24/07/2026
**తేదీ: 24 జూలై, 2026
పుంగనూరు. అన్నమ్య జిల్లా
# # # ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాం!
**- కేంద్ర ప్రభుత్వ చేతగానితనమే నీట్ (NEET) పేపర్ లీకేజీకి కారణం**
**- బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి**
**- SDPI అన్నమయ్య జిల్లా అధ్యక్షులు యూసుఫ్**
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా న్యాయం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు అన్యాయంగా లాఠీఛార్జి చేయడాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) అన్నమయ్య జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ముఖ్యంగా న్యాయం అడగడానికి వచ్చిన ఆడబిడ్డల పట్ల పోలీసులు వ్యవహరించిన అమానుష తీరు అత్యంత దారుణం మరియు క్షమించరానిది అని SDPI అన్నమయ్య జిల్లా అధ్యక్షులు యూసుఫ్ మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో, ప్రాణాలతో ముడిపడి ఉన్న ప్రతిష్టాత్మక పరీక్షలో పేపర్ లీకేజీ జరగడం కేంద్ర ప్రభుత్వ పూర్తి చేతగానితనానికి మరియు వైఫల్యానికి నిదర్శనం అని ఆయన విమర్శించారు. విద్యావ్యవస్థను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వం, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయించడం వారి నిరంకుశత్వానికి అద్దం పడుతోంది.
*** నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి, మరియు విద్యార్థులపై జరిగిన అమానుష దాడికి నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత కేంద్ర మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి.
*దాడులపై చర్యలు:** శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆడబిడ్డలపై మరియు విద్యార్థులపై లాఠీఛార్జికి ఆదేశించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
*న్యాయ విచారణ:** పేపర్ లీకేజీ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి.
*అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేసి చేయాలి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు SDPI వారికి అండగా ఉండి పోరాడుతుందని, కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని యూసుఫ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
యూసుఫ్,
సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI)
అన్నమయ్య జిల్లా.