20/08/2026
ఏపీపీఎస్సీ గ్రూప్-1 చంద్రబాబు హయాంలో రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఎన్నికల ముందు హడావిడిగా ఆయన దానిని రిలీజ్ చేశారు. మేం అధికారం చేపట్టక ముందే ప్రిలిమ్స్ జరిగాయి. ప్రిలిమ్స్‌లో పాసైన వాళ్లకే మేం మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాం. ఎలాంటి అవకతవకలు జరగలేదని.. చంద్రబాబు వేసిన సిట్ చెప్పింది. వాల్యూయేషన్‌లో ఎలాంటి తప్పులు జరగలేదని తేల్చి చెప్పింది. అయినా కూడా పదే పదే తప్పుడు ప్రచారాలు చేశారు. అసలు ఏపీపీఎస్సీలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ఘనత మాది. మరి చంద్రబాబు హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ ఫలితాలను బయటపెట్టగలరా? చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన ఫలితాలను బయటపెట్టగలరా?.. రిటన్ టెస్ట్‌లో ఎన్ని మార్కులు, ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు చెప్పగలరా? గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల ఉద్యోగాలిచ్చాం. మా హయాంలో 78 నోటిఫికేషన్లతో 6,296 ఉద్యోగాలిచ్చాం. ఒక్క ఆరోపణ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. మా హయాంలో నిర్వహించిన 2018 గ్రూప్-1పై సీబీఐ దర్యాప్తునకు నేను రెడీ.. మీ హయాంలో జరిగిన 2025 డీఎస్సీపై సీబీఐ దర్యాప్తునకు మీరు సిద్ధమా? - చంద్రబాబు, లోకేశ్‌కు వైఎస్ జగన్ ఓపెన్ చాలెంజ్