Pithapuram JSP Warriors

Pithapuram JSP Warriors "Party of the Janasena movement striving for a better tomorrow "

04/02/2026

పవిత్ర తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే లేదు - గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు.

• గతంలో తిరుమల పర్యటనకు వెళ్లినప్పుడు చాలా మంది ఇక్కడ తప్పు జరుగుతుంది అని నా దృష్టికి తెచ్చారు.
• తప్పు జరుగుతుంది సరిదిద్దుకోండి అని ఎన్నోసార్లు చెప్పినా వినలేదు.
• kG నువ్వుల నూనె కూడా రాణి ధరకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా వస్తుంది? ఎక్కడో తప్పు జరుగుతుంది అని గ్రహించి గత YSR Congress Party - YSRCP ప్రభుత్వం, TTD పాలకులు చేసిన తప్పులకు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేశాను.
• SIT విచారణలో అసలు నెయ్యిలో నెయ్యి లేదు అని స్పష్టంగా అదొక కెమికల్ నెయ్యి అని తేల్చింది.


03/02/2026

ఈ రోజు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించండి - ఇది సరదా వేదిక కాదు ఇది బాధ్యత. ఇది యుద్ధరంగం.ప్రతి జనసైనికుడు సోషల్ మీడియా...
25/01/2026

సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించండి - ఇది సరదా వేదిక కాదు
ఇది బాధ్యత. ఇది యుద్ధరంగం.

ప్రతి జనసైనికుడు సోషల్ మీడియాలో క్రమశిక్షణ, సంస్కారం, బాధ్యతతో వ్యవహరించాలి. !!

అధికారిక & నిర్ధారిత సమాచారం మాత్రమే షేర్ చేయాలి , ఫేక్ న్యూస్, వ్యక్తిగత దూషణలు వద్దు అసభ్య పదజాలం వాడకూడదు !!

Pawan Kalyan | JanaSena Shatagni
JanaSena Party JanaSena Veera Mahila

*సర్వదా అప్రమత్తంగా ఉందాం*
22/01/2026

*సర్వదా అప్రమత్తంగా ఉందాం*

మరణం తరవాత కూడా తన అవయవ దానం ద్వారా 5 మందికి జీవితాన్ని అందించిన శ్రీ చందూ వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించి, ...
22/01/2026

మరణం తరవాత కూడా తన అవయవ దానం ద్వారా 5 మందికి జీవితాన్ని అందించిన శ్రీ చందూ వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యుల మానవతా దృక్పథాన్ని అభినందించి భరోసా ఇచ్చిన అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ గారు.

21/01/2026

కార్యకర్త ఇంటికి వెళ్లి.. నేనున్నానంటూ భరోసా ఇచ్చి.. కష్టంలో తోడుంటామంటూ ధైర్యం నింపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

21/01/2026

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు గాజు గ్లాసు సిద్ధం!


20/01/2026

*ఉగాది నుంచి 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు*

• ఉగాదిలోపు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి
• గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలూ త్రికరణ శుద్ధిగా భాగస్వాములు కావాలి
• గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుల్లో స్వజాతి మొక్కలకు ప్రాధాన్యం
• పరిశ్రమల శాఖ… కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటాలి
• 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• ఆయా శాఖల భాగస్వామ్యంపై దిశానిర్దేశం

రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖలు ఉగాదిలోపు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఉగాది నుంచి గ్రీన్ కవర్ యాక్షన్ ప్లాన్ అమలు కావాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖ… కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటేందుకు, తీర ప్రాంతాల్లో పెనుగాలులు, ఉప్పు నీటిని తట్టుకునే మొక్కల పెంపకానికి సిద్ధం కావాలని నిర్దేశం చేశారు. గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుల్లో స్వజాతి వృక్ష జాతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత వర్గాలకు సూచనలు చేశారు. మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీశాఖతో పాటు వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై చర్చించారు. ప్రాజెక్టు ప్రణాళికలు, నిధుల కేటాయింపు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంపు ప్రాజెక్టుకి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రం మొత్తం భూ భాగంలో 2047 నాటికి 50 శాతం పచ్చదనంతో నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం 32.60 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉంది. ఈ లక్ష్యంలో భాగంగా 2030 నాటికి 37 శాతం పచ్చదనం నింపాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30 శాతం గ్రీనరి ఉండగా.., వచ్చే నాలుగేళ్లలో మరో 7 శాతం గ్రీనరీ పెంచాల్సి ఉంది. అందుకోసం 9 లక్షల హెక్టార్లలో చెట్లను నాటాలి. ఈ యజ్ఞంలో అన్ని శాఖలు తమ వంతు భాగస్వామ్యం పోషించాల్సి ఉంది. అందులో ఉద్యానవన శాఖ 12 శాతం మొక్కలు నాటే బాధ్యతను స్వీకరించాల్సి ఉంది.
• ప్రతి మొక్కా పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడాలి
వీటితోపాటు అటవీ, పర్యావరణ శాఖలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు, నీటిపారుదల శాఖ, పాఠశాల విద్యాశాఖ, రోడ్లు భవనాల శాఖ, పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ, కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న రైల్వే తదితర శాఖలు తమ తమ పరిధిలో లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది. జాతీయ రహదారులకి ఇరువైపులా మొక్కలు నాటే సంప్రదాయం ఉంది. దీన్ని రాష్ట్ర పరిధిలోని రహదారుల నిర్మాణంలోనూ అమలు చేయాలి. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు కూడా గ్రీన్ కవర్ పెంపునకు దోహదపడుతుంది. 970 ఎకరాల తీర ప్రాంతం వెంబడి 40 శాతం అటవీ శాఖ పరిధిలో ఉండగా, మిగిలిన భూభాగంలో ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరం అయిన ప్రణాళికలు ఆయా శాఖలు సిద్ధం చేయాలి. తీర ప్రాంతం వెంబడి ఉన్న ప్రాంతంలో అక్కడ వాతావరణ పరిస్థితులకు తట్టుకునే మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పారిశ్రామిక కారిడార్లలో కాలుష్య నియంత్రణకు తోడ్పడే మొక్కలను పెంచాలి. రైతుల భూముల్లో వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పండ్ల రకాల మొక్కలు పెంచాలి. కాలువగట్లు, చెరువుల గట్ల వెంబడి కూడా పండ్ల మొక్కలు నాటాలి. మనం నాటే ప్రతి మొక్క పర్యావరణానికి, ప్రజలకు ఉపయోగపడే స్వజాతి మొక్కలు ఉండేలా చూసుకోవాలి. అందుకు సంబంధించి శాఖల వారీ యాక్షన్ ప్లాన్ అవసరం. నిర్దేశిత సమయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ప్రణాళికలు సిద్ధం చేయండి. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు 50 శాతం గ్రీనరీ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. బడ్జెట్ కేటాయింపులు ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం.. లక్ష్యాలకు అనుగుణంగా కార్యచరణ సిద్ధం చేసే బాధ్యతను యంత్రాంగం నిబద్దతతో ముందుకు తీసుకువెళ్లాలి. అన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఫిబ్రవరి 5వ తేదీన జరిగే తదుపరి సమావేశానికి పూర్తి స్థాయి ప్రణాళికలతో రావాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ, రవాణాశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కృష్ణబాబు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్, పీసీసీఎఫ్ శ్రీ పి.వి. చలపతిరావు, అటవీశాఖ సలహాదారుల, శ్రీ మల్లికార్జునరావు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ రంజిత్ భాషా, ఏపీఐఐసీ వి.సి.ఎం.డి. శ్రీ అభిషిక్త్ కిషోర్, నీటిపారుదలశాఖ, పట్టణాభివృద్ధి తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Congratulations sir👍ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ( RTI ) కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ చక్రవర్తి గారికి హృదయపూర్వక...
20/01/2026

Congratulations sir👍

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ( RTI ) కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ చక్రవర్తి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు



10/01/2026

మంగళగిరి పార్టీ కార్యాలయం అడ్మినిస్టేషన్ హెడ్ క్వార్టర్ అయితే...
ఐడిలాజికల్ హెడ్ క్వార్టర్ మాత్రం పిఠాపురమే.


రేపటి నుంచి పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన• 9వ తేదీన సంక్రాంతి సంబరాలకు శ్రీకారం• పిఠాపురం వేది...
07/01/2026

రేపటి నుంచి పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన

• 9వ తేదీన సంక్రాంతి సంబరాలకు శ్రీకారం
• పిఠాపురం వేదికగా ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు’
• పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు
• 10వ తేదీ జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం
• పిఠాపురం నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి సందర్శనలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గురువారం రాత్రికి పిఠాపురం చేరుకోనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శుక్రవారం ఉదయం పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఉదయం గం.10.30ని.కి ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానానికి చేరుకుని సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారు. ఉదయం గం.11.30 నిమిషాలకు నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సంక్రాంతి మహోత్సవంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్లను తిలకిస్తారు. సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ముంపునకు గురైన ఇందిరానగర్ కాలనీ, రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్ లను సందర్శిస్తారు. శనివారం ఉదయం గొల్లప్రోలు ప్రాంతంలోని ఇళ్ళ స్థలాలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఉదయం గం. 10. 30 నిమిషాలకు కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని శాంతి భద్రతలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గం.కి కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలకు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
• రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి మహోత్సవాలు
పిఠాపురం వేదికగా మూడు రోజులపాటు నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు ఆద్యంతం తెలుగుదనం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. మొదటి రోజు సంక్రాంతి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, జానపదగీతాలాపనలు, వీర నాట్యాలు, ఉరుముల నృత్యాలు, తప్పెట గుళ్లు, గరగు నృత్యాలు, లంబాడ నృత్యం, డప్పులు, గిరిజన సంప్రదాయ నృత్యరీతి అయిన థింసా, అలాగే కూచిపూడి, భరతనాట్యం తదితర శాస్త్రీయ నాట్య ప్రదర్శనలు, కోలాటాలు ఏర్పాటు చేశారు. రెండో రోజు జనవరి 10 తేదీన మొదటి రోజు ప్రదర్శనలతోపాటు కేరళ సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు ఉంటాయి. చివరి రోజు గ్రామీణ జానపదుల పాటలు, సినీ మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు ఆహుతులను అలరించనున్నాయి.

Address

Pithapuram
533445

Website

Alerts

Be the first to know and let us send you an email when Pithapuram JSP Warriors posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share