CPM PMD

CPM PMD communist party of marxist (cpm)

పార్వతిపురం మన్యం జిల్లా సెప్టెంబర్ 3₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹ * **గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్ల గ్రీన్ గార్డుల సమస్యను పరిష...
03/09/2026

పార్వతిపురం మన్యం జిల్లా సెప్టెంబర్ 3
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
* **గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్ల గ్రీన్ గార్డుల సమస్యను పరిష్కారం చేయాలని, ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని రెండో రోజు కొనసాగిన దీక్షలు ఈ సందర్భంగా చర్చి సెంటర్లో మానవహారం చేసి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసి జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ వారికి వినతి పత్రం అందించడం జరిగింది* *
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్స్ యూనియన్ (సిఐటియు)

*ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు, జె గౌరీ, చంటి*,
*సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ* యమ్మల మన్మధరావు
గ్రామ పంచాయతీ గ్రీనంబసిడర్స్ గ్రీన్ గార్డ్స్ కి నెలలు తరబడి,సంవత్సరాలు తరబడి జీతాలు చెల్లించకపోతే ఏ విధంగా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు,పెండింగ్ జీతాలు . మున్సిపల్ కార్మికులు మాదిరిగా 21000 జీతం చెల్లించాలని మాస్కులు గ్లౌజులు యూనిఫామ్ గమ్ బూట్లు ఇవ్వాలని 10 లక్షల రూపాయలతో కూడిన ఇన్సూరెన్స్ సౌకర్యం దాన సంస్కరణలకు 20,000 ఇవ్వాలని ప్రతినెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి 132,142,680, జీవోలు అమలు చేయాలని హెల్త్ అలవెన్స్ ₹4,000 అమలు చేయాలని తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించి, జిల్లా కలెక్టర్ గారు సమస్యలు పరిష్కారం చేయకుండా ఆదివారం కూడా పని చేయండి అని చెప్పడం పనిచేసిన కాలానికి నెలలు తరబడి చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసం అని వీళ్ళందరూ దళితులు గిరిజనులు బిసి పేదలు ఉన్నారని ఒకపక్క ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటే ఈ విధంగా గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్ వేధించడం పద్ధతి కాదు తక్షణమే పెండింగ్ జీతాలు జిల్లా కలెక్టర్ గారు చెల్లించాలని కోరారు, గతంలో పంచాయతీ అధికారులు సర్పంచులు జీతాలు సక్రమంగా చెల్లించలేదు. ఇప్పుడు స్పెషల్ అధికారులు పరిపాలన వచ్చిన దగ్గర నుండి మరియు గత పంచాయతీ పరిపాలన నుండి మాకు సక్రమంగా జీతాలు రావట్లేదు మేము గ్రామములో పారిశుధ్యం పనులు చేస్తూ వేరే పనులకు వెళ్ళలేక పోతున్నాము ఇస్తున్న 6000 కూడా సక్రమంగా ఇవ్వకపోతే భార్య పిల్లలతో ఏ విధంగా బ్రతుకుతాము అయ్యా మాకు జీతాలు చెల్లించి మమ్ములను ఆదుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 2,3 తేదీల్లో అన్ని కలెక్టరేట్ కార్యాలయం ముందు జరుగుతున్న నిరాహార దీక్షలు మరియు ధర్నాలో పాల్గొన్న గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్స్ కార్మికులందరికీ ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు *గొర్లి వెంకటరమణ వి,ఇందిరా,బివి,రమణ , ఆర్ వేణు,బొంకుర సూరిబాబు, ఫకీరు, వెంకటి గుండయ్య, రాము, సింహాచలం, గౌరీ*, తదితరులు పాల్గొన్నారు.

పార్వతిపురం మన్యం జిల్లా సెప్టెంబర్ 2 ₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹ * *గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్ల గ్రీన్ గార్డుల సమస్యను పరిష...
02/09/2026

పార్వతిపురం మన్యం జిల్లా సెప్టెంబర్ 2
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
* *గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్ల గ్రీన్ గార్డుల సమస్యను పరిష్కారం చేయాలని, ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని, 21000 జీతం ఇవ్వాలని* *పార్వతిపురం ధర్నా చౌక్ లో సెప్టెంబర్ 2,3, నిరసన దీక్షలు ప్రారంభం*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్స్ యూనియన్ (సిఐటియు)

*ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు, జె గౌరీ అధ్యక్షతన జరిగిన నిరసన దీక్షని ప్రారంభించి మాట్లాడిన*
*సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, సిఐటియు నాయకులు బివి రమణ, వి, ఇందిరా, ఆర్ వేణు, మాట్లాడుతూ*
గ్రామ పంచాయతీ గ్రీనంబసిడర్స్ గ్రీన్ గార్డ్స్ కి నెలలు తరబడి,సంవత్సరాలు తరబడి జీతాలు చెల్లించకపోతే ఏ విధంగా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు,పెండింగ్ జీతాలు . మున్సిపల్ కార్మికులు మాదిరిగా 21000 జీతం చెల్లించాలని మాస్కులు గ్లౌజులు యూనిఫామ్ గమ్ బూట్లు ఇవ్వాలని 10 లక్షల రూపాయలతో కూడిన ఇన్సూరెన్స్ సౌకర్యం దాన సంస్కరణలకు 20,000 ఇవ్వాలని ప్రతినెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి 132,142,680, జీవోలు అమలు చేయాలని హెల్త్ అలవెన్స్ ₹4,000 అమలు చేయాలని తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించి, జిల్లా కలెక్టర్ గారు సమస్యలు పరిష్కారం చేయకుండా ఆదివారం కూడా పని చేయండి అని చెప్పడం పనిచేసిన కాలానికి నెలలు తరబడి చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసం అని వీళ్ళందరూ దళితులు గిరిజనులు బిసి పేదలు ఉన్నారని ఒకపక్క ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటే ఈ విధంగా గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్ వేధించడం పద్ధతి కాదు తక్షణమే పెండింగ్ జీతాలు జిల్లా కలెక్టర్ గారు చెల్లించాలని కోరారు, గతంలో పంచాయతీ అధికారులు సర్పంచులు జీతాలు సక్రమంగా చెల్లించలేదు. ఇప్పుడు స్పెషల్ అధికారులు పరిపాలన వచ్చిన దగ్గర నుండి మరియు గత పంచాయతీ పరిపాలన నుండి మాకు సక్రమంగా జీతాలు రావట్లేదు మేము గ్రామములో పారిశుధ్యం పనులు చేస్తూ వేరే పనులకు వెళ్ళలేక పోతున్నాము ఇస్తున్న 6000 కూడా సక్రమంగా ఇవ్వకపోతే భార్య పిల్లలతో ఏ విధంగా బ్రతుకుతాము అయ్యా మాకు జీతాలు చెల్లించి మమ్ములను ఆదుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 2,3 తేదీల్లో అన్ని కలెక్టరేట్ కార్యాలయం ముందు జరుగుతున్న నిరాహార దీక్షలు మరియు ధర్నాలో పాల్గొన్న గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్స్ కార్మికులందరికీ ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బొంకుర సూరిబాబు, ఫకీరు, వెంకటి గుండయ్య, రాము, సింహాచలం, గౌరీ, తదితరులు పాల్గొన్నారు.

*పార్వతీపురం*తేది:02.09.2026*ఇదేనా ప్రజా పరిపాలన?**కూటమి నేతల ప్రగల్భాలు ఆపి "పార్వతీపురం మున్సిపల్ అధికారుల" ఖాళీలు భర్...
02/09/2026

*పార్వతీపురం*
తేది:02.09.2026

*ఇదేనా ప్రజా పరిపాలన?*
*కూటమి నేతల ప్రగల్భాలు ఆపి "పార్వతీపురం మున్సిపల్ అధికారుల" ఖాళీలు భర్తీ చేయండి....సిపిఎం డిమాండ్!*. """''''""""""""""""""""""""''''''''''''''
*పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ పోస్ట్ ఖాళీ!*
*టౌన్ ప్లానింగ్ అధికారి పోస్ట్ ఖాళీ! ఇంజినీరింగ్ అధికారుల పోస్టులు ఖాళీ! రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఖాళీ! మేనేజర్ పోస్ట్ ఖాళీ....*
ఇదీ పార్వతీపురం జిల్లా కేంద్రంలోని గ్రేడ్ 1 మున్సిపాలిటీ దుస్థితి.... ఒక ప్రక్కేమో జిల్లాకు అవార్డులు మోత! ఇంకో వైపు పాలన తీరులో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ఈ దుస్థితికి రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లాకు చెందిన మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలని, తక్షణమే పార్వతీపురం మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న అన్ని విభాగాల అధికారుల పోస్టులు భర్తీ చేసి పాలన గాడి లో పెట్టాలని *సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు* డిమాండ్ చేశారు...
ఈ మేరకు బుధవారం పార్వతీపురం సుందరయ్య భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు పరిపాలన దక్షుడిగా అధికార కూటమి నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని ఆయన నాయకత్వంలో ఒక జిల్లా కేంద్రంలోనే ఇలాంటి దుస్థితి ఉండడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వ పథకాలను, విధానాలను జిల్లా కేంద్రంలో అమలు చేయాల్సిన చోటే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రమంతా ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా అధికారులకు ప్రచార ఆర్భాటం తప్ప పాలనలో చిత్త శుద్ధి లేదు అనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. జిల్లాలో ఒక ప్రక్క విద్యాసంస్థల్లో బాల,బాలికల కు రక్షణ లేకుండా పోయిందని, మరోపక్క పట్టణ ప్రాంతాలలో ప్రజలు పరిశుభ్రమైన త్రాగునీరు లేక, పారిశుద్ధ్యం బాగోలేక ప్రజలకు సమస్యలు వెంటాడు తున్నాయని, ఈ సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు లేకుండా ఏ రకంగా ప్రజలకు మేలు జరుగు తుందని? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవిధంగా పరిష్కరించ బడతాయని విమర్శించారు. తక్షణమే జిల్లా కలెక్టర్, రాష్ట్రస్థాయి అధికారులు చొరవ తీసుకొని పార్వతీపురం మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు... లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పాలనా నిర్లక్ష్యానికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.. ఈ సమావేశంలో *సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి వి రమణ, గొర్లి వెంకటరమణ కే రామస్వామి* తదితరులు పాల్గొన్నారు.

*మద్దాలవారి వీధిలో కాలువ పనులు పూర్తి చేయాలి*• సిపిఎం పట్టణ కమిటీ డిమాండ్ • పార్వతీపురం మున్సిపల్ ఎఫ్ఎసి కమిషనరుకు వినతి...
25/08/2026

*మద్దాలవారి వీధిలో కాలువ పనులు పూర్తి చేయాలి*
• సిపిఎం పట్టణ కమిటీ డిమాండ్
• పార్వతీపురం మున్సిపల్ ఎఫ్ఎసి కమిషనరుకు వినతి

పార్వతీపురం పట్టణం 25వ వార్డులో గల కాలువ నిర్మాణ పనులు చేపట్టి మూడు నెలలు కావస్తున్న నేటికీ పూర్తి చేయకపోవడం అన్యాయమని సిపిఎం పార్వతిపురం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పార్వతీపురం స్థానిక మున్సిపల్ ఎఫ్ఎసి కమిషనర్ శ్రీనివాసరాజుకు పట్టణ కమిటీ సభ్యులు బి.సూరిబాబు, పి.రాజశేఖర్ తో కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ పట్టణంలో అభివృద్ధి పనుల్లో భాగంగా 25 వ వార్డు మద్దాలవీధిలో పాత కాలువలు తొలగించి కొత్త కాలువలు నిర్మాణ పనులు ప్రారంభించి మూడు నెలలు గడిచిందని, అయినా నేటికీ పూర్తిస్థాయిలో పనులు పూర్తి కాకపోవడం అన్యాయమని అన్నారు. వీధికి రెండు వైపులా కాలువల నిర్మాణంలో ఒకవైపు కొంత భాగం పూర్తయిన, మరోవైపు పూర్తిగా పనులు కాలేదని తెలిపారు. రోడ్డుకు కాలువ గట్టుకు మధ్యనున్న భాగాన అరకొర మట్టీలు వేయడం వలన వర్షం సందర్భంలో పూర్తిగా వీధి మొత్తం చెరువుల మారే పరిస్థితి ఉంటుందని అన్నారు. కాలువ పనులు పూర్తి చేయకపోవడం వలన ఇంటి నుంచి బయటకు వచ్చే మహిళలు, బాలింతలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ మధ్యన ఇంటికి రోడ్డుకి వేసిన బల్లపై నడుస్తున్న ఒక యువకుడు జారి పడిపోవడంతో తన చేతి భుజానికి తీవ్రమైన గాయం అయిందనే విషయాన్ని వివరించారు. కాలువ ప్రక్కనే కొళాయిలు ఉండడంతో కుళాయిలు వస్తున్న సందర్భంలో మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువల నిర్మాణం వలన ఇళ్లకు బయట నుండే అరుగులు, గట్లు పూర్తిగా తొలగించేసారని, ఇప్పుడు వాటి నిర్మాణం కొరకు సుమారుగా 25 వేల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉందని గుర్తు చేశారు. కావున వెంటనే తమరు కలుగజేసుకొని పెండింగ్లో ఉన్న కాలువ పనులు పూర్తి చేయాలని, వర్షం నీరు నేరుగా కాల్వల్లోకి వెళ్ళేటట్లు చర్యలు చేపట్టాలని కోరారు. లేకుంటే భవిష్యత్తులో మద్దాలవీధి ప్రజలందరితో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

*తేదీ 24-08-2026పార్వతీ పురం **సారంపల్లి మల్లారెడ్డి గారికి సిపిఎం నివాళి*"పార్వతీపురం మన్యం జిల్లా బెలగాం సుందరయ్య భవన్...
24/08/2026

*తేదీ 24-08-2026
పార్వతీ పురం
**సారంపల్లి మల్లారెడ్డి గారికి సిపిఎం నివాళి*"
పార్వతీపురం మన్యం జిల్లా బెలగాం సుందరయ్య భవన్లో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసు అధ్యక్షతన సారంపల్లి మల్లారెడ్డికి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, పార్టీ సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తిగారు మాట్లాడుతూ సారంపల్లి మల్లారెడ్డి గారు సిపిఎం పార్టీలో నిబద్ధతతో పని చేశారని, నిజాయితీతో పని చేశారని, పేదల సమస్యల పట్ల అకుంఠిత దీక్షతో పోరాటాలు చేశారని అన్నారు, రైతాంగ సమస్యల పట్ల పూర్తి అవగాహనతో పని చేశారని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఆల్ ఇండియా రైతు సంఘం నాయకులుగా దీర్ఘకాలం పని చేస్తూ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు గిట్టుబాటు ధరలు, సాగునీటి సమస్యలు పై పోరాడారని ఆంధ్ర రాష్ట్రంలో సాగునీటి వనరులపై దీర్ఘకాలంగా అధ్యయనం చేశారని అన్నారు, అలాగే ఈరోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై పై పోరాటాలకు మల్లారెడ్డి లేకపోవడం తీరని లోటు అని అన్నారు మల్లారెడ్డి గారు ఆశయాలను కార్యకర్తలు అందరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గేదెల సత్యనారాయణ, సిఐటియు నాయకులు ఎన్ .వై నాయుడు, బివి రమణ, గొర్లి వెంకటరమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ధావాల రమణారావు గారు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు, అధ్యక్షులు మర్రి శ్రీనివాసరావు, నాయకులు కొల్లి సాంబమూర్తి, కె వి పి ఎస్ నాయకులు దుర్గారావు, నారాయణపురం సింహాచలం, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కడ్రక రామస్వామి కూరంగి సీతారాం, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు హిమరిక సింహాచలం, డి వై ఎఫ్ ఐ నాయకుడు తాడంగి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

*పార్వతీపురం*తేది:24.08.2026*"దళిత" పేటలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి!**జనాభా ప్రాతిపదికన దళిత సంక్షేమానికి బడ్జెట్ లలో ...
24/08/2026

*పార్వతీపురం*
తేది:24.08.2026

*"దళిత" పేటలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి!*
*జనాభా ప్రాతిపదికన దళిత సంక్షేమానికి బడ్జెట్ లలో నిధులు కేటాయించాలి,బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి!*
*-కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, ప్రజా సంఘాల డిమాండ్*
"'"''"'"""""""""""""''''''''''
దళితవాడలో మౌలిక వసతులు కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సామాజిక శంఖారావం కార్యక్రమాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, సిఐటియు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో.. గత నెల రోజులుగా జిల్లాలోని దళిత పేటలు, వీదులలో సర్వే నిర్వహించి సమస్యలను గుర్తించడం జరిగిందని, ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్వతీపురం ఆర్ టి సి కాంప్లెక్స్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.. ఈ సందర్భంగా *కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఎం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరిక అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు కొల్లి గంగునాయుడు, జిల్లా కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై మన్మధరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి వేణు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసు, ఐద్వా జిల్లా కార్యదర్శి బి లక్ష్మి* తదితరులు మాట్లాడుతూ...
స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడిచినప్పటికీ నేటికీ దళితుల బ్రతుకులు దుర్భరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు, నేటికీ కులవివక్ష, అంటరానితనం సమాజంలో ఉండటం సిగ్గుచేటని విమర్శించారు... జనాభా ప్రాతిపదిక న ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడం వలన దళిత పేటలో సిసి రోడ్లు, వీధి కాలువలు నిర్మాణం చేపట్టడం లేదని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు చేసే దిశగా పాలకులు ప్రయత్నించాలని డిమాండ్ చేశారు.. నేటికీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం వలన దళిత నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.. నేటికీ దళితులకు స్మశాన వాటికలు కూడా లేని పరిస్థితి తమ సర్వేల గుర్తించామని ఆందోళన వ్యక్తం చేశారు, దళితులను వివిధ రాజకీయ పక్షాలు ఓటు బ్యాంకుగా చూస్తున్నాయి తప్ప దళితులు సంక్షేమానికి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఐప్పటికైనా దళితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు *ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు డి రమణారావు, ఉపాధ్యక్షులు ఎన్ వై నాయుడు, కార్యదర్శి బి వి రమణ, నాయకులు గొర్లి వెంకటరమణ, గవర వెంకటరమణ, బి సూరిబాబు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గేదెల సత్యనారాయణ, ఐద్వా జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీదేవి, భవాని, గిరిజన సంఘం నాయకులు కే రామస్వామి, కె సీతారాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి కొల్లి సాంబమూర్తి ,డివైఎఫ్ఐ నాయకులు పి రాజశేఖర్, కెవిపిఎస్ నాయకులు దుర్గారావు, సింహాచలం, కె గౌరీశ్వర రావు* తదితరులు పాల్గొన్నారు.. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్ లో వివిధ మండలాలలో దళిత సమస్యలకు వచ్చిన దరఖాస్తులను అందజేయడం జరిగింది.

24/08/2026

కులవివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం

సామాజిక సంకారావం పిలుపులో భాగంగా పార్వతీపురం 30 వ వార్డులో గల పైడివీధి, 1 వ వార్డులో గల గాసీవీధిలో, 9 వ వార్డులో గల స్వీ...
23/08/2026

సామాజిక సంకారావం పిలుపులో భాగంగా పార్వతీపురం 30 వ వార్డులో గల పైడివీధి, 1 వ వార్డులో గల గాసీవీధిలో, 9 వ వార్డులో గల స్వీపరువీధిల్లో దళితులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల దరఖాస్తుపై సంతకాలు సేకరణ చేస్తూ, రేపు సోమవారం (24.08.2026) కలెక్టరేట్ ధర్నాకు కదలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, పట్టణ నాయకులు బి.సూరిబాబు, పి.రాజశేఖర్ మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

తేదీ:-19/08/2026న. ఈరోజు చినకంబ గ్రామంలో కామ్రేడ్ బిడ్డిక . అప్పారావుగారు సంతాప సభ జరిగింది. ఈ సంతాప సభ ఆరిక. భాస్కర్ రా...
19/08/2026

తేదీ:-19/08/2026న. ఈరోజు చినకంబ గ్రామంలో కామ్రేడ్ బిడ్డిక . అప్పారావుగారు సంతాప సభ జరిగింది. ఈ సంతాప సభ ఆరిక. భాస్కర్ రావు గారు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అధ్యక్షతన జరిగింది.ఈ సంతాప సభకి కామ్రేడ్ ఎం తిరుపతిరావు సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ అప్పారావు గారు 55 సంవత్సరాలు పాటు సుదీర్ఘంగా ప్రజా ఉద్యమాలను పాల్గొని అనేక పోరాటాలు త్యాగాలు చేశారని వివరించారు. , ఎం నాగేశ్వరరావు టీచర్ కామ్రేడ్ అప్పారావు గారు మాకు ఆదర్శమని అన్నారు. కామ్రేడ్ రమణారావు గారు‌ సిఐటియు జిల్లా అధ్యక్షులు నేను 17 సంవత్సరాల నుంచి అప్పారావు గారు పరిచయం ఉంది అతని ఆశయాలు సాధిస్తాం అని అన్నారు. కామ్రేడ్ పి కుమార్ గారు 16 సంవత్సరాల నుండి మేము అనేక ఉద్యమాలు పోరాటాలు గడపమని అప్పారావు చిన్నప్పటినుండి పోరాటంలో స్ఫూర్తిదాయకమని అన్నారు. పాలక పకీర్ టీచర్ యూటీఎఫ్ మండల కార్యదర్శి అప్పారావు గారు విద్యార్థి జీవితం నుండి మాకు అడుగుజాడల్లో నడిచామని విద్యార్థి యువజన సంఘాలను పనిచేశామని వివరించారు. అన్యాజీ రావు గారు అప్పారావు నా సోదరుడు చిన్నప్పటి నుండి కలిసి జీవించాము నాకు సిద్ధాంతాలు ఉద్యమాల కొరకు నేర్పించి ఒక ఎంపీటీసీగా ఎదిగాను అతను ఆశయాలు కొనసాగిస్తామని అన్నారు. పాలకు సాంబయ్య గారు అప్పారావు గారు 35 సంవత్సరాల నుండి నాకు అతనితోనే అనేక పోరాటాల్లో ఉద్యమాల్లో కలిసి పనిచేశాను అనేక గైడెన్స్ నాకు ఇచ్చారని అన్నారు. తదితరులు ఈ సభకి పాల్గొన్నారు. #𝐏𝐚𝐥𝐚𝐤𝐨𝐧𝐝𝐚𝐂𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲

*పార్వతీపురం*తేది:19.08.2026*పార్వతీపురం పాత బస్టాండ్ రోడ్డు మరమ్మత్తులు వెంటనే చేయాలి!*  *-సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ ...
19/08/2026

*పార్వతీపురం*
తేది:19.08.2026

*పార్వతీపురం పాత బస్టాండ్ రోడ్డు మరమ్మత్తులు వెంటనే చేయాలి!* *-సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులకు వినతి!*
""'''''""""''''"""""''''''''''''''''''''''
పార్వతీపురం పట్టణంలోని ప్రధాన రహదారి పాత బస్టాండ్ వద్ద రోడ్డు మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని *సిపిఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, బి వి రమణ* డిమాండ్ చేశారు....
బుధవారం సిపిఎం పార్టీ పార్వతీపురం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ మేనేజర్ ఈశ్వరరావు గారికి వినతిపత్రం సమర్పించారు... ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... పట్టణమంతా అభివృద్ధి చేస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వ పెద్దలకు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న పాత బస్టాండ్ రోడ్డు మరమ్మత్తులు చేయాలని అనిపించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు, మున్సిపాలిటీకి చెందిన రహదారిపై భారీ వాహనాలు ప్రయాణిస్తున్నాయనే నెపంతో మున్సిపల్ అధికారులు బాధ్యత విస్మరించడం సరికాదని విమర్శించారు, ఈ రోడ్డు పట్ల ఆర్ అండ్ బి అధికారులు, మున్సిపల్ అధికారులు తమ బాధ్యతను విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు..నిత్యం వందలాది భారీ వాహనాలు, ఆటోలు, వాణిజ్య వాహనాలు తిరుగుతున్న ఈ రోడ్డు పట్ల మున్సిపల్ అధికారులకు ఇంత నిర్లక్ష్యం దేనికని విమర్శించారు. తక్షణమే పాత బస్టాండ్ రోడ్ మరమ్మత్తులు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టాలని డిమాండ్ చేశారు, లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను కదిలించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల *బి సూరిబాబు, పి రాజశేఖర్, కె గౌరీశ్వరరావు సిరియాల శ్రీనివాస్, నాగభూషణం, కృష్ణ, ఖాళీ,ధర్మారావు, పోలినాయుడు,లక్ష్మణరావు* తదితరులు పాల్గొన్నారు.

Address

Kralitivari Street Opp, Belagam, Mainroad
Parvathipuram
PARVATHIPURAM

Website

Alerts

Be the first to know and let us send you an email when CPM PMD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CPM PMD:

Shortcuts

Share