Vadde Venkat

Vadde Venkat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vadde Venkat, Political organisation, Puttaparthi.

Leader at Telugudesam Party
🏛️ 𝐂𝐡𝐚𝐢𝐫𝐦𝐚𝐧, 𝐔𝐦𝐦𝐚𝐝𝐢 𝐀𝐧𝐚𝐧𝐭𝐚𝐩𝐮𝐫𝐚𝐦 𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭 𝐋𝐢𝐛𝐫𝐚𝐫𝐲 𝐀𝐬𝐬𝐨𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧 🖋️
━━━━━ 📖
చైర్మన్ ◈ ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ 🏛️ 📖
టిడిపి వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్

*బ్రహ్మంగారిమఠంలో అన్నదాన సత్ర నిర్మాణానికి శంకుస్థాపన:*------------------------------------------------------------*బ్ర...
07/09/2026

*బ్రహ్మంగారిమఠంలో అన్నదాన సత్ర నిర్మాణానికి శంకుస్థాపన:*

------------------------------------------------------------

*బ్రహ్మంగారిమఠం:*

వైఎస్‌ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని బద్వేల్ రోడ్, శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక వడియరాజుల అన్నదాన సత్రం శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి *ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, టిడిపి వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్* హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దివ్య ఆశీస్సులతో, *చక్రవర్తి దంపతుల కూర్చున్నారు* ఉదయం 9.10 గంటలకు తులా లగ్న శుభ ముహూర్తాన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది.

*ప్రజాసేవే పరమావధిగా అన్నదాన సత్రం:*

ఈ సందర్భంగా వడ్డే వెంకట్ మాట్లాడుతూ, బ్రహ్మంగారిమఠం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. సమాజ సేవా దృక్పథంతో ముందడుగు వేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ చైతన్య సంస్థ వ్యవస్థాపకులు బి.సి. రమణ, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బరాయుడు, ప్రముఖులు వీర కుమార్ బాలకృష్ణ, వీర భాస్కర్, బాలయ్య, గుత్తి దేవీ శ్రీనివాసులు, వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు.
*అభినందనలు:* భక్తిభావంతో సామాజిక సేవా దృక్పథంతో అన్నదాన సత్ర నిర్మాణానికి పూనుకున్న నిర్వాహకులను ఈ సందర్భంగా వడ్డే వెంకట్ ప్రత్యేకంగా అభినందించారు.

07/09/2026
06/09/2026

*జిల్లా కేంద్ర గ్రంథాలయంలో "చదువు అంటే నాకిష్టం"*
*కార్యక్రమం: ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ వడ్డే వెంకట్*

------------------------------------------------------------

అనంతపురం:[06-Sep-2026]
అనంతపురం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో *"చదువు అంటే నాకిష్టం"* అనే ప్రత్యేక కార్యక్రమం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి *అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్* ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చైర్మన్ వడ్డే వెంకట్ మాట్లాడుతూ... విద్యార్థుల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పుస్తకాలు జ్ఞానానికి గనులు అని, క్రమం తప్పకుండా గ్రంథాలయాలను సందర్శించి పుస్తకాలు చదవడం ద్వారా విద్యార్థులు తమ మేధస్సును, సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే పఠనాభిలాష ఎంతో అవసరమని పేర్కొంటూ, విద్యార్థులంతా గ్రంథాలయ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పుస్తకాల ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గ్రంథాలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

#చదువు_అంటే_నాకిష్టం #వడ్డే_వెంకట్ #అనంతపురం #జిల్లా_గ్రంథాలయ_సంస్థ

*జిల్లా కేంద్ర గ్రంథాలయంలో "చదువు అంటే నాకిష్టం"* *కార్యక్రమం: ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ వడ్డే వెంకట్*------------...
06/09/2026

*జిల్లా కేంద్ర గ్రంథాలయంలో "చదువు అంటే నాకిష్టం"*
*కార్యక్రమం: ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ వడ్డే వెంకట్*

------------------------------------------------------------

అనంతపురం:[06-Sep-2026]
అనంతపురం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో *"చదువు అంటే నాకిష్టం"* అనే ప్రత్యేక కార్యక్రమం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి *అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్* ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చైర్మన్ వడ్డే వెంకట్ మాట్లాడుతూ... విద్యార్థుల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పుస్తకాలు జ్ఞానానికి గనులు అని, క్రమం తప్పకుండా గ్రంథాలయాలను సందర్శించి పుస్తకాలు చదవడం ద్వారా విద్యార్థులు తమ మేధస్సును, సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే పఠనాభిలాష ఎంతో అవసరమని పేర్కొంటూ, విద్యార్థులంతా గ్రంథాలయ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పుస్తకాల ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గ్రంథాలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

#చదువు_అంటే_నాకిష్టం #వడ్డే_వెంకట్ #అనంతపురం #జిల్లా_గ్రంథాలయ_సంస్థ

*నూతన అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్* అనంతపురం అజిత్ ప్యాల...
06/09/2026

*నూతన అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్*

అనంతపురం అజిత్ ప్యాలెస్ అపార్ట్‌మెంట్‌లో
స్థానికంగా నూతనంగా ప్రారంభించిన అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రారంభోత్సవ వేడుక మహోత్సవంగా జరిగింది. సంస్థ నిర్వాహకులు చలపతయ్య, ఆయన కుమారుడు అజిత్ ఆత్మీయ ఆహ్వానం మేరకు *ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్* ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా చైర్మన్ వడ్డే వెంకట్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువత ప్రపంచస్థాయి అవకాశాలను అందుకోవడానికి సరైన గైడెన్స్ అవసరమని, ఈ కన్సల్టెన్సీ ద్వారా మన ప్రాంత విద్యార్థులకు, నిరుద్యోగులకు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ సేవలు అందాలని ఆకాంక్షించారు. యువతకు మార్గదర్శకంగా నిలిచే ఇటువంటి సంస్థలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొంటూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో *టిడిపి కురుబ రాష్ట్ర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గంగులకుంట రమణతో పాటు ప్రముఖ నాయకులు సతీష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎర్ర స్వామి నాయుడు, రామకృష్ణ, ధనంజయ, ఎర్ర స్వామి, కృష్ణ ప్రసాద్* తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు.
#వడ్డే_వెంకట్ #అనంతపురం #జిల్లా_గ్రంథాలయ_సంస్థ #అజిత్_ప్యాలెస్ #కన్సల్టెన్సీ_ప్రారంభోత్సవం #టీడీపీ #రమణ

*గ్రంథాలయం చైర్మన్ ఛాంబర్‌లో ఘనంగా  మాజీ బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళి జన్మదిన వేడుకలు*​అనంతపురం నగరంలోని జిల్ల...
05/09/2026

*గ్రంథాలయం చైర్మన్ ఛాంబర్‌లో ఘనంగా మాజీ బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళి జన్మదిన వేడుకలు*

​అనంతపురం నగరంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఛాంబర్‌లో మాజీ బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళి గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
​ఈ వేడుకల్లో *ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ గారు పాల్గొని, రాయల్ మురళి గారిని శాలువాతో సత్కరించి, పూలమాల వేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు* తెలియజేశారు. అనంతరం ముఖ్య నాయకుల సమక్షంలో రాయల్ మురళి గారితో కేక్ కటింగ్ చేయించారు.
​ఈ సందర్భంగా చైర్మన్ వడ్డే వెంకట్ గారు మాట్లాడుతూ... ప్రజాసేవలో రాయల్ మురళి గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య నాయకులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
​హాజరైన ప్రముఖులు:
​కొండవీడు సుధాకర్ నాయుడు గారు
​TNTUC నాయకులు కుంచపు వడ్డే వెంకటేష్ గారు
​రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి కూచి హరి గారు
​రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ గారు
​స్పోర్ట్స్ డైరెక్టర్ బొమ్మినేని శివ గారు
​శివశ్రీనాథ్ గారు, శ్రీకాంత్ గారు మరియు ఇతర ముఖ్య నేతలు.
​తన జన్మదినం సందర్భంగా ఆత్మీయంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ రాయల్ మురళి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.








*సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా అనంతపురం కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నివాళులు*--------------------------------...
05/09/2026

*సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా అనంతపురం కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నివాళులు*

------------------------------------------------------
అనంతపురం (సెప్టెంబర్ 05):

*ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వడ్డే వెంకట్ గారి* నాయకత్వంలో శనివారం అనంతపురం కేంద్ర గ్రంథాలయంలో *భారతరత్న, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి (ఉపాధ్యాయ దినోత్సవం) వేడుకలు ఘనంగా జరిగాయి.*
ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వడ్డే వెంకట్ గారు పూలమాలలు వేసి, భావోద్వేగంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ వడ్డే వెంకట్ గారు మాట్లాడుతూ:
సమాజ వికాసానికి, ఉజ్జ్వల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనని, వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక మహోన్నతమైన ఉపాధ్యాయునిగా, తత్త్వవేత్తగా, దేశ అత్యున్నత పదవిని అధిరోహించి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తిని చాటారని గుర్తుచేశారు.
విద్యార్థులు, యువత గ్రంథాలయాల్లోని పుస్తకాలను సద్వినియోగం చేసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్న అధికారులు మరియు సిబ్బంది:
ఈ కార్యక్రమంలో డిప్యూటీ గ్రంథాలయాధికారి పి. కమ్మన్న, అసిస్టెంట్ లైబ్రేరియన్ డి. గోవిందు, గ్రంథాలయ అధికారి కిరణ్, రికార్డు అసిస్టెంట్ జీవన, సిబ్బంది శ్రీమతి శిరీష కుమారి, శ్రీమతి సరస్వతమ్మ, నాగరాజు, నాగభూషణ మరియు పెద్ద సంఖ్యలో పాఠకులు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

*జిల్లా గ్రంథాలయ సంస్థ, ఉమ్మడి అనంతపురం జిల్లా.*

సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!​స్వామి దివ్య ఆ...
05/09/2026

సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
​స్వామి దివ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, మానవ సేవయే మాధవ సేవగా సమాజానికి అందిస్తున్న మీ సేవలు అత్యంత అభినందనీయం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి ఆశీస్సులతో మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, సమాజానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను.

మీ

వడ్డే వెంకట్
చైర్మన్, ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ

Address

Puttaparthi

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadde Venkat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share