Sainada jothishyalayam

Sainada jothishyalayam free

06/09/2025

*సంపూర్ణ చంద్రగ్రహణం*
భాద్రపద శుక్ల పూర్ణిమ ఆదివారము రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారతదేశం అంతటా ప్రభావం ఉంటుంది.07-09-2025 ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు స్పర్శ కాలము. రాత్రి 11 గంటల 41 నిమిషాలకు మధ్య కాలము. రాత్రి ఒంటిగంట 26 నిమిషాలకు మోక్ష కాలము. ఈ గ్రహణము శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రంలో, కుంభరాశి నందు సంభవిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏ ఏ రాశుల వారి పై ఎటువంటి ప్రభావం ఉంటుంది.

కుంభ రాశి వారికి
ప్రభావాలు: మానసిక ఒత్తిడి, అశాంతి, గందరగోళం కలగవచ్చు. మీ ఆరోగ్యం లేదా మీ తల్లి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే అవకాశం

మకర రాశి వారికి
(డబ్బు, కుటుంబం)
డబ్బు విషయంలో టెన్షన్, భావోద్వేగాల వల్ల కుటుంబంలో గొడవలు రావచ్చు.నెమ్మదిగా మాట్లాడటం, ఆర్థిక విషయాల్లో ఎమోషనల్ అవ్వకుండా ఉండటం మంచిది.

ధనుస్సు రాశి
(తోబుట్టువులు, ధైర్యం)
తోబుట్టువులతో మాటల్లో అపార్థాలు రావచ్చు. ధైర్యం, ఉత్సాహం తాత్కాలికంగా తగ్గవచ్చు. మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడాలి.

వృశ్చిక రాశి
(తల్లి, ఇల్లు)
తల్లి ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి. ఇంట్లో ప్రశాంతత లోపించి, మానసిక అభద్రత కలగవచ్చు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడండి.

తులా రాశి వారికి

సంతానం యొక్క చదువు, స్పెక్యులేటివ్ పెట్టుబడుల గురించి ఆందోళనలు కలగవచ్చు. ప్రేమ సంబంధాలలో మానసిక గందరగోళం ఏర్పడవచ్చు. పిల్లలతో సంతోషంగా సమయం గడపండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలులో పాల్గొనడం మంచిది.

కన్యారాశి
శత్రువులు, అప్పులు, అనారోగ్యం..
శత్రువులు, అప్పులు లేదా ఆరోగ్య సమస్యల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి కలగవచ్చు.ఈ విషయాల్లో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అయితే, ఈ సమయంలో ఇటువంటి సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంది.

సింహరాశి
భార్యాభర్తల మధ్య, వ్యాపార భాగస్వామ్యాల్లో మానసిక గందరగోళం, అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఓర్పు, అవగాహనతో మెలగాలి.

కర్కాటకం
(ఆయుష్షు, అడ్డంకులు)
ప్రభావాలు: తీవ్రమైన మానసిక వేదన, తెలియని భయాలు, ఆందోళనలు కలగవచ్చు. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టవచ్చు. ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. ప్రయాణాలు చేయవద్దు.

మిధునం
(అదృష్టం, తండ్రి, ధర్మం)
తండ్రి లేదా గురువు విషయంలో మానసిక ఆందోళన కలగవచ్చు. నమ్మకం తగ్గడం, ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడవచ్చు.పెద్దలను గౌరవించండి. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొనండి.

వృషభ రాశి
ఉద్యోగం, హోదా.
ఉద్యోగంలో అసంతృప్తి, పనిలో ఒత్తిడి, పరువుకు భంగం వాటిల్లే అవకాశం ఉంటుంది. పని చేసే చోట భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది.

మేష రాశి
(లాభాలు, స్నేహితులు)
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లాభాలు, కోరికలు నెరవేరినా, స్నేహితులతో మానసిక ఒత్తిడి లేదా అంచనా వెయ్యలేకపోవడం జరగవచ్చు.అంచనాలు తగ్గించుకుని, స్నేహితులతో జాగ్రత్తగా మెలగడం మంచిది.

మీన రాశి
ఖర్చులు, నష్టాలు..
మానసిక ఆందోళన వల్ల ఖర్చులు పెరగడం, నిద్రపట్టకపోవడం, ఒంటరితనం వంటివి కలగవచ్చు. అనవసరమైన ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మంచిది.

శుభ ఫలితం: మేష , వృషభ, కన్య, ధనుస్సు.

సామాన్య ఫలితం: మిథున, సింహ, తుల, మకర.

అధమ ఫలితం: కర్కాటక,వృశ్చిక, కుంభ, మీనం.

దిలీప్ శర్మా 9949988845.

29/08/2025

🌿 గణపతి నిమజ్జన విశేషములు 🌿

🦣🦣🦣🦣🦣🦣

నిమజ్జన కాల నిర్ణయం:

చతుర్థ్యామ్ భాద్రపదస్య పూజా గణపతేర్మతా I చతుర్దస్యాం విసర్జన్తి నిత్యకర్మణి మానవాః ॥ (ముద్గల పురాణం)
ముద్గల పురాణం ప్రకారం, భాద్రపద మాసంలో వచ్చే చతుర్థి రోజున గణపతిని పూజిస్తారు. ఆ తర్వాత, నిత్యకర్మలో భాగంగా చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు. దీనిని బట్టి చతుర్దశి రోజు నిమజ్జనం ఒక ముఖ్యమైన నియమమని చెప్పవచ్చు.

🐘🐘🐘🐘🐘🐘

నవరాత్రుల నిర్ణయం:

ఏకారాత్రాత్ త్రిరాత్రాంతం పంచరాత్రం సప్తరాత్రకం | నవరాత్రం చ ఏకాదశీ పౌర్ణమ్యాంతం విసర్జనమ్ ||( ముద్గల పురాణం)
సాధారణంగా గణపతి ఉత్సవాలు 10 రోజులు జరుపుకుంటారు.
ముద్గలపురాణంలో, గణపతిని ఒక రాత్రి నుండి మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు రాత్రులు, లేదా పౌర్ణమి వరకు నిమజ్జనం చేయవచ్చని చెప్పబడింది. తొమ్మిది రాత్రుల తరువాత, అంటే పదవ రోజున నిమజ్జనం చేయాలి.
🌿🌿🌿 ఇక్కడ రాత్రులు అని చెప్పారు. రోజులు అని కాదు. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. 🌿🌿🌿

2025 వినాయక చవితి ఆగస్టు 27, బుధవారం రాత్రి నుండి వరుసగా 9 రాత్రులు మరియు వాటికి సంబంధించిన తేదీలు, రోజులు కింద పట్టికలో ఇవ్వబడ్డాయి.

రాత్రిసంఖ్య తేదీ రోజు
1వ రాత్రి 27-08-2025 బుధవారం
2వ రాత్రి 28-08-2025 గురువారం
3వ రాత్రి 29-08-2025 శుక్రవారం
4వ రాత్రి 30-08-2025 శనివారం
5వ రాత్రి 31-08-2025 ఆదివారం
6వ రాత్రి 01-09-2025 సోమవారం
7వ రాత్రి 02-09-2025మంగళవారం
8వ రాత్రి 03-09-2025 బుధవారం
9వ రాత్రి 04-09-2025 గురువారం
తొమ్మిది రాత్రులు పూర్తయ్యేసరికి 2025లో సెప్టెంబర్ 5వ తేదీ, శుక్రవారం వస్తుంది.

🐁🐁🐁🐁🐁🐁

శుక్రవార నిమజ్జనం:

శుక్రవారం రోజున గణపతిని నిమజ్జనం చేయకూడదని ఏ శాస్త్రంలోనూ స్పష్టంగా చెప్పలేదు. కానీ, ఈ ఆచారం లోకంలో బాగా ప్రచారంలో ఉంది. అందువల్ల, చాలామంది ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు.

🌼🌼🌼🌼🌼🌼🌼

గ్రహణ నిమజ్జన వివరములు

ఆదిత్యే గ్రహణే ప్రాప్తే త్రియామం సూతకం భవేత్ | చంద్రస్య గ్రహణే పూర్వం యామం ద్విత్రిం చ సూతకం | ఆబ్దికం సూతకే నైవ కర్తవ్యం విధివత్ భవేత్ ( ధర్మసింధు)

ధర్మసింధు గ్రంథం ప్రకారం, సూర్య గ్రహణం సమయంలో తొమ్మిది గంటల ముందు, చంద్ర గ్రహణం సమయంలో ఆరు గంటల ముందు సూతకం పాటించాలి. ఈ సూతక కాలంలో ఎలాంటి శుభకార్యాలు, పూజలు చేయకూడదు.
☘️☘️☘️ ఈ నియమం ప్రకారం 2025లో సెప్టెంబర్ 7వ తేదీన వచ్చే చంద్ర గ్రహణానికి ఆరు గంటల ముందు నుండే సూతకం వర్తిస్తుంది. ☘️☘️☘️

🌽🌽🌽🌽🌽🌽🌽

కనుక పై విషయాల ఆధారంగా 2025 సెప్టెంబర్ 5వ తేదీ, శుక్రవారం అనంత చతుర్దశి అయినప్పటికీ, గ్రహణం మరియు శుక్రవారం నిమజ్జనం చేయకూడదనే ఆచారాల కారణంగా, సెప్టెంబర్ 6, శనివారం నాడు నిమజ్జనం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా, చంద్ర గ్రహణం సెప్టెంబర్ 7న కాబట్టి, సెప్టెంబర్ 6, శనివారం నాడు నిమజ్జనం చేయడం అనుకూలంగా ఉంటుంది.

🌹🌹 మంగళం మహాత్ 🌹🌹

21/11/2024
21/09/2024
18/09/2024

మహాలయ పక్షం అంటే ఏమిటి?

మహాలయ పక్షంలో ఏం చేయాలి?

సెప్టెంబర్17 నుండి అక్టోబర్ 2 వరకు
మనిషి ఎంతగా ఎదిగినా, ఎంత దూరం పయనించినా... తన మూలాలను మర్చిపోకూడదు. ఆ మూలాలే అతని జన్మకి, అతని సంస్కారానికీ, సంస్కృతికీ కారణం. అందుకనే ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలను తల్చుకునేందుకు కొన్ని సందర్భాలను ఏర్పరిచారు. వాటిలో ముఖ్యమైనవి మహాలయపక్షం రోజులు.
చనిపోయినవారి ఆత్మ తిరిగి జన్మించాలంటే అన్నాన్ని ఆశ్రయించే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది. శ్రాద్ధకర్మలు సరిగా నిర్వహించకపోతే మనిషికి ప్రేతరూపంలో సంచరిస్తూనే ఉంటాడని చాలా మతాలు నమ్ముతాయి. ఈ రెండు వాదనలూ నమ్మకపోయినా... పూర్వీకులను తల్చుకోవడం సంస్కారం అన్నది మాత్రం కాదనలేం కదా! అందుకు ఓ సందర్భమే మహాలయ పక్షం. భ్రాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకూ వచ్చే 15 రోజుల కాలాన్నీ మహాలయ పక్షమని అంటారు.

మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడుస్తాం కాబట్టి దీనికి పితృపక్షమని కూడా పేరు. ఇప్పటివరకూ మనం పితృదేవతలకు చేస్తున్న శ్రాద్ధకర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా ఈ పక్షంలో తర్పణాలని విడిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట. అంతేకాదు! మనకి రక్తసంబంధం లేని గురువులు, స్నేహితులకు కూడా ఈ సమయంలో తర్పణాలను వదలవచ్చు. కొందరికి పుత్రులు లేకపోవడం వల్ల శ్రాద్ధకర్మలు జరగకపోవచ్చు. అలాంటివారికి కూడా ఈ సమయంలో తర్పణాలను వీడవచ్చు.
మహాలయం పక్షంలోని ఒకో రోజుకీ ఒకో ప్రత్యేకత ఉంది. ఒకో కారణంతో చనిపోయినవారికి ఒకో రోజుని కేటాయించారు. క్రితం ఏడు చనిపోయినవారికీ, భర్త ఉండగానే చనిపోయినవారికీ, పిల్లలకీ, అర్థంతరంగా చనిపోయినవారికీ... ఇలా ఒకొక్కరికీ ఒక తిథినాడు తర్పణం విడవడం మంచిదని చెబుతారు. ఇలా కుదరకపోతే చివరి రోజు వచ్చే అమావాస్య నాడు తర్పణం వీడవచ్చని చెబుతారు. అందుకే ఆ అమావాస్య రోజుని ‘సర్వ పితృ అమావాస్య’ అని పిలుస్తారు.
ఈ మహాలయ అమావాస్య వెనుక ఓ చిత్రమైన కథ ప్రచారంలో ఉంది. కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి చేరుకున్నాడట. అక్కడ ఇంద్రుడు అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. బంగారం, వజ్రాలని అతని ముందు ఉంచి భుజించమన్నాడు. వాటిని చూసిన కర్ణుడికి ఆశ్చర్యం వేసింది. అన్నంతో తీరే ఆకలి బంగారంతో ఎలా తీరుతుందని అడిగాడు. ‘నీ జీవితకాలమంతా బంగారం, వజ్రాలను దానం చేశావు. కానీ నీ పితృదేవతలకు ఏనాడూ పిండప్రదానం చేసి ఎరగవు,’ అని బదులిచ్చాడట ఇంద్రుడు. దాంతో కర్ణుడు తన తప్పుని తెలుసుకుని, తన పితృదేవతలకు తర్పణాలు విడిచేందుకు ఓ పదిహేను రోజులు తిరిగి భూలోకం మీదకు పంపమని వేడుకున్నాడట. అలా కర్ణుడికి దక్కిన 15 రోజులే ఈ మహాలయ పక్షం.

మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున కనీసం ఒక భోక్తనన్నా పిలిచి పితృదేవతలకు తర్పణాలు వీడాలి. లేదా గయ వంటి పుణ్యక్షేత్రాలకు చేరుకుని అక్కడ శ్రాద్ధకర్మలు నిర్వహించాలి. లేదా తమ పితృదేవతలను స్మరిస్తూ ఎవరన్నా బ్రాహ్మణుడికి స్వయంపాకాన్ని దానం చేయాలి. మహాలయపక్షంలో అంతటా ఈ పితృకర్మలు జరుగుతాయి కాబట్టి పెద్ద పనులు వేటినీ చేపట్టకూడదనీ, దూరప్రయాణాలు (తీర్థయాత్రలు తప్ప) సాగించకూడదనీ అంటారు.

Address

Machilipatnam
Palakollu
521001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

9533221567

Website

Alerts

Be the first to know and let us send you an email when Sainada jothishyalayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share