PJNews

PJNews Official page For PJNews Telugu News Channel
We cover trending news along with entertainment/podcast

02/09/2026

🚨 సోషల్‌ మీడియా చూసి దొంగనోట్ల దందా!

హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ తయారీ, చలామణి చేస్తున్న ముఠాను శంషాబాద్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, బాలాపూర్‌ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్‌ చేసి **రూ.2.91 లక్షల విలువైన 1,124 నకిలీ నోట్లు**, ప్రింటర్‌, స్కానర్‌, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

రాత్రివేళల్లో నోట్లు తీసుకునేటప్పుడు వ్యాపారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

29/08/2026

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు హరీష్ రావు వార్నింగ్

నిషేధిత జాబితాలో పెట్టిన 50,565 ఎకరాలను వెంటనే నిషేధిత జాబితా నుంచి తీసేయాలి

లేకపోతే బాధితులతో కలిసి కలెక్టరేట్ భవనాన్ని ముట్టడిస్తాం

– హరీష్ రావు

29/08/2026

అర్ధరాత్రి రాచెరువులోకి రసాయన వ్యర్థాలు వదిలారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 10 టన్నులకు పైగా చేపలు మృతి చెందడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు బాధిత మత్స్యకారులకు నష్టపరిహారం అందించాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి వంగరి సాయికుమార్‌ డిమాండ్‌ చేశారు. చేపల మృతికి అసలు కారణంపై అధికారిక నివేదిక రావాల్సి ఉంది.

29/08/2026

ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగకుండా డ్రా ఎలా ప్రారంభిస్తారని అధికారులపై ఆగ్రహం.

ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై
చర్యలు తీసుకుంటామని హెచ్చరిక...

కార్యక్రమం మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే...

బంజారాహిల్స్ కొమరం భీమ్ ఆదివాసీ భవన్‌లో ఘటన...

ఖైరతాబాద్ గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికకు లక్కీ డ్రా...

29/08/2026

మంగ్లీ కేసులో మరో మలుపు! మైక్రో ఫైనాన్స్‌ వివాదంలో సింగర్‌ మంగ్లీపై నమోదైన కేసు ఇంకా కొనసాగుతోందని అడ్వకేట్‌ సుబ్బు తెలిపారు. తాను ఎలాంటి రాజీకి ఒప్పుకోలేదని, కోట్ల రూపాయల ఆఫర్‌ను కూడా తిరస్కరించానని వీడియోలో పేర్కొన్నారు. మంగ్లీ అరెస్టు కాకుండా ఓ కేంద్రమంత్రి కాపాడుతున్నారంటూ ఆరోపించిన ఆయన.. ఆ మంత్రి ఎవరో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసులో కీలక సాక్షిగా చెబుతున్న మంగ్లీ డ్రైవర్‌ ఇప్పుడు ఎక్కడున్నాడని ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై మంగ్లీతోపాటు సంబంధిత వర్గాల వివరణ రావాల్సి ఉంది.

29/08/2026

సీఎం సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డికి ఏ హోదా ఉందని 2+2 గన్‌మెన్లు ఇచ్చారు..?

ఏ బేసిస్ మీద జానారెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు..? ఆయన ఏమైనా ముఖ్యమంత్రా..?

కాంగ్రెస్‌లో ఉన్నారని ముసలోళ్లకి కూడా గన్‌మెన్లు ఇచ్చారు.. కానీ బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వడం లేదు

అటు.. అటెంప్ట్ టు మర్డర్ కేసులో కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌ని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు

ఆనాడు పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ను దాచి పెట్టింది రేవంత్ రెడ్డి కాదా..?

- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

29/08/2026

“నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. బైక్‌ లేకపోతే పని చేయలేను” అంటూ వేడుకున్నా ట్రాఫిక్‌ పోలీసులు కనికరించలేదని Zepto డెలివరీ బాయ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లో ఓ ఆర్డర్‌ తీసుకునేందుకు రోడ్డు పక్కన బైక్‌ నిలిపిన సమయంలో వాహనాన్ని సీజ్‌ చేసి తీసుకెళ్లారని ఆరోపించాడు. ఈ ఘటనపై ట్రాఫిక్‌ పోలీసుల వివరణ రావాల్సి ఉంది.

28/08/2026

హైదరాబాద్ నుంచి కరీంనగర్
సాధారణ రోజుల్లో- 290
రాఖీ రోజు - 400

26/08/2026

ఒక్క ఓటు పవర్.. కాశీ రూపురేఖలు మారుస్తున్న మోదీ విజన్

ప్రధాని మోదీ విజన్‌తో కాశీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకుంటోంది. నగర వారసత్వాన్ని ప్రతిబింబించేలా నెలవంక ఆకారంలో డిజైన్, త్రిశూలాన్ని పోలిన ఫ్లడ్‌లైట్లు, డమరుకం ఆకారంలో కామెంటరీ బాక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

26/08/2026

తెలంగాణకు కావాల్సింది బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ పంచాయతీలు, ఒకరిపై ఒకరు వేసుకునే నిందలు, ఆరోపణలు, మాటల రాజకీయాలు కాదు...అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారాలు, ఫలితాలు.

మాటల రాజకీయాలకు దూరంగా..ప్రజల కోసం క్షేత్రస్థాయిలో బలపడి..ప్రజాసమస్యలపై పోరాడడానికి సిద్ధమైన జనసేన!
jspfortelangana

Address

Rajahmundry

Alerts

Be the first to know and let us send you an email when PJNews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PJNews:

Shortcuts

Share