CPM Prakasam

CPM Prakasam C.P.I.(M) Dist Committee
Sundaraiah Bhavan,
Near R.T.C Depo,
Ongole,
Prakasam- 523001. Phone: 9490300377

The CPI(M) was formed at the Seventh Congress of the Communist Party of India held in Calcutta from October 31 to November 7, 1964. More Updates Follow Our Social Media Sites

◆Follow us on Twitter: https://www.twitter.com/cpmprakasam
◆Follow us on Instagram: https://www.instagram.com/cpimprakasam
◆Subscribe us on Youtube: https://www.youtube.com/
◆Subscribe us on Telegram: https://t.me/cpmprakasam
◆Follow us on Share Chat: https://sharechat.com/profile/cpmeastprakasam

01/09/2026

"వెలిగొండ నిర్వాసితుల గోడు పట్టని ప్రభుత్వం"
- డి రమాదేవి, సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు

ఇంకా నిర్వాసిత గ్రామాల్లో పశువులు, జీవాలు,సామాన్లు.
లాఠీలు ఝుళిపిస్తున్న పోలీసులు
ఊళ్ళోకి పోనివ్వారా అంటూ ఆగ్రహం,తిట్లు.
పునరావాస కాలనీల కనీస వసతులు కల్పించాలన్నారు.
మిస్సింగ్ జాబితా వెంటనే ప్రకటించక పోతే ఆందోళన కు సిద్దం అంటున్న బాధితులు.

01/09/2026

వెలుగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ ఎవరిది?
జర్నలిస్ట్ YNR విశ్లేషణ..

01/09/2026

వెలుగొండ లో దారుణం- కొట్టుకుపోయిన కుటుంబం

మార్కాపురం జిల్లా కల్నూతల గ్రామంలో వెలిగొండ ఉద్రృతికి కొట్టుకుపోయిన కుటుంబం. టన్నెల్స్ నుండి నీటిని ఆపి నిర్వాసితుల ప్రాణాలను రక్షించాలి.
సిపిఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్.

వెలిగొండ ప్రాజెక్టులో పరిహారం అందక ఆఖరి వరకు ఎదురు చూసి నిరాశతో ఖాళీ చేసి వెళ్ళిపోతున్న ఒక కుటుంబం వాహనంతో సహా నీటి ఉద్రృతికి కొట్టుకుపోయి ఒకరు చనిపోయినట్లు మరో ఇద్దరు చెట్టు కొమ్మకు ఉన్నట్లు వస్తున్న సమాచారం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ప్రభుత్వం నిర్వాసితుల పట్ల నిర్దయగా వ్యవహరించి ప్రాణాలను సైతం బలి చేయడాన్ని సీపీఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు.
ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు.
టన్నెల్స్ నుండి నీటిని ఆపి నిర్వాసితుల ప్రాణాలను రక్షించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేసారు.
తగిన ఏర్పాట్లు చేసి అందరినీ తరలించాకే నీటిని వదలాలని శ్రీనివాసరావు సూచించారు.

పరిహారం అందక పెండింగులో ఉన్న పేర్లు 31 లోగా ప్రకటిస్తామన్న ప్రభుత్వ హామీని వెంటనే నెరవేర్చాలి. ముందుగా కనీసం లిస్టు ప్రకటించి వున్నా ఈ ఘోరం జరిగి వుండేది కాదు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

-జె. జయరాం
ఆఫీస్ కార్యదర్శి

చెంచు రెడ్డి పాలెం లో  ఆర్.ఓ ప్లాంట్ ను, పునర్ధరించాలికరువు పర్యటనలో సిపిఎం నాయకులు డిమాండ్. గుడ్లూరు మండలం చెంచు రెడ్డి...
31/08/2026

చెంచు రెడ్డి పాలెం లో ఆర్.ఓ ప్లాంట్ ను, పునర్ధరించాలి
కరువు పర్యటనలో సిపిఎం నాయకులు డిమాండ్.

గుడ్లూరు మండలం చెంచు రెడ్డి పాలెం గ్రామంలో ఆర్. ఓ. ప్లాంటును పునరుద్ధరించి. ప్రజల దాహార్తి ని తీర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి కొండారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందున, సాగునీటికి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని వెంటనే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా సిపిఎం గ్రామ గ్రామాన కరువు పర్యటనలు, చేపట్టింది. ఇందులో భాగంగానే గుడ్లూరు మండలం చెంచు రెడ్డిపాలెం గ్రామంలో, సిపిఎం బృందం పర్యటించింది. గత ప్రభుత్వం,3 లక్షల 75 వేల తో ఎంపీ నిధులతో మంచినీటి సరఫరా ట్యాంక్ ఏర్పాటు చేసి ఉంది. ఆరో ప్లాంట్ వద్ద ఉన్న వాటర్ నిలువ ఉంచే ట్యాంక్ డ్యామేజ్ కావడంతో ఈ రెండు సంవత్సరాల నుంచి పట్టించుకోని కారణంగా, ఆర్ఓ ప్లాంట్ నిరుపయోగంగా పడి ఉంది. వెంటనే , మరమ్మతులు చేపట్టి ఆర్వో ప్లాంట్ నుండి త్రాగునీటిని వెంటనే సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేస్తుంది. అలాగే చుక్కల భూములు ఆన్లైన్ ఎక్కించనీ కారణంగా, సుమారు 100 ఎకరాలకు పైగా, ప్రభుత్వం నుండి రావలసిన పథకాలు రాకుండా పోతున్నాయని, 22A, ఫ్రీ హోల్డ్, పథకాన్ని రద్దుచేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి పని ప్రారంభం నుండి, 5 వారాలు మాత్రమే పని కల్పించాలని, మిగతా రోజులు పని లేనందువల్ల ఇబ్బందులు పడుతున్నామని, సిపిఎం బృందానికి గ్రామ ప్రజలు తెలిపారు. వెంటనే వి బి జి రాంజీ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గుడ్లూరు మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి, వ్యవసాయ కార్మికుల్ని రైతాంగాన్నీ ప్రజలను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. ఈ పర్యటనలో, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి కొండారెడ్డి, సిపిఎం గుడ్లూరు ప్రాంతీయ కమిటీ కన్వీనర్ జి వెంకటేశ్వర్లు, సిపిఎం శాఖా కార్యదర్శులు, కొట్టే వెంకయ్య, గుత్తి మల్లికార్జున, సిపిఎం నాయకులు, దా మా కృష్ణయ్య, పాలకుర్తి నాగేశ్వరరావు, రైతులు, నరసారెడ్డి, మల్యాద్రి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

31/08/2026

సాధారణ పన్ను చెల్లింపుదారుల నష్టానికి ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు బహుమతులు ఇవ్వడం ఆపండి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) పొలిట్ బ్యూరో ఈ క్రింది ప్రకటనను జారీ చేసింది:
సాధారణ పన్ను చెల్లింపుదారుల నష్టానికి ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు బహుమతులు ఇవ్వడం ఆపండి
జీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అయిన సుభాష్ చంద్రకు సంబంధించిన రూ. 22,006.57 కోట్ల క్లెయిమ్‌లకు గాను, కేవలం రూ. 6.5 కోట్ల తిరిగి చెల్లింపు ప్రణాళికకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఆమోదం తెలపడం అనేది నిష్పక్షపాత న్యాయ సూత్రాలను అపహాస్యం చేయడమేనని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో పేర్కొంది.

సుభాష్ చంద్రకు బీజేపీ, సంఘ్ పరివార్‌లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఈ ఉత్తర్వు ట్రిబ్యునల్ యొక్క వర్గ పక్షపాతానికి స్పష్టమైన నిదర్శనం, మరియు ఇది పక్షపాతానికి వ్యతిరేకమైన ప్రాథమిక న్యాయ సూత్రాన్ని ఉల్లంఘిస్తుంది. ఈ అసంబద్ధమైన సందర్భంలో, రుణదాతలు 99.97 శాతం నష్టాన్ని చవిచూడనున్నారు; రూ. 1,322.39 కోట్ల క్లెయిమ్‌తో ఉన్న ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్‌కు కేవలం 0.028 శాతం, అంటే రూ. 38 లక్షల చెల్లింపుతో సెటిల్‌మెంట్ ఆమోదించబడింది.

ట్రిబ్యునల్ నిర్ణయాలు ఒక స్థిరమైన పద్ధతిని చూపుతున్నాయి, దీనిలో పెద్ద కార్పొరేషన్లు పదేపదే భారీ మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి అనుమతించబడుతున్నాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు భారీగా అప్పులు చేయడానికి లొంగిపోయే ప్రభుత్వం వల్ల ఊహించని లాభాలు ఆర్జిస్తున్నారు; కొన్ని సంవత్సరాల తర్వాత, ప్రస్తుత కేసులో వలె NCLT భారీ రాయితీలతో వారి రుణాన్ని పరిష్కరిస్తుంది.

ఇటువంటి ఉదారత పన్ను చెల్లింపుదారులు మరియు చిన్న డిపాజిటర్ల ఖర్చుతో వస్తుంది. పెద్ద కార్పొరేషన్ల ఉద్దేశపూర్వక ఎగవేతకు సామాన్య పన్ను చెల్లింపుదారులు ఎందుకు చెల్లించాలి? రాజకీయంగా పలుకుబడి ఉన్న ఆశ్రిత పెట్టుబడిదారులకు భారీగా రుణాలు ఇచ్చి, ఆ తర్వాత 'హెయిర్‌కట్' పేరుతో వారిని ఆదుకుంటున్నారు. ఇది వివేకవంతమైన ఆర్థిక ఎంపిక కాకపోగా, అధికార పార్టీకి చేసిన సేవలకు ఇచ్చే ఉదారమైన బహుమతిలా ఈ ఉదారత కనిపిస్తుంది.

భారతదేశంలో, అప్పులు తీర్చలేని కారణంగా వేలాది మంది రుణగ్రస్త రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు మరియు రోజువారీ కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పేదలు మరియు అణగారిన వర్గాల వారు చిన్న మొత్తాలను తిరిగి చెల్లించడంలో విఫలమైనప్పుడు, వారు బెదిరింపులు, భయపెట్టడం, అవమానాలు మరియు ఇళ్ల నుండి గెంటివేయడాన్ని ఎదుర్కొంటారు. ఆర్‌బిఐ ప్రకారం, గృహ రుణాలు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 45.5 శాతంతో సర్వకాలిక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

కార్పొరేట్ మిత్రులకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తుండగా, రైతులకు రుణమాఫీ చేయడం అనేది అవివేకమైన విధానంగా తరచుగా ప్రశ్నించబడుతోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన ఒక ఆర్‌టిఐ సమాధానం ఒక కఠోర వాస్తవాన్ని వెల్లడిస్తుంది, అదేమిటంటే, చిన్న రుణగ్రహీతలకు (రూ.1 కోటి మరియు అంతకంటే తక్కువ) రుణ వసూలు రేటు 74 శాతంగా ఉండగా, పెద్ద రుణగ్రహీతలకు (రూ.100 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ) ఇది కేవలం 14.5 శాతంగా ఉంది.
NCLT ఉత్తర్వును రద్దు చేయాలని, సాధారణ పన్ను చెల్లింపుదారుల నష్టానికి ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు బహుమతులు ఇచ్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని CPI(M) డిమాండ్ చేస్తోంది.

31/08/2026

హృదయవిదారకం...
హఠార్మణం చెందిన కలనూతల ముంపు గ్రామం బాధితురాలైన గోతం రోశమ్మ
ఈ కుటుంబం పెద్దారవీడు మండలంలోని గొబ్బూరు గ్రామంలోని ఓ అద్దె ఇంట్లో తలదాచుకుంటుంది.
RR ప్యాకేజీ పరిహారం అందని కారణంగా దిగులు చెందిన రోశమ్మ మధనపడుతూ భయాందోళనకు గురవుతున్న క్రమంలో 31.08.2026వ తేదీ ఉదయం సుమారు (ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నల్లమల సాగరు జలాశయాన్ని జాతికి అంకితం చేస్తున్న్న)
10.00-10.30మధ్యలోగుండెపోటుతో మృతి చెందింది.
ప్యాకేజీ రాలేదని, ఎలా బ్రతకాలనే భయాందోళన నేపథ్యంలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నల్లమల సాగరు జలాశయం ముంపు గ్రామాల నిర్వాసితుల గ్రామం వాసి గోతం రోశమ్మ మృతి చెందింది.
మానవత్వం లేని ఇంటి యజమాని
మృతురాలిని ఇక్కడ నుంచి మీ గ్రామానికి తీసుకెళ్లండని బలవంతం చేయడంతో గత్యంతరం లేని దుస్థితిలో స్వగ్రామానికి తరలిస్తున్నారని అందిన సమాచారం బట్టి తెలిసింది

మృతురాలి కుమారుడు పేరు: చిన్న వీరయ్య.
భార్య పేరు: అక్కమ్మ.
సంతానం కుమారులు వీరాంజనేయులు,రామాంజనేయులు ,అనంతమ్మ.
వీరందరు మనుమలు, మనుమరాలు.
వీరికి వివాహాలై పిల్లలు కూడా వున్నారు
తండ్రి చిన్న వీరయ్య, భార్య అక్కమ్మ గానీ, ఇద్దరు కుమారులకు గానీ, కూతురుకు గానీ మొత్తం నాలుగు ప్యాకేజీలు రావాలి. కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో ఈ నాలుగు పేర్లు లేవు

ముంపు గ్రామం పేరు:కలనూతల.
మండలం:పెద్దారవీడు.
నియోజకవర్గం: యర్రగొండపాలెం.
జిల్లా: మార్కాపురం.

హృదయవిదారకం...హఠార్మణం చెందిన కలనూతల ముంపు గ్రామం బాధితురాలైన గోతం రోశమ్మఈ కుటుంబం పెద్దారవీడు మండలంలోని గొబ్బూరు గ్రామం...
31/08/2026

హృదయవిదారకం...
హఠార్మణం చెందిన కలనూతల ముంపు గ్రామం బాధితురాలైన గోతం రోశమ్మ
ఈ కుటుంబం పెద్దారవీడు మండలంలోని గొబ్బూరు గ్రామంలోని ఓ అద్దె ఇంట్లో తలదాచుకుంటుంది.
RR ప్యాకేజీ పరిహారం అందని కారణంగా దిగులు చెందిన రోశమ్మ మధనపడుతూ భయాందోళనకు గురవుతున్న క్రమంలో 31.08.2026వ తేదీ ఉదయం సుమారు (ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నల్లమల సాగరు జలాశయాన్ని జాతికి అంకితం చేస్తున్న్న)
10.00-10.30మధ్యలోగుండెపోటుతో మృతి చెందింది.
ప్యాకేజీ రాలేదని, ఎలా బ్రతకాలనే భయాందోళన నేపథ్యంలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నల్లమల సాగరు జలాశయం ముంపు గ్రామాల నిర్వాసితుల గ్రామం వాసి గోతం రోశమ్మ మృతి చెందింది.

మానవత్వం లేని ఇంటి యజమాని
మృతురాలిని ఇక్కడ నుంచి మీ గ్రామానికి తీసుకెళ్లండని బలవంతం చేయడంతో గత్యంతరం లేని దుస్థితిలో స్వగ్రామానికి తరలిస్తున్నారని అందిన సమాచారం బట్టి తెలిసింది

మృతురాలి కుమారుడు పేరు: చిన్న వీరయ్య.
భార్య పేరు: అక్కమ్మ.
సంతానం కుమారులు వీరాంజనేయులు,రామాంజనేయులు ,అనంతమ్మ.
వీరందరు మనుమలు, మనుమరాలు.
వీరికి వివాహాలై పిల్లలు కూడా వున్నారు
తండ్రి చిన్న వీరయ్య, భార్య అక్కమ్మ గానీ, ఇద్దరు కుమారులకు గానీ, కూతురుకు గానీ మొత్తం నాలుగు ప్యాకేజీలు రావాలి. కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో ఈ నాలుగు పేర్లు లేవు

ముంపు గ్రామం పేరు:కలనూతల.
మండలం:పెద్దారవీడు.
నియోజకవర్గం: యర్రగొండపాలెం.
జిల్లా: మార్కాపురం.

31/08/2026

ప్రచార ఆర్భాటాలు.
కాదు ప్రజలకు న్యాయం జరగాలి.

31/08/2026

వెలిగొండ ప్రాజెక్టు సాధనలో సిపిఎం,కమ్యూనిస్టు పార్టీల పాత్ర కీలకం

ప్రాజెక్టు ఆలోచనను ప్రజా డిమాండ్‌గా మార్చడం, ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడం, శంకుస్థాపన తర్వాత పనులు ప్రారంభించాలని ఉద్యమించడం, రెండో టన్నెల్ కోసం పోరాడడం, ప్రస్తుతం నిర్వాసితుల హక్కుల కోసం పోరాడడం—ఇలా అనేక దశల్లో వారి పాత్ర ముఖ్యంగా సిపిఎం విశేషంగా కృషి చేసింది..

Address

Sundaraiah Bhavan
Ongole
523001

Alerts

Be the first to know and let us send you an email when CPM Prakasam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CPM Prakasam:

Shortcuts

Share