29/07/2025
లక్ష్మణచాందలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు ఆత్మ చైర్మన్ లను స్టేజ్ పైకి ఆహ్వానించకుండా నిర్మల్ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు జై కాంగ్రేస్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రేస్ పార్టీ మండలాధ్యక్షులు ఒడ్నాల రాజేశ్వర్ గారు మాట్లాడుతూ అర్హులైన అబ్ధిదారులందరికి రేషన్ కార్డులు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై ఓర్వలేక సండే ఎమ్మెల్యే గా ముద్రపడ్డ మహేశ్వర్ రెడ్డి గారు ఇలా ప్రతీ కార్యక్రమంలో అడ్డు పడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమం లో, మార్కెట్ కమిటి చైర్మన్ సామ భీం రెడ్డి, ఆత్మ చెర్మన్ రాంరెడ్డి, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, ఒడ్నాల రాజేశ్వర్, ప్రతాప్ రెడ్డి, నరేష్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ లు మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు....