03/09/2026
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు...ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు – సీఐ కరీం
ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టూటౌన్ సిఐ అబ్దుల్ కరీం తెలిపారు. గురువారం సాయంత్రం విజిబుల్ పోలింగ్ నిర్వహించి వాహనాల తనిఖీలు విస్తృతంగా చేపట్టారు.
సిగ్నల్ జంప్, మైనర్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీఐ తెలియజేశారు.
ప్రత్యేకంగా ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేయడం, మైనర్లు వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలను గుర్తించి, నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాలు విధించడంతో పాటు అవసరమైన చోట వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు.
ట్రాఫిక్ సిగ్నల్‌ను ఉల్లంఘించిన వాహనదారులపై జరిమానాతో పాటు చట్టప్రకారం తదుపరి చర్యలు/శిక్షలు కూడా విధించబడతాయి. మైనర్లు వాహనాలు నడుపుతున్న సందర్భాల్లో వాహనం, డ్రైవర్ మరియు వాహన యజమాని బాధ్యతలను పరిశీలించి, అమల్లో ఉన్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ముఖ్యంగా రెడ్ సిగ్నల్ వద్ద వాహనాలను నిలిపివేయాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, ప్రతి వాహనానికి నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్ ఉండేలా చూసుకోవాలని సూచించారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి, సురక్షితమైన రహదారి ప్రయాణానికి సహకరించాలని ప్రజలను కోరారు.