జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ ||
जननी जन्म भूमिश्च स्वर्गादपि गरीयसी ||
Mother and motherland are superior even to Heaven..
గోగులమూడి గ్రామం, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం!
ప్రధాన జీవనాధారం వ్యవసాయం. తెలుగు మాతృభాష. ఉర్దూ, హిందీ మరియు ఆంగ్లములో కూడా మాట్లాడగలరు..
మిర్చి, ప్రత్తి, పొగాకు, మొక్కజొన్న, మిముము, శెనగలు మరియు వరి మొదలగు పంటలు విరివిగా పండుతాయి. అన్
ని రకాల పంటలకు అనుకూలమైన భూమి గోగులమూడి గ్రామ ప్రజల అదృష్టం. కష్టపడే మనస్తత్వం, వ్యవసాయం లో అపార అనుభవం మరియు మెళుకువలు ఈ గ్రామ రైతుల ప్రధాన బలం. రైతు వారి కుటుంబాలే ఎక్కువుగా ఉన్నప్పటికీ, రైతు కూలీలు మరియు వివిధ కుల వృత్తులు గోగులమూడి కుటుంబం లో భాగమై ఉన్నారు. కృష్ణా నది కాలువ ప్రధాన తాగు మరియు సాగు నీటికి ఆధారం. వర్షపాతం మీద కూడా వ్యవసాయం ఆధారపడినది.
గోగులమూడి ఉన్నత పాఠశాలలో విద్య అభ్యసించిన విద్యార్థులు నేడు దేశ విదేశాలలో అనేక ఉన్నత హోదాలో వున్నారు. ఒక్క గోగులమూడి గ్రామ విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన కాట్రపాడు, మేడవారిపాలెం, రావిపాడు మరియు గొరిజవోలుగుంటపాలెం విద్యార్దులకు కూడా విద్యాదానం చేసిన గొప్ప చరిత్ర కలిగినది గోగులమూడి ఉన్నత పాఠశాల!
వివిధ కుల మతాల సమ్మేళనం మా గోగులమూడి గ్రామం. వివిధ రకాల మతాలకు సంబందించిన ప్రార్ధనా మందిరాలు, గ్రామా సచివాలయం, ప్రాథమిక పాఠశాల, ప్లే గ్రౌండ్ మరియు గ్రామా చెరువు ప్రధాన ఆకర్షణలు. దైవ ప్రార్ధనలు, నాటక రంగం మరియు రాజకీయాలలో గోగులమూడి మంచి గుర్తింపు కలిగి ఉన్నది.
గోగులమూడి గ్రామ అభివృద్ధికి పలువురు కృషి చేసారు మరియు చేస్తూనే ఉన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరి సమిష్టి కృషితో గోగులమూడి గ్రామం మరింత అభివృద్ధిపదంలో ముందుకు దూసుకుపోతుందని ఆశిస్తున్నాము.
- [email protected]