Telugu Desam Party: Pulivendla

Telugu Desam Party: Pulivendla Official Page of TDP Pulivendla

03/09/2026

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని శాపంగా మార్చేసింది వైసీపీ ఐదేళ్ల విధ్వంస పాలన. సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పోలవరాన్ని పూర్తి చేస్తోంది. ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించింది.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


పాయకరావుపేట వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారాప్రవహించిన గోదారమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నా...
03/09/2026

పాయకరావుపేట వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా
ప్రవహించిన గోదారమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పరవళ్లు తొక్కుతూ వస్తున్న గోదావరి జలాలకు సీఎం సాష్టాంగ నమస్కారం చేశారు.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


03/09/2026

గిరిజనుల సంపదను దోచుకుని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి, విధ్వంసానికే బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన జగన్ రెడ్డికి.. వికాసం, విజ్ఞానం, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీఎం చంద్రబాబు గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. "Both are not same"


•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను...
03/09/2026

•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు

•తూర్పు కనుమలు దాటి వచ్చిన గోదావరి జలాలను వచ్చే ఏడాది సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి వరకు, చివరికి వంశధార వరకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు

•జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు

•బాబాయిని, సొంత కార్యకర్తలను చంపి ఆ నెపాన్ని ఇతరులపై నెట్టే వ్యక్తి జగన్ అని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

•విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పల్నాడు జిల్లాలో పర్యటించి, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను ప్రారంభించారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/13MXl


నరసరావుపేట పట్టణ వీధుల్లో యువనేత నారా లోకేష్ కు జనం బ్రహ్మరథం.
02/09/2026

నరసరావుపేట పట్టణ వీధుల్లో యువనేత నారా లోకేష్ కు జనం బ్రహ్మరథం.


నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్ కు టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానుల ఘనస్వాగతం. ఎస్ ఆర్ కే సెంటర్ లో డప్పులు, డీజే లతో...
02/09/2026

నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్ కు టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానుల ఘనస్వాగతం. ఎస్ ఆర్ కే సెంటర్ లో డప్పులు, డీజే లతో హోరెత్తించిన పసుపు సైనికులు, అభిమానులు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో లోకేష్ కు కార్యకర్తల స్వాగతం. మంత్రి లోకేష్ కు స్వాగతం పలికిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, భాష్యం రామకృష్ణ, నర్సరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జాన్ సైదా, ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, దర్శి ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి, గుంటూరు మేయర్ కోవెలమూడి నాని, టీడీపీ నాయకులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్, మన్నవ మోహన కృష్ణ, గోనుగుంట్ల కోటేశ్వరరావు, కనుమూరి బాజి చౌదరి, కనపర్తి శ్రీనివాసరావు, మానుకొండ శివప్రసాద్ తదితర నాయకులు.


ఎన్టీఆర్ తనయుడైనప్పటికీ సామాన్యుడిగా అందరితో కలిసి పోవడం ... నిరాడంబరంగా జీవించడం...    రాజకీయాలలో ఉంటూ కూడా ముక్కుసూటిగ...
02/09/2026

ఎన్టీఆర్ తనయుడైనప్పటికీ సామాన్యుడిగా అందరితో కలిసి పోవడం ... నిరాడంబరంగా జీవించడం... రాజకీయాలలో ఉంటూ కూడా ముక్కుసూటిగా నడచుకోవడం హరికృష్ణ గారికే చెల్లింది. నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆ మంచి మనిషి జ్ఞాపకాలను స్మరించుకుంటోంది తెలుగుదేశం.

Address

Pulivendla

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Pulivendla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Pulivendla:

Shortcuts

Share