JSP Parvathipuram Manyam

JSP Parvathipuram Manyam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JSP Parvathipuram Manyam, Political Party, Parvathipuram.

జనసేన పోరాటం.. సిద్ధించిన విజయం!"TIDCO బాధితులకు దక్కిన న్యాయం!"- గత ప్రభుత్వంలో పార్వతీపురం TIDCO బాధితుల కోసం అలుపెరగన...
22/08/2026

జనసేన పోరాటం.. సిద్ధించిన విజయం!
"TIDCO బాధితులకు దక్కిన న్యాయం!"

- గత ప్రభుత్వంలో పార్వతీపురం TIDCO బాధితుల కోసం అలుపెరగని పోరాటం చేసిన జనసైనికులందరికీ అభినందనలు. మాటిచ్చిన ప్రకారం కూటమి ప్రభుత్వంలో బాధితులకు న్యాయం జరగడం అభినందనీయం.

-జనసేన పార్టీ పార్వతీపురం నియోజకవర్గం

శాంతి, సహనం, ధైర్యసాహసాలతో ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా, ప్రాణాలను సైతం లెక్కచేయని ధీరుల పోరాట ఫలంగా భారతద...
15/08/2026

శాంతి, సహనం, ధైర్యసాహసాలతో ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా, ప్రాణాలను సైతం లెక్కచేయని ధీరుల పోరాట ఫలంగా భారతదేశానికి స్వాతంత్ర్యం దక్కింది.

79 ఏళ్లుగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న మనమందరం ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వారిని స్మరించుకోవడం, వారి త్యాగాలను గుర్తుచేసుకోవడం, వారి స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత.

భారతీయులందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

🚩గుచ్చిమి కుంకీ ఏనుగుల శిబిరాన్ని మరియు కుంకీ ఆపరేషన్ పనులను వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ "పవన్ కళ్యాణ్"...
29/07/2026

🚩గుచ్చిమి కుంకీ ఏనుగుల శిబిరాన్ని మరియు కుంకీ ఆపరేషన్ పనులను వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ "పవన్ కళ్యాణ్" గారు.

25/07/2026

🚩మన్యం జిల్లాకు కుంకీ ఏనుగులను పంపిన డిప్యూటీ సీఎం శ్రీ "పవన్ కళ్యాణ్" గారికి హృదయపూర్వక ధన్యవాదాలు – చందక అనీల్ పార్వతీపురం జనసేన పార్టీ.

🚩ఏనుగుల సమస్యకు పరిష్కారంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు!

పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలను, రైతన్నలను గత కొంతకాలంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న గజరాజుల సమస్యపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించి, ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు 'కుంకీ ఏనుగులను' పంపించడం పట్ల పార్వతీపురం జనసేన పార్టీ నాయకులు "చందక అనీల్" నియోజకవర్గ నాయకులు, జనసైనికులు తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో మన్యం ప్రాంతంలో ఏనుగుల వల్ల పంట నష్టపోయిన రైతుల బాధలను, ప్రాణభయంతో కాలం గడుపుతున్న ప్రజల కష్టాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చూశారు. అధికారంలోకి రాగానే అటవీ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి, ఈ సమస్య తీవ్రతను గుర్తించి, అడవి ఏనుగులను అదుపు చేసేందుకు అనుభవజ్ఞులైన కుంకీ ఏనుగుల బలగాలను మన్యం జిల్లాకు తరలించే చర్యలు చేపట్టారని, మాట ఇస్తే వెనకడుగు వేయని నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారని ఈ చర్యతో మరొకసారి నిరూపితమైంది అని. పాలన అంటే కేవలం హమీలు ఇవ్వడం కాదు... ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించడమేనని ఆయన చేసి చూపించారు అని అన్నారు. ఈ సందర్బంగా మన్యం జిల్లా ప్రజల తరఫున, రైతాంగం తరఫున మరియు జనసేన పార్టీ శ్రేణుల తరఫున డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. కుంకీ ఏనుగుల రాకతో త్వరలోనే మన ప్రాంతంలో ఏనుగుల ఉపద్రవం తగ్గి, రైతన్నలకు ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నాం అని అన్నారు.

23/07/2026

భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని విప్లవకారుడు, బ్రిటీషర్లకు సింహ్వప్నంగా నిలిచి 24 ఏళ్లకే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన యువ విప్లవ వీరుడు చంద్రశేఖర్ అజాద్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు.

23/07/2026

భారత స్వాతంత్ర్యోద్యమ మూలకర్తల్లో ఒకరు, దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని జాతీయోద్యమంలో పాల్గొనేలా చేసిన భారతజాతీయోద్యమ పిత శ్రీ బాలగంగాధర తిలక్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు.

22/07/2026
🚩జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ "పవన్ కళ్యాణ్" గారి ఆదేశాల మేరకు MLC లో శ్రీ "నాగబాబు" గారి ఆధ్వర్యంలో అరకు పార్లమెంట్ - ప...
05/07/2026

🚩జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ "పవన్ కళ్యాణ్" గారి ఆదేశాల మేరకు MLC లో శ్రీ "నాగబాబు" గారి ఆధ్వర్యంలో అరకు పార్లమెంట్ - పార్వతీపురం నియోజకవర్గం దరఖాస్తుల స్వీకరణ రెండువో రోజూ.

"పార్వతీపురానికి విచ్చేస్తున్న MLC నాగబాబు గారు"- మన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, PAC మెంబర్, గౌరవనీయులు MLC ...
01/07/2026

"పార్వతీపురానికి విచ్చేస్తున్న MLC నాగబాబు గారు"

- మన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, PAC మెంబర్, గౌరవనీయులు MLC శ్రీ "కొణిదెల నాగబాబు" గారికి పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు, జనసైనికుల, నాయకులు, వీరమహిళల తరపున హృదయపూర్వక స్వాగతం.. సుస్వాగతం!💐✊

🗓 తేది: జూలై 2, ఉదయం 9 గంటలకు
📍 ప్రదేశం: బాను కన్వెన్షన్, TBR ఎదురుగా, నర్శిపురం.

- చందక అనీల్
పార్వతీపురం – అరుకు పార్లమెంట్ జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ సభ్యులు

Address

Parvathipuram

Website

Alerts

Be the first to know and let us send you an email when JSP Parvathipuram Manyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share