15/03/2023
నిలిచిన వడ్డీముక్కల గ్రామ సచివాలయ నిర్మాణ పనులు పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగాలు
40 లక్షల రూపాయల నిధులు శాతం కేటాయింపు జరిగిన భవన నిర్మాణం పూర్తిగా నిర్మాణం కానీ వైనం..... దీనికి కారణం అధికారుల పర్యవేక్షణ లోపమా? గుత్తేదారు నిర్లక్ష్యమా? ప్రభుత్వం చేతకానితనమా?
అయోమయంలో స్థల దాతలు
గత ప్రభుత్వ శాసనసభ్యులు ది.21-12-2017న శంకుస్థాపన చేయడం జరిగినది. కానీ పని మొదలు పెట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత
(1) గ్రామ సచివాలయము,
(2) రైతు భరోసా కేంద్రము &
(3) ఆసుపత్రి నిర్మాణం చేయుట
కనీసం 11 సెంట్లు స్థలం అవసరం అని. దాతలను స్థానిక నాయకుల కోరినారు. ఈ మేరకు దాత 11 సెంట్లు స్థలం ఇవ్వటానికి ఒప్పుకొని పనులు మొదలు పెట్టుకొనవలసిందిగా చెప్పియున్నాము. ది.11-05-2020 న ఒక సచివాలయం నిర్మాణము పని మొదలుపెట్టినారు. కానీ సుమారుగా ఒకటిన్నర సంవత్సరం పై నుండి పనిచేయడం లేదు. అది ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారినది. మేము ఏ ఉద్దేశంతో అయితే ఆ స్థలము ఇచ్చినామో అది జరగకుండా ఇలా ఉండటం చాలా బాధాకరంగా ఉంది. దాతలు వాపోయారు. ఈ విషయం పొన్నూరు పట్టణ BJP కార్యకర్తలకు తెలియగా వెంటనే స్పందించిన పోన్నురు BJP పట్టణ అధ్యక్షులు మొగలిపువ్వు సాంబశివరావు గారు నేడు పొన్నూరు పట్టణ తహసిల్దార్ గారికి గ్రీవెన్స్ నందు వినతిపత్రం అందజేసి ,వెంటనే ఈ నిర్మాణ కార్యక్రమం వేగవంతం చేసి సచివాలయం నిర్మాణం వెంటనే జరపాలని కోరారు. ఈ కార్యక్రమంఈ కార్యక్రమంలో
కలపాల శ్రీనివాసరావు, BJP పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి
భట్టిప్రోలు రామకృష్ణ, BJP పార్టీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు
వడ్రాణం ఉదయ్ రామ్, BJP పార్టీ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు
గోవాడ వెంకట కృష్ణారావు, BJP పార్టీ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు
తోట జనార్దన్ రావు, BJPగుంటూరు జిల్లా కిసాన్మోర్చా కార్యదర్శి
తన్నీరు శివరామకృష్ణ, BJP పార్టీ పొన్నూరు పట్టణ ఉపాధ్యక్షులు
తదితరులు పాల్గొన్నారు.