SFI Parvathipuram Manyam District

SFI Parvathipuram Manyam District social service

10/12/2025
*ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం* • జిల్లా మహాసభల్లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్. వెంకటేష్ పిలుపు • ఎస్ఎఫ్ఐ...
10/12/2025

*ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం*
• జిల్లా మహాసభల్లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్. వెంకటేష్ పిలుపు
• ఎస్ఎఫ్ఐ 33 వ జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులు హెచ్.సింహాచలం, బి.అనిల్

జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం పార్వతీపురం స్థానిక గిరిజన సామాజిక భవనంలో ఎస్ఎఫ్ఐ 33వ జిల్లా మహాసభ జరిగింది. మొదటగా మహాసభ ప్రారంభ సూచికగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టి.అఖిల్ సంఘం లక్ష్యాలతో కూడిన ఎస్ఎఫ్ఐ జండాను ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ వెంకటేష్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందు, బి.అనిల్, సురేష్ అధ్యక్షతన జరిగిన ప్రతినిధుల సభలో సిహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన విద్యా విధానం అమలులో భాగంగా ప్రభుత్వ విద్యా విధానం అత్తలా కుత్తలం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా గుర్తింపుగా నిలిచిన ప్రాథమిక పాఠశాలలను అనేక సంస్కరణ మార్పులతో నిర్వీర్యం చేసే చర్యలు చేపడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన 117 జీవోలను రద్దు చేస్తామనే విషయాన్ని విస్మరించడం చాలా అన్యాయం అని మండిపడ్డారు. ఉపాధ్యాయులు గతం కంటే నేడు మరో రూపంలో దాడికి గురవుతున్నారని పేర్కొన్నారు. సిబ్బంది, తదితరుల వేతనాల పెంపుధలపై ఎటువంటి చర్యలు చేపట్టకుండా పనిభారాలు పెంచే కుట్రలు చేపడుతుందని, అనేక పని ప్రదేశాలలో రాజకీయ వేధింపులు తాళలేక సిబ్బందులు విధుల నుండి వైదొలగే పరిస్థితులు కనిపిస్తుందని అన్నారు. పిటిఎంల సంబరాలు ప్రభుత్వ పథకాల ప్రచారం కొరకు కాకుండా పాఠశాలల సమస్యలు పరిష్కార దిశగా కృషి చేయాలని కోరారు. సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కరువైందని, చాలీచాలని గదులతో, సొంత భవనాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పాలవుతున్నారని అన్నారు.
*తీర్మానాలు అమోదం*
పార్వతీపురం, పాలకొండ, గమ్మలక్ష్మీపురం కేంద్రంలో పీజీ సెంటర్లు ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, గరుగుబిల్లి, సీతంపేట మండలాల్లో జూనియర్ కళాశాలలు నిర్మించాలని, సంక్షేమ హాస్టల్లో రెగ్యులర్ ఏఎన్ఎంలను నియమించాలని, అన్ని గ్రామాలలో బస్సు సౌకర్యాలు కల్పించాలని పలు తీర్మానాలను ప్రతినిధులందరూ ఆమోదించారు.
*15 మందితో నూతన జిల్లా కమిటీ ఎన్నిక*
ఎస్ఎఫ్ఐ నూతన జిల్లా అధ్యక్షులు హిమరిక సింహాచలం, జిల్లా కార్యదర్శి బిడ్డిక అనిల్, సహాయ కార్యదర్శులు టి.అఖిల్, ఎ.గంగారం, జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ , ఇందుతో పాటు మరో పదకొండు మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

కురుపం స్థానిక గురుకుల ప్రతిభ పాఠశాల విద్యార్థునులతో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ అఖిలభారత సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఐషిఘోష్ గార...
26/11/2025

కురుపం స్థానిక గురుకుల ప్రతిభ పాఠశాల విద్యార్థునులతో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ అఖిలభారత సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఐషిఘోష్ గారు

26/11/2025

కురుపం స్థానిక గురుకుల ప్రతిభ పాఠశాల విద్యార్థునులతో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ అఖిలభారత సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఐషిఘోష్ గారు...

కురుపం స్థానిక గురుకుల ప్రతిభ పాఠశాల విద్యార్థునులతో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ అఖిలభారత సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఐషిఘోష్ గార...
26/11/2025

కురుపం స్థానిక గురుకుల ప్రతిభ పాఠశాల విద్యార్థునులతో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ అఖిలభారత సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఐషిఘోష్ గారు...

మన పార్వతీపురంలో జోరుగా సాగుతున్న పుస్తక ప్రచారం నవంబర్ 25 నుండి డిసెంబర్ 5 వరకు జీ.జే.కాలేజ్ గ్రౌండ్, పార్వతీపురంపార్వత...
23/11/2025

మన పార్వతీపురంలో జోరుగా సాగుతున్న పుస్తక ప్రచారం
నవంబర్ 25 నుండి డిసెంబర్ 5 వరకు
జీ.జే.కాలేజ్ గ్రౌండ్, పార్వతీపురం
పార్వతీపురం మన్యం జిల్లా పుస్తక మహోత్సవం

*పార్వతిపురం జిల్లా కేంద్రంలో గల సంక్షేమ హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి DRO వినతిపత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు...
17/11/2025

*పార్వతిపురం జిల్లా కేంద్రంలో గల సంక్షేమ హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి DRO వినతిపత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు*

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.అఖిల్ మాట్లాడుతూ...... పార్వతీపురం జిల్లా కేంద్రంలో గల పోస్ట్మెట్రిక్ కాలేజీ బాయ్స్ హాస్టల్లో సుమారు 300 మంది విద్యార్థులు చదువుతున్నారు. 300 మంది విద్యార్థులకు 24 బాత్ రూములు ఉన్నాయి. 20 బాత్ రూమ్స్ పాడైపోయాయి. 4 బాత్రూమ్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. ఆర్వో ప్లాంట్ పని చేయడం లేదు. ఎలక్ట్రానిక్ మోటార్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. వర్కర్స్ లేక సమయానికి భోజనం అందించలేని పరిస్థితి ఈరోజు ఆ హాస్టల్లో ఉంది. ఎస్సీ -2 కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో సుమారు 50 మంది విద్యార్థులు చదువుతున్నారు. 50 మంది విద్యార్థులకు రెండు బాత్రూమ్స్, ప్రైవేట్ బిల్డింగా ఉంది. అందులో ఒకటి రూమ్స్ లోపల ఉందని చెప్పి మూసి వేయడం జరిగింది. ఒక్క బాత్రూమ్ తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీసీ బాయ్స్ కాలేజ్ హాస్టల్ లో ప్రైవేట్ బిల్డింగ్గ లో కొనసాగుతుంది. వాష్ రూమ్స్, వాటర్, తదితర విషయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీసీ స్కూల్ గర్ల్స్ హాస్టల్ కూడా ప్రైవేట్ బిల్డింగా కొనసాగుతుంది. అక్కడ ఎటువంటి మౌలిక వసతులు లేవు. పెచ్చులు ఊడిపోయే పరిస్థితి ఆ బిల్డింగ్ ఉంది. పశువుల పాకల ముందు హాస్టల్ ని కొనసాగిస్తున్నారు. పార్వతీపురం బెలగాం గిరిజన బాలులు ఆశ్రమ పాఠశాలలో వసతి గదులకు మెస్సులు లేవు. 250 మంది విద్యార్థులకు 9 బాత్రూంలో ఉన్నాయి, అందులో నాలుగు పాడైపోయాయి. ఐదు బాత్రూమ్స్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంటగదికి ఎదురుగా మురికి కాలువ పారుతుంది. నీరు నిల్వ ఉండి దోమలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రహరీ గోడ లేక పందులు పశువులు లోపలికి వస్తున్నాయి. బిసి గర్ల్స్ హాస్టల్ ప్రైవేట్ బిల్డింగా కొనసాగుతుంది. అక్కడ కూడా విద్యార్థులు వాటర్ తో ఇబ్బంది పడుతున్నారు. కనుక విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకొని సంక్షేమ హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తారని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో పార్వతీపురం పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు కే రాజేష్, ఎం. సంజీవ్ పట్టణ కమిటీ సభ్యులు ఎం.వికాస్ పాల్గొన్నారు.

*•మరణించిన విద్యార్థులకు 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి.**•హాస్టల్, ఆశ్రమ పాఠశాలలో ANM లను నియమించాలి.**ఎస్ఎఫ్ఐ డి...
04/11/2025

*•మరణించిన విద్యార్థులకు 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి.*
*•హాస్టల్, ఆశ్రమ పాఠశాలలో ANM లను నియమించాలి.*
*ఎస్ఎఫ్ఐ డిమాండ్*

మరణించిన విద్యార్థులకు 50 లక్షల ఎక్స గ్రేషియా ప్రకటించాలని, ఆశ్రమ పాఠశాలలో ఆరోగ్య కార్యకర్తలను నియమించాలని కోరుతూ గుమ్మలక్ష్మీపురం స్థానిక పోస్టుమెట్రిక్ హాస్టల్ నుంచి ఎల్విన్ పేట సెంటర్ వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ఎల్విన్ పేట సెంటర్ లో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ గుమ్మలక్ష్మీపురం మండల కార్యదర్శి ఆరిక.గంగారావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు అనారోగ్యంతో ఈ మధ్యకాలంలో చనిపోతున్నారని దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, మన్యం జిల్లా ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచిపోయిన జిల్లాలోని హాస్టల్స్ లో,పాఠశాలలో ఇప్పటికీ సరైన సదుపాయాలు లేవని. 600, 700 మంది విద్యార్థులకు 12,13 రూములే ఉన్నాయని ఒక్కో రూమ్ కి సుమారు 40 మంది వరకు చాలీ చాలని వసతులలో విద్యార్థులు చదువుతున్నారని. దీనివల్ల ఎవరికైనా అంటువ్యాధి చోకితే ఇతర విద్యార్థులకు కూడా చాలా త్వరగా వ్యాపిస్తుందని. తక్షణమే అదనపు వసతి గృహాలను ఏర్పాటు చేయాలని. జిల్లావ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు,త్రాగడానికి ఆర్ఓ ప్లాంట్ లేవని ఇలా అయితే విద్యార్థుల అనారోగ్య పాలు కాకుండా ఎలా ఉంటారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. తక్షణమే కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మొదటి సంతకం అయినా ఆరోగ్య కార్యకర్తలు నియమకం హామీ ఏమైందని తక్షణమే ANM ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ లలో నియమించి విద్యార్థుల మరణాలను ఆపాలని. మరణించిన విద్యార్థులకు 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున గిరిజన సంఖం శాఖ మంత్రి ఇంటిని ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గుమ్మలక్ష్యం పురం మండలం కమిటీ సభ్యులు బి.దేవా ఎ.సాయి ఎం. ప్రభాస్ బి. శ్రీను పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

*మొంథా తుపాన్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి**తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు,విద్యార్థులు సహకారం కొరకు ఆదివాసి గిరిజన సంఘ...
29/10/2025

*మొంథా తుపాన్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*
*తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు,విద్యార్థులు సహకారం కొరకు ఆదివాసి గిరిజన సంఘం,ఎస్ఎఫ్ఐ ను సంప్రదించగలరు.*

పార్వతిపురం మన్యం జిల్లా ఎస్ఎఫ్ఐ జిపి యాత్ర 7 వ రోజు జియమ్మవలస మండలం కేంద్రాల్లో కొనసాగుతుంది.
మండలం లోగల ఏనుగులగూడ గ్రామంలో ఎస్ఎఫ్ఐ జీపీ యాత్ర బృందం రాత్రి బస చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె.సీతరాం మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు మొంథా తుఫాన్ పై ఆప్రమత్తంగా ఉండాలని, సురక్షిత భవనాల్లో ఉండాలని,పొలాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్ష,కార్యదర్శిలు టి.అఖిల్, బి. అనిల్ మాట్లాడుతూ..
జిల్లాలో మొంథా తుఫాన్ పై విద్యా సంస్థల యాజమాన్యాలు అప్రవత్తంగా ఉండాలని ఏదైతే ప్రభుత్వం తుఫాను కారణంగా మూడు రోజులు సెలవు ఇచ్చిందో నిబంధనలకు అనుగుణంగా సెలవులు ఇవ్వాలని. విద్యార్థులకు వేడి భోజనం, త్రాగడానికి వేడి నీళ్లు మాత్రమే అందించాలని. నిరంతరం ఉపాధ్యాయులు విద్యార్థులు తోనే ఉండాలని అన్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల విద్యార్థులు,ప్రజలు మా సహకారం కొరకు మాకు సంప్రదించవచ్చని తెలియజేశారు.
కురుపాం నియోజకవర్గం :9347533088
పాలకొండ నియోజకవర్గం:
8897191541
సాలూరు నియోజకవర్గం:
9390868467
పార్వతీపురం నియోజకవర్గం:
9391970877

*. మనముకొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు నిటి సౌకర్యం కల్పించాలి.* *5 వ రోజు కొనసాగుతున్న ఎస్ఎఫ్ఐ పార్వతీపురం మన్యం జిల్...
29/10/2025

*. మనముకొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు నిటి సౌకర్యం కల్పించాలి.*

*5 వ రోజు కొనసాగుతున్న ఎస్ఎఫ్ఐ పార్వతీపురం మన్యం జిల్లా జిపి యాత్ర*

*ఈ సందర్భంగా బామిని మండలంలో మనము కొండ హాస్టల్లో నిరసన తెలియజేశారు.*

*ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి టి. అఖిల్ మాట్లాడుతూ...*

మనము కొండ ఆశ్రమ పాఠశాలలో నీటి బోరు పోయి 8 నెలలు అవుతున్న ఇప్పటి వరకు బాగుచేయలేదు. సుమారుగా హాస్టల్ లో 30 మంది బాలికలు వుంటున్నారు. అక్కడ స్థానిక ఊరు ప్రజలు హాస్టల్కి నీరు మోస్తారు అని వర్డెన్ సార్ చెప్తున్నారు. ఇది అధికారుల లోపం అని అన్నారు.

*హాస్టల్ కన్నా జెల్లు మేలు 55 రూపాయలతో పౌష్టికాహారం అందించడం సాధ్యమా!!*

ప్రభుత్వ ఒక విద్యార్థికి రోజుకి 55 రూపాయలు ఖర్చు చేస్తుంది మూడు పూటలు భోజనం అంటే పూటకి 18 రూ ఖర్చు చేస్తుంది. మోడీ పుణ్యమా అని ధరలు ఆకాశానికి పెరిగాయి. నిత్యవసర సరుకులు గ్యాస్ పెరిగింది. పెరిగిన ధరలు అనుగుణంగా ంగా చార్జీలు పెంచాలి. పెంచలేదు. అందుకు చాలీచాలని ఆహారం రుచికమైన కూరలు అరకొర మెనూ అమలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సర్వేలు 100 మంది జన్మిస్తే 90 మంది రక్తహీనతతో బాధపడుతున్నారని ప్రభుత్వం చెబుతోంది. పౌష్టికాహారం అందక విద్యార్థులు అనారోగ్యాలకు గురవుతున్నారని ప్రభుత్వానికి తెలిసిన చలనం లేదు. జైల్లో ఉన్న ఖైదీకి రోజుకి 80 రూపాయలు ఖర్చు చేస్తుంది. ఎమ్మెల్యే కి రోజు కి 2500 ఉంటుంది. దీన్నిబట్టి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఎవరికి ఎంత ఇస్తుందో అర్థమవుతుంది. పౌష్టికాహారం మంచి ఆరోగ్యం లేకుండా విద్యార్థి బాగా ఎలా చదువుతారు ప్రభుత్వమే చెప్పాలి.

*పర్యవేక్షణ లోపం*
ఏ టి డబ్ల్యూ, డిడి,గురుకుల ఓ ఎస్ టి, ప్రతినెల హాస్టల్ కు వెళ్లి విద్యార్థులు యోగక్షేమాలు చూడాలి. అధికారులు పర్యవేక్షణ లేనియెడల వారిపై పిఓ కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. నేడు అలాంటి పరిశీలన కరువయ్యింది. పై స్థాయి నుండి క్రింది వరకు అధికారులు విద్యార్థులు యోగక్షేమా లు చూసుకుని నాధుడే లేడు. విద్యార్థులు అనారోగ్యంతో మరణిస్తే హడావిడిగా హాస్టల్స్ కి సందర్శించి వారు తప్పుని తప్పు పుచ్చుకొని కింద స్థాయి వార్డెన్,హెచ్ఎం,హెల్త్ వాలంటరీ వారి మీద నెట్టి బాధ్యతల నుండి తొలగిస్తున్నారు. చాలా దుర్మార్గం ప్రభుత్వాలు జబ్బ ఒకటి ఉంటే మంద ఇంకొకటి ఇచ్చినట్టుగా వ్యవహరిస్తుంది. అలాగే స్కూలు నిర్వహణ కోసం నిధులు కేటాయించాలి.

*గిరిజన శాఖ మంత్రి మొదటి సంతకం అమలు ఎప్పుడు చేస్తారు!!*
గత ప్రభుత్వం ఏఎన్ఎం నియమించలేదు. మా ప్రభుత్వాన్ని గెలిపించండి మీ ఆరోగ్యం ప్రాణాలు మా బాధ్యతని గొప్పలు చెప్పారు. హాస్టల్లో ఏఎన్ఎం నియమిస్తామని హామీ ఇచ్చారు. మొదటి సంతకం పెట్టారు.నేటికీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. మర్చిపోయారు. వైద్యం కోసం నిధులు కేటాయింపు లేదు. ప్రభుత్వ బాధ్యతనుండి తప్పుకొనికొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ P 3 పేరుతో అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం అప్పనంగా ఇస్తున్నారు. ప్రభుత్వం ఏఎన్ఎంలు పెంచకపోతే మన ప్రాణానికి ప్రమాదం ఉంది.
ఎక్స్ప్రెయాసి 50 లక్షలు/ఉద్యోగం ఇవ్వాలి.
అనారోగ్యంతో మరణించిన 16 మంది విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులకు 50 లక్షలు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇచ్చేంతవరకు ఐక్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ప్రశ్నించాలి పోరాటానికి సిద్ధం కావాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి చేస్తుంది. పోరాడే ఎటువంటి హక్కులైనా సాధించుకోగలరు మనకి మన విద్యార్థులు ప్రాణానికి రక్షణ కల్పించే అంతవరకు పోరాటం చేయాలి అని అన్నారు.
ఈ కార్యక్రమం లో పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ సభ్యులు శరత్,నాయకులు దినేష్,టి. అఖిల్ తదితరులు పాల్గున్నారు.

Address

Parvathipuram, Belagam, Mainroad
Parvathipuram
535501

Telephone

+919441969693

Website

Alerts

Be the first to know and let us send you an email when SFI Parvathipuram Manyam District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SFI Parvathipuram Manyam District:

Share

Category