Telugu Desam Party: Rajanagaram

Telugu Desam Party: Rajanagaram Official Page of TDP Rajanagaram

అదన్నమాట సంగతి...
23/10/2025

అదన్నమాట సంగతి...

23/10/2025

విధ్వంసానికి మారు పేరైన వైసీపీ అధినేత జగన్ రెడ్డి "పీపీపీ మోడల్" పై దుష్ప్రచారం చేస్తున్నాడు





"ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే వాడికి అదే చివరి రోజు అవుతుంది"  అని నోటి మాటగా హెచ్చరించడమే కాకుండా...  అటువంటి నేరస్థు...
23/10/2025

"ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే వాడికి అదే చివరి రోజు అవుతుంది" అని నోటి మాటగా హెచ్చరించడమే కాకుండా... అటువంటి నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా కేసులు పెట్టి జైలుకు పంపమని చంద్రబాబు గారు పోలీసులకు సూచించారు. పోలీసులు కూడా అందుకు తగ్గట్టుగా కేసులు పెడుతున్నారు. ఆ శిక్షలకు భయపడే తుని అత్యాచార నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా (UTAS)ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఏపీలోని నర్...
23/10/2025

యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా (UTAS)ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.
ఏపీలోని నర్సింగ్, ఫార్మసీ విద్యార్థుల కోసం స్టూడెంట్/ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు చేపట్టాలని, ఏపీలో జర్మన్ భాష ఆధారిత నర్సింగ్ ప్రోగ్రామ్ మాదిరిగా ఆస్ట్రేలియా మా విద్యార్థుల ప్లేస్ మెంట్ కోసం స్కిల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ లను నిర్వహించాలని మంత్రి కోరారు. ఆస్ట్రేలియా అర్హతలకు అనుగుణంగా ఏపీ ఫార్మసీ విద్యార్థుల స్కిల్ సర్టిఫికేషన్స్ ను బెంచ్ మార్కు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.




23/10/2025

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు

వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై మంత్రులు, సీఎస్, ఆర్టీజీ అధికారులతో మాట్లాడిన సీఎం

యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రిని ఆదేశించిన సీఎం

ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచనలు

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం.

ప్రాణ, ఆస్తి నష్టం జరగ్గకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచనలు.

రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్
శాఖలు సమన్వయంతో పని చేయాలన్న సీఎం.

లోతట్టు ప్రాంతాల్లోనీ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం

దక్షణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో ఇప్పటికే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్టు సీఎంకు వివరించిన అధికారులు

కాలువ, చెరువు గట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్ట పరచాలని సీఎం సూచనలు

అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచన

విక్టోరియా రాష్ట్ర ఎన్విరాన్మెంట్, టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపౌలోస్‌ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స...
23/10/2025

విక్టోరియా రాష్ట్ర ఎన్విరాన్మెంట్, టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపౌలోస్‌ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మెల్‌బోర్న్‌లో కలిశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖతో కలిసి టూరిజం, మార్కెటింగ్, ఎకో సర్టిఫికేషన్‌పై కలిసి పనిచేయాలని మంత్రి లోకేష్ కోరారు.




• ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన యు ఏ ఈ పారిశ్రామికవేత్తలు. సీఎం చంద్రబాబు తొలిరోజు పర్యటన సూపర్ సక్సెస్•...
23/10/2025

• ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన యు ఏ ఈ పారిశ్రామికవేత్తలు. సీఎం చంద్రబాబు తొలిరోజు పర్యటన సూపర్ సక్సెస్

• భారత్ ,ఆస్ట్రేలియా వాణిజ్యంలో కీలక పాత్రను పోషిస్తోంది ఆంధ్రప్రదేశ్.. ఆస్ట్రేలియా పర్యటనలో స్పష్టం చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నాం.. సీఐఐ పార్ట్నర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు

• షిప్ బిల్డింగ్ నుంచి డేటా సెంటర్ల వరకు ఏపీలో అపారమైన అవకాశాలు ఉన్నాయి.. దుబాయ్ లోని భారత ఎంబసీ ప్రతినిధులతో భేటీలో సీఎం చంద్రబాబు

• లాజిస్టిక్స్ , గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించండి .. షరాఫ్ గ్రూప్ సంస్థను ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/AyvbU


ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఎ-1 ముద్దాయి జనార్ధన్ రావు, అతని సోదరుడు జగన్ మోహన్ రావులతో వైసీపీ నేత జోగి రమేష్ దిగిన ఫ...
22/10/2025

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఎ-1 ముద్దాయి జనార్ధన్ రావు, అతని సోదరుడు జగన్ మోహన్ రావులతో వైసీపీ నేత జోగి రమేష్ దిగిన ఫోటోలు చూస్తే... 'దోస్త్ మేరా దోస్త్' అన్నట్టుగా ఉన్నాయి కదా! చేసేది అక్రమ దందా అయినప్పుడు కేసయితే ముందుకు తోయడానికి ఒకరుండాలి కదా. అందుకే ఈ స్నేహం.





సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అభివృద్ధి యాగం చేస్తుంటే, మారీచుడిలా ఆ యాగాన్ని భగ్నం చేయడానికి జగనాసురుడు విశ్వప్...
22/10/2025

సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అభివృద్ధి యాగం చేస్తుంటే, మారీచుడిలా ఆ యాగాన్ని భగ్నం చేయడానికి జగనాసురుడు విశ్వప్రయత్నం చేస్తున్నాడు.


నేటి నుంచి యూఏఈలో మూడు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్ చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్థానిక తెలుగు ప్...
22/10/2025

నేటి నుంచి యూఏఈలో మూడు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్ చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్థానిక తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కాగా ఈరోజు అబుదాబి ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్ నాథ్, దుబాయ్ ఇండియన్ కౌన్సిల్ జనరల్ సతీష్ కుమార్ శివన్‌లతో సీఎం చంద్రబాబు బృందం భేటీ కానుంది.



సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిది. ఇటువంటి చర్యలను ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా,  ఏ పార్...
22/10/2025

సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిది. ఇటువంటి చర్యలను ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుంది. టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలో కూడా ప్రస్తుతం నిందితుడికి ఏ పదవీ లేదు. తప్పు చేస్తే నాయకులకైనా, సామన్యులకైనా ఒకే శిక్షలు ఉంటాయి.

ఇప్పటికే నిందితుడిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండుకు పంపుతున్నారు. కఠినమైన శిక్షలు పడేలా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఏడాది ఖరీఫ్ కి సంబంధించి, పూర్తి ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నెల 27 నుండి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాల...
22/10/2025

ఈ ఏడాది ఖరీఫ్ కి సంబంధించి, పూర్తి ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నెల 27 నుండి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

గత ప్రభుత్వంలో నెలల తరబడి ధాన్యం కొనేవాళ్లు కాదు.. కొన్న డబ్బులు ఇచ్చే వాళ్లు కాదు.. కూటమి ప్రభుత్వ రాకతో ఆ పరిస్థితి మారిపోయింది. సులభంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. 48 గంటల్లో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో పడుతున్నాయి..



Address

Rajanagaram

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Rajanagaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Rajanagaram:

Share