిన్ను నేడు కాటికి షికారుకు పంపిందా?
నీకు రక్షణగా ఉండాల్సిన
పేగు బంధమే
నిన్ను భక్షించిందా చెల్లమ్మ?
మా న్యాయదేవత…
సుకుమారి స్వప్న చెల్లమ్మ…
మా కన్నీటి నివాళులు
అగ్ని కణాలై మారి
హంతకుడిని కాలి భూడిద చేయక తప్పదు.
నీ ఆత్మకు శాంతి
కలగక తప్పదు…
స్వప్న చెల్లమ్మ…
జోహార్… జోహార్… 🕊️... భాధా తృప్త హృదయం తో... న్యాయవాదులోకం స్వరం లో ఒక స్వరమై..
లాయర్ కృష్ణ స్వామి అన్న.. న్యాయవాది.. సుప్రీమ్ కోర్ట్. 9550572981.