MP Margani Bharat FC

MP Margani Bharat FC Member Of Parlament (MP) Rajahmundry YSRCP

09/09/2024
విజయీభవ...!!
21/02/2024

విజయీభవ...!!

మీకు మీ కుటుంబ సభ్యులకు 🪔దీపావళి శుభాకాంక్షలు..🙏🎆ఈ దీపావళి మీ జీవితాల్లో ఎన్నో వెలుగులు కాంతులు నింపాలని ఆ భగవంతుని  మనస...
12/11/2023

మీకు మీ కుటుంబ సభ్యులకు
🪔దీపావళి శుభాకాంక్షలు..🙏

🎆ఈ దీపావళి మీ జీవితాల్లో ఎన్నో వెలుగులు కాంతులు నింపాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🕉️🙏❤️

మీ మార్గాని భరత్ రామ్ రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు

Commitment Vunnodu😎Margani Bharat Anna On Fire🔥🔥
26/09/2023

Commitment Vunnodu😎

Margani Bharat Anna On Fire🔥🔥

ఈ రెండు ఫోటోలను లైట్ గా కళ్లు మూసి చూస్తే మీకు ఎవరు కనిపిస్తున్నారో చూసి కామెంట్ చేయండి
25/09/2023

ఈ రెండు ఫోటోలను లైట్ గా కళ్లు మూసి చూస్తే మీకు ఎవరు కనిపిస్తున్నారో చూసి కామెంట్ చేయండి

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ గారి నిరంతర సమాచారం కొరకు ఇప్పుడే క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ ని ఫాలో ...
25/09/2023

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ గారి నిరంతర సమాచారం కొరకు ఇప్పుడే క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Follow This WhatsApp Channel For More Day To Day Updates

https://whatsapp.com/channel/0029Va9Z5puEawdqL8yZUn3n

09.09.2023.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం–తాడేపల్లి. *- చంద్రబాబు ఒక స్కామ్‌స్టర్‌, ఒక ఫ్రాడ్‌స్టర్‌ అని తేలింది**- స్కి...
10/09/2023

09.09.2023.
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం–తాడేపల్లి.

*- చంద్రబాబు ఒక స్కామ్‌స్టర్‌, ఒక ఫ్రాడ్‌స్టర్‌ అని తేలింది*
*- స్కిల్ స్కాంతో యువతను మోసం చేసిన బాబు*
*- స్కిల్‌స్కామ్‌లో చంద్రబాబు ప్రమేయం సుస్పష్టం*
*- ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోపిడి చేశారు*
*- అందుకే చంద్రబాబును అరెస్టు చేశారు*
-: ఎంపీ శ్రీ మార్గాని భరత్‌ స్పష్టీకరణ

*పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మార్గాని భరత్‌ ప్రెస్‌మీట్‌:*

*- స్కిల్‌ స్కామ్‌లో నారా లోకేశ్‌కు ప్రమేయం ఉంది*
*- దానిపైనా సమగ్ర దర్యాప్తు జరగాలి*
*- ఈ కేసులో ఉన్న వారందరినీ బయటకు తీసుకురావాలి*
*- ప్రజాధనం కొల్లగొట్టడం అత్యంత దారుణం- నేరం*
-ః ప్రెస్‌మీట్‌లో ఎంపీ మార్గాని భరత్‌ వెల్లడి

తాడేపల్లి:

ప్రజలే సిగ్గు పడేలా..:
ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబునాయుడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరించారు. రాష్ట్రంలో ప్రజలంతా సిగ్గు పడే విధంగా చంద్రబాబునాయుడు ప్రవర్తించారు.
రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఒక స్కామ్‌స్టర్‌గా, ఒక ఫ్రాడ్‌స్టర్‌గా.. షెల్‌ కంపెనీలు పెట్టించి, ప్రభుత్వ ఖజానా నుంచి అక్షరాలా రూ. 371.25 లక్షలు ఏ రకంగా స్వాహా చేశారో చూస్తే, ఆశ్చర్యం కలుగుతుంది. 70 నుంచి 80 షెల్‌ కంపెనీలు పెట్టుకుని, ప్రభుత్వ ఖజానా నుంచి నిధులను ఎన్‌రూట్‌ చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో రాష్ట్రంలో యువతను ఏ విధంగా దగా చేశాడనేది అందరూ గుర్తించాలి.

యువత పేరుతో దోపిడీ:
నిజానికి తాము రాష్ట్ర ప్రభుత్వంతో ఏ విధమైన ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్‌ కంపెనీ ప్రకటించింది. షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి, వైట్‌ కాలర్‌ నేరాలకు పాల్పడుతూ, నిధులను దారి మళ్లించారు. ప్రభుత్వ ఖజానా నుంచే నేరుగా నిధులు కొట్టేశారు. యువత పేరు చెప్పి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా స్కిల్‌గా అవినీతి చేశారు. మీరు చేసిన దోపిడికి తగిన ఫలితం పొందక తప్పదు.

యథేచ్ఛగా మనీ లాండరింగ్‌:
సీమెన్స్‌ ఇండియా కంపెనీతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం, ఆ సంస్థ 90 శాతం నిధులు సమకూరిస్తే, ప్రభుత్వం మిగిలిన 10 శాతం పెట్టుబడి పెడుతుందని చెప్పారు. అయితే సీమెన్స్‌ కంపెనీ తన వాటాగా ఒక్క రూపాయి కూడా పెట్టకున్నా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఏకంగా తన వాటాగా రూ. 317.25 లక్షలు విడుదల చేసి, షెల్‌ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారు.
షెల్‌ కంపెనీలు పెట్టుకుని, ఆ నిధులను దిగమింగారు. తాను నోరు తెరిస్తే.. సత్యహరిశ్చంద్రుడిని అని చంద్రబాబునాయుడు చెప్పుకుంటుంటారు. ఆయన ఈ రకంగా షెల్‌ కంపెనీలు పెట్టుకుని, ఏ విధంగా నిధులు దిగమింగారో చూడమని ప్రజలను కోరుతున్నాను.

ప్రజల సానుభూతి కోసం..:
నిజానికి చంద్రబాబు మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎన్నింటిలో ఆయన స్టే తెచ్చుకున్నారు? అనేది కూడా ఆలోచించండి.
చంద్రబాబు రాజకీయ జీవితమంతా స్కామ్‌లమయం. ప్రతి చోటా దోపిడి. కానీ తాను నిప్పు లాంటి మనిషిని అని చెబుతుంటారు. మరి ఈ స్కిల్‌ స్కామ్‌కు ఏం సమాధానం చెబుతారు?
ఇన్ని అక్రమాలు చేసినా, తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ.. గగ్గోలు పెడుతున్న చంద్రబాబు, ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్థాయిలో ప్రజాధనాన్ని దిగమింగిన వారిని, అరెస్టు చేయకుండా, అందలం మీద కూర్చోబెట్టాలా?
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, రాత్రికి రాత్రి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చాడు. ఇక్కడ రాజధాని పేరుతో అంతులేని అవినీతికి పాల్పడ్డాడు.
ఇక పోలవరం ప్రాజెక్టును తామే కడతామంటూ, కేంద్రం వద్ద లాలూచి పడి ఆ ప్రాజెక్టు పనుల్లోనూ ఎంతో అవినీతి చేశాడు. చివరకు సాక్షాత్తూ ప్రధాని మోదీ సైతం.. చంద్రబాబు దోపిడిని ప్రస్తావించారు.
ప్రజాధనం లూటీ చేయడం నేరం కాదా? దమ్ముంటే సమాధానం చెప్పండి.
సింపతీ కార్డు వాడుతున్న చంద్రబాబు, తాను చేసిన నేరం నుంచి అందరి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు.

లోకేశ్‌ పాత్ర బయట పెట్టాలి:
ఈ స్కామ్‌లో చంద్రబాబు కొడుకు, లోకేశ్‌కు ప్రమేయం ఉందని తెలుస్తోంది. కాబట్టి, దానిపై కూడా పూర్తి వివరాలు రాబట్టాలి. ఈ కేసులో దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరగాలి. దీని వెనక ఉన్న వారందరి బండారం బయటపెట్టాలి. ఈ స్కామ్‌ను పార్లమెంటులో కూడా ప్రస్తావించి, వాస్తవాలను అందరికీ తెలియజేస్తాం.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..

ఆ అవసరం మాకు లేదు:
చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉంది. ఆ ప్రొటోకాల్‌ ప్రకారమే, తెల్లవారిన తర్వాతే, ఆయనను నిద్ర లేపి, మాట్లాడారు.
చట్టం ముందు అందరూ సమానమే. ఎవరూ అతీతులు కారు.

రాజకీయ కక్ష సాధించాల్సిన అవసరం ఎవరికీ లేదు.
ప్రభుత్వం చెబుతున్నట్లు, సీమెన్స్‌ కంపెనీ 90 శాతం ఖర్చు చేయాలి. కానీ ఆ సంస్థ ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండానే, ప్రభుత్వ వాటాగా 10 శాతం రూ. 371.25 కోట్లు విడుదల చేసి, షెల్‌ కంపెనీల ద్వారా వాటిని కొట్టేశారు. నూటికి నూరు శాతం ఇది ఒక పెద్ద స్కామ్‌. చంద్రబాబు ఒక పెద్ద ఫ్రాడ్‌. స్కామ్‌స్టర్‌.
------------

ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మహనీయుడు, భారత తొలి ఉపరాష్ట్రపతి,మాజీ రాష్ట్రపతి,భారతరత్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గా...
05/09/2023

ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మహనీయుడు, భారత తొలి ఉపరాష్ట్రపతి,మాజీ రాష్ట్రపతి,భారతరత్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆ భరతమాత ముద్దుబిడ్డకు శతకోటి వందనాలు.
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

సీఎం జగన్ కు స్వాగతం పలికిన ఎంపీ భరత్రాజమండ్రి, ఆగస్టు 30: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకకు హా...
30/08/2023

సీఎం జగన్ కు స్వాగతం పలికిన ఎంపీ భరత్

రాజమండ్రి, ఆగస్టు 30: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఘన స్వాగతం పలికారు. బుధవారం ఉదయం జగ్గంపేట హెలిప్యాడ్ వద్ద సీఎం జగన్ కు ఎదురెళ్ళి ఆప్యాయంగా పలకరించారు. పుష్పగుచ్చం అందజేసి సీఎంకు ఎంపీ భరత్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి జగ్గంపేట నియోజకవర్గం ఇర్రిపాకలోని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసంలో జరిగిన వివాహ వేడుకలో వధూవరులు పద్మశ్రీ అన్నపూర్ణ, సాయి ఆదర్శ్ లను సీఎం జగన్, ఎంపీ భరత్‌ ఆశీర్వదించారు.

Address

Margani Estate's, V. L. Puram
Rajahmundry
533101

Alerts

Be the first to know and let us send you an email when MP Margani Bharat FC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share