30/04/2026
జిల్లాలో 2027 జనగణన (సెన్సస్) నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 30 వేల కుటుంబాలు స్వీయ నమోదు (Self Enumeration) కింద నమోదు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
మే 1 నుండి 31 వరకు ఇంటింటి సర్వే నిర్వహించేందుకు పూర్తి స్థాయి యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సర్వే సమయంలో అధికారులు, సిబ్బంది ఇంటింటికి వచ్చినప్పుడు ప్రజలు సరైన, సమగ్ర సమాచారాన్ని అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.