26/06/2026
విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ గారు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాజాం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కుప్పిలి చైతన్య కుమార్ మాట్లాడుతూ...
దేశంలో బీజేపీ పాలన అంటే ప్రజాస్వామ్య విలువలపై దాడి, యువత భవిష్యత్తుతో ఆటలు, ప్రజల విశ్వాసానికి ద్రోహం అని మండిపడ్డారు.
"ఓటు చోరీ... సీట్ చోరీ... విద్యార్థుల ప్రశ్నాపత్రాల చోరీ... ఇదే బీజేపీ పాలనకు ప్రతీకగా ప్రజల్లో చర్చ జరుగుతోంది" అని విమర్శించారు.
NEET వంటి జాతీయ పరీక్షల్లో పదేపదే వెలుగులోకి వస్తున్న అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకులు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల కష్టాన్ని కాపాడలేని ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కును కోల్పోతుందని అన్నారు.
అలాగే రాష్ట్రంలో రెండేళ్ల కూటమి పాలనలో ఉద్యోగాలు, రైతు సంక్షేమం, విద్య, అభివృద్ధి విషయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని విమర్శించారు.
దేశాన్ని కాపాడేది యువత... యువత భవిష్యత్తును కాపాడలేని ప్రభుత్వాలను ప్రజలే గద్దె దించుతారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడే సమయం ఆసన్నమైంది. మోదీ ప్రభుత్వ హయాంలో దాదాపు 90 పరీక్షా పత్రాల లీకులు దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయి.
ఇటీవలి ఘటనల్లోనే 20 లక్షలకు పైగా వైద్య విద్యార్థులు పరీక్ష రద్దు కావడంతో అనిశ్చితి, ఆందోళన మధ్య మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. విద్యార్థులు, వారి కుటుంబాల కోసం ఇది కేవలం ఒక పరీక్ష రద్దు సమస్య కాదు — వారి భవిష్యత్తు, కష్టపడి చేసిన శ్రమ, కలలతో ముడిపడిన అంశం.
పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలు యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, విద్యా వ్యవస్థపై విద్యార్థుల విశ్వాసాన్ని పునరుద్ధరించడం ప్రభుత్వ బాధ్యత: ✍️మీ కుప్పిలి చైతన్య కుమార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాజాం నియోజకవర్గం విజయనగరం జిల్లా