06/03/2024
ఆదివాసి హక్కుల రక్షణకు అసెంబ్లీలో ప్రభుత్వం తో పోరాటానికి (ప్రశ్నించుటకు) నేను సిద్ధం.
👉1) ఆదివాసి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర.
👉2) 100% ఉద్యోగాలు రావలంటే GO నెంబర్ 03 అమలు జరగాలి.
👉3) బోయ వాల్మీకి, వడ్డెర, బెస్త, బెంతో ఒరియా, కులాలను ఆదివాసి తెగల్లో చేర్చడం రాజ్యాంగ విరుద్ధం. T.D.P., Y.C.P. కాంగ్రెస్, ప్రభుత్వాలు అసెంబ్లీ లో చేసిన తీర్మానం చట్ట సమతం కాదు.
👉4) కాన్వెంట్ ఇంగ్లీష్ చదువులు, కార్పొరేట్ కాలేజీ చదువులు తిరిగి పునరుద్ధరణ (కొనసాగించుట).
👉5) 1/ 70 చట్టం అమలుకు భినామీ ఆస్తుల నిరోధక చట్టం చేసి, భినామీ వ్యవస్థను అంతం చేయుట.
👉6) S.T.సబ్ ప్లాన్ నిధులు, మరియు గ్రామపంచాయతీ నిధులు ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి మాత్రమే ఖర్చు పెట్టుట. ఇతర పథకాలకు ఈ మళ్లింపు చట్టవిరుద్ధం.
👉7) తక్కువ కాలంలో పండే వ్యాపార పంటలు, మార్కెట్లో ఎక్కువ ధర ఉండే పంటలను ఎంపిక చేసి రైతుల ఆదాయం పెంచుట.
👉8) గిరిజనుల ఆదాయం పెంచుటకు ఏజెన్సీలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించి, ప్రత్యేక నిధులను కేటాయించాలి. గంజాయి సాగును అరికట్టుట.
👉9) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధంగా I.T.D.A., G.C.C. లకు నిధులను కేటాయించాలి. ప్రతి మూడు నెలలకు విధిగాI.T.D.A. పాలక వర్గ సమావేశాలను జరపాలి.
👉10) 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనుల రక్షణకు, మరియు అభివృద్ధికి రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రత్యేక చట్టాలు అమలు పరచడంలో ప్రభుత్వాలు విఫలమైనందున ఆదివాసి ప్రాంతాన్ని స్వయంపాలన అధికారా ప్రాంతంగా ప్రకటించాలి.
👉11) నిరుద్యోగులకు వ్యాపార రంగంలో శిక్షణ ఇవ్వాలి. వ్యాపార రంగంలో గిరిజన యువతి, యువకులు స్థిరపడుటకు ఇందుకు అవసరమైన ప్రత్యేక నిధులు కేటాయించి ఉపాధి అవకాశాలు పెంచాలి.
👉12) వ్యవసాయ ఆధారిత పంటలు మరియు అటవీ ఉత్పత్తులు ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు, కూలీ పనులకు వలసలు వెళ్లకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించుట.
👉13) ఏజెన్సీ ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలు జరగకుండా అడ్డుకోవడం ప్రకృతి సంపదకు రక్షణ (అడవులు, భూమి, నీరు,గాలి) .
👉14) భింపోలు, గుమ్మకోట, గరుగుభిల్లి, N.R. పురం, రొంఫిలి పంచాయతీలను 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో చేర్చుట.
👉15) పీసా చట్టం పటిష్టంగా అమలు జరుగుటకు ఉద్యమం.
ఇట్లు:
మీ శ్రేయోభిలాషి ,
అరకు అసెంబ్లీ MLA అభ్యర్థి,
గౌ "శ్రీ లకే రాజారావు మాస్టారు (EX MLA) గారు,
B.S.P.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
ఇదే మన గుర్తు ఏనుగు ,,🐘🐘🐘 🐘🐘ఏనుగు గుర్తుకు ఓటు వేయండి!! మన భావి తరాల భవిష్యత్తు కాపాడండి.!! ✊✊🐘🐘🐘అంబేడ్కర్ ఆలోచనా విధానం మే!! ఈ దేశానికి శరణ్యం!! ✊✊🐘🐘🐘ఆదివాసీల హక్కులకు రక్షణ! BSP తోనే సాధ్యం!!🐘🐘✊✊GO నెంబరు 03 తిరిగి రావాలంటే!! మాస్టారు గెలవాలి.!!,🐘🐘✊✊ బోయ వాల్మీకి, వడ్డెర, బెస్త ,బెంతోరియా కులాలను తరమాలంటే!! మాస్టర్ గెలవాలి.!!🐘🐘✊✊✊ కాన్వెంట్ కార్పొరేట్ చదువులు తిరిగి కొనసాగాలంటే!! మాస్టర్ గెలవాలి!!. 🐘🐘✊✊✊రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ఉండాలంటే!! మాష్టారుగెలవాలి!!.
🐘🐘🐘✊✊✊✊✊
జై భీమ్!! జై BSP !!జై భారత్.🐘🐘✊✊✊🐘🐘🐘🐘✊
ఇట్లు :
అరకు అసెంబ్లీ కమిటీ.