ASRDistrictPolice

ASRDistrictPolice The official Handle of Alluri Sitharamaraju District Police..

శ్రీ అమిత్ బర్దార్, ఐ.పి.ఎస్., జిల్లా ఎస్పీ, అల్లూరి సీతారామరాజు జిల్లావినాయక మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో ఉచ...
04/09/2026

శ్రీ అమిత్ బర్దార్, ఐ.పి.ఎస్., జిల్లా ఎస్పీ, అల్లూరి సీతారామరాజు జిల్లా
వినాయక మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో ఉచిత అనుమతులు - https://ganeshutsav.net
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులకు ఆన్‌లైన్‌లో అనుమతులు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ www.ganeshutsav.net అనే సింగిల్ విండో ఈ-పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ.
జిల్లాలోని వినాయక ఉత్సవ కమిటీలు ఎటువంటి అమౌంట్ / ఫీజు / చలానా పే చేయనవసరం లేదు. ఈ సేవ పూర్తిగా ఉచితం. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే స్థానిక పోలీసులకు లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని సూచించారు.
అనుమతి పొందే విధానం:
1. https://ganeshutsav.net లో "NEW APPLICATION" పై క్లిక్ చేయాలి.
2. మొబైల్ నంబర్ ఇచ్చి OTP ద్వారా వెరిఫై చేసుకోవాలి.
3. అప్లికేషన్ ఫారంలో దరఖాస్తుదారుడి పేరు, అసోసియేషన్ పేరు, విగ్రహ ప్రతిష్టాపన స్థలం, జిల్లా - అల్లూరి సీతారామరాజు, పోలీస్ స్టేషన్ పరిధి, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, 5 గురు కమిటీ సభ్యుల వివరాలు, నిమజ్జనం తేదీ, సమయం, ప్రదేశం, వాహనం వివరాలు నమోదు చేయాలి.
4. ఫారం సబ్మిట్ చేస్తే Application ID వస్తుంది. సింగిల్ విండో అధికారులు మీ ప్రాంతాన్ని సందర్శిస్తారు.
5. అప్లికేషన్ ఆమోదించబడిన తర్వాత https://ganeshutsav.net/applicationStatus లో మొబైల్ నంబర్ తో స్టేటస్ చూసి, NOC మరియు QR Code ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
ముఖ్య గమనిక: డౌన్ లోడ్ చేసుకున్న NOC మరియు QR Code లను లామినేషన్ చేయించి తప్పనిసరిగా మీ గణేష్ మండపం గోడపై ప్రదర్శించాలి.
ఎటువంటి రుసుము లేకుండానే అనుమతులు పొంది, నిబంధనలు పాటిస్తూ, ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
జిల్లా పోలీసు శాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు







Today’s news clipping featuring the recent activities and contributions of the Alluri Sitharamaraju District Police.For ...
03/09/2026

Today’s news clipping featuring the recent activities and contributions of the Alluri Sitharamaraju District Police.For more updates and insights into the activities and initiatives of the ASR District Police, follow our social media channels.
Andhra Pradesh Police
AP Police TV






ఈ రోజు SI Pedabayalu   కాగువలస గ్రామంలో  అలాగే  SI ananthagiri దండబాడు గ్రామంలో   మరియు SI Chintapalli   చింతపల్లి సంతలో...
02/09/2026

ఈ రోజు SI Pedabayalu కాగువలస గ్రామంలో అలాగే SI ananthagiri దండబాడు గ్రామంలో మరియు SI Chintapalli చింతపల్లి సంతలో మరియు SI Dumbriguda గుంటసీమ, సోరబు, సరాయివలస గ్రామాల్లో సైబర్ నేరాలు, మహిళలు మరియు పిల్లలపై నేరాల నివారణ, గంజాయికి నో, రోడ్డు భద్రతపై అవగాహన సమావేశాలు నిర్వహించారు.

మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండండిమీ కుటుంబ భవిష్యత్తును కాపాడుకోండిగంజాయి లేదా మత్తు పదార్థాలపై సమాచారం ఉంటే పోలీస...
29/08/2026

మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండండి
మీ కుటుంబ భవిష్యత్తును కాపాడుకోండి
గంజాయి లేదా మత్తు పదార్థాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయండి
మత్తు వద్దు… మంచి భవిష్యత్తే ముద్దు!

**అతివేగం వద్దు – నిదానమే ప్రాణ రక్షణ** వేగం తగ్గించండి.. ప్రమాదాలను నివారించండి.& ;**మీ భద్రతే మా బాధ్యత – సురక్షితంగా ...
29/08/2026

**అతివేగం వద్దు – నిదానమే ప్రాణ రక్షణ**
వేగం తగ్గించండి.. ప్రమాదాలను నివారించండి.& ;
**మీ భద్రతే మా బాధ్యత – సురక్షితంగా ప్రయాణించండి.**
\

డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి!అత్యవసర వెబ్‌సైట్లలో మాత్రమే వివరాలు నమోదు చేయండి. అనుమానాస్పద లింకులు, OTPలు, క్ర...
29/08/2026

డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి!
అత్యవసర వెబ్‌సైట్లలో మాత్రమే వివరాలు నమోదు చేయండి. అనుమానాస్పద లింకులు, OTPలు, క్రెడిట్ కార్డు వివరాలు ఎవరికీ షేర్ చేయవద్దు.

ఈ రోజు **SI, మోతుగూడెం పోలీస్ స్టేషన్**  , ఫోర్‌బే  గ్రామంలో అలాగే SI మంపా మంప గ్రమంలో ,  మరియు SI పాడేరు  ఈదులపాలెం గ్ర...
24/08/2026

ఈ రోజు **SI, మోతుగూడెం పోలీస్ స్టేషన్** , ఫోర్‌బే గ్రామంలో అలాగే SI మంపా మంప గ్రమంలో , మరియు SI పాడేరు ఈదులపాలెం గ్రామంలో **మహిళల భద్రత, మాదకద్రవ్యాల నివారణ, సైబర్ భద్రత, రహదారి భద్రత మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై** అవగాహన సమావేశం నిర్వహించారు.
\

Address

Paderu
531024

Website

Alerts

Be the first to know and let us send you an email when ASRDistrictPolice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share