Vinayaka Nagar Division

Vinayaka Nagar Division 137 - Vinayaka Nagar Division, Malkajgiri

01/08/2024

హరిషన్న వెనుకాల ఎవరో తొంగి తొంగి చూస్తున్నారు ఎవరో చెప్పుకోండి చూద్దాం ?? 🤔🤔🤔

19/07/2024

జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మల్కాజిగి....

16/07/2024
16/07/2024

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు, ప్రోటోకాల్ ఉల్లంఘ‌న‌ల‌పై స్పీక‌ర్‌కు ఫిర్యాదు

బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఫిర్యాదు చేసింది.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధంగా గెలిచిన తమ ఎమ్మెల్యేలను అభివృద్ధి పనులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు అడ్డుపడుతుందని మరియు ప్రోటోకాల్ విషయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా అధికారులను ప్రోత్సహిస్తున్నారని, అభివృద్ధి గురించి అడిగితే అధికారుల చేత తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని అన్నారు.

తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం లేదని అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన నిర్వహిస్తే తనపైనే డిప్యూటీ కమిషనర్ చేత అల్వాల్ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టారని, అదేవిధంగా మౌలాలి డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి వెళితే స్థానిక కాంగ్రెస్ గుండాలతో దాడికి యత్నించారని స్పీకర్ గారికి తెలియజేయగా, ఆ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి డిసిపి దృష్టికి తీసుకెళ్లాలని స్పీకర్ గారు తెలియజేశారని తెలిపారు.

అదే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు స్పీక‌ర్ దృష్టికి తీసుకెళ్లామని, బిఆర్ఎస్ గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారికి ప్రాధాన్య‌త ఇస్తూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని, వీటిన్నింటిపై దృష్టి సారించి ప‌రిష్క‌రించాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బృందం కోరిందని తెలిపారు.

స్పీక‌ర్‌ను క‌లిసిన వారిలో ఎమ్మెల్యేలు హ‌రీశ్‌రావు, కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి, సునీతా ల‌క్ష్మారెడ్డి, ప‌ద్మారావు గౌడ్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, మాధ‌వ‌రం కృష్ణారావు, మర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి, కాలేరు వెంక‌టేశ్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, డాక్ట‌ర్ క‌ల్వ‌కుంట్ల సంజ‌య్, కేపీ వివేకానంద గౌడ్ ఉన్నారు.

15/07/2024
12/07/2024
పక్క రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీకి16 ఎంపీలను ఇస్తే..పట్టుబట్టి విభజన హామీనిఅమలు చేయించుకుంటున్నది!60 వేల కోట్ల ఆయిల్ రిఫై...
12/07/2024

పక్క రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీకి
16 ఎంపీలను ఇస్తే..
పట్టుబట్టి విభజన హామీని
అమలు చేయించుకుంటున్నది!

60 వేల కోట్ల ఆయిల్ రిఫైనరీ
ఆంధ్రాలో పెడుతుందట కేంద్రం!

మన కోచ్ ఫ్యాక్టరీ,ఉక్కు ఫ్యాక్టరీ
సంగతేంది ❓

ఇక్కడ జాతీయపార్టీలకు
చెరో 8 సీట్లు ఇస్తే
చెక్క భజన చేస్తూ కూర్చున్నారు!

11/07/2024
11/07/2024
10/07/2024

మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని చెరువుల మీద ....

చెరువులను కాపాడండి, కబ్జాలు నివారించండిఅధికారులతో ఎమ్మెల్యే Marri Rajasekhar Reddy  గారు మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ...
10/07/2024

చెరువులను కాపాడండి, కబ్జాలు నివారించండి
అధికారులతో ఎమ్మెల్యే Marri Rajasekhar Reddy గారు

మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని చెరువుల మీద సంబధిత అధికారులతో సమీక్ష సమావేశం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని చెరువుల స్థలాలు రక్షణకు మరియు సుందరీకరణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు కొన్ని సూచనలు కూడా చేసారు. ఆగిపోయిన అభివృద్ధి పనులను పునర్ప్రార్భించేందుకు మరియు కొత్త అభివృద్ది పనుల కొరకు ప్రపోజల్ తయారు చేసుకోవాలని, పూర్తి అయిన పనుల నాణ్యతపై క్వాలిటీ కంట్రోల్ అధికారుల నుండి పూర్తి సమాచారం తనకు అందించాలని, చెరువుల కబ్జాలు నివారించేందుకు చర్యలు తీసుకోలని, వచ్చే వర్ష కాలంలో ప్రజలు ఇబ్బంది లేకుండా చూడాలని, గుర్రపు డెక్క తొలగింపు పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ సీజన్ లో దోమల ద్వారా వచ్చే డెంగ్యూ వ్యాధిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, మల్కాజిగిరి మరియు అల్వాల్ సర్కిల్లలో దోమల బెడద తీవ్రంగా ఉన్నందున ఫాగింగ్ మరియు ఆంటీ లార్వా స్ప్రే విస్తృతంగా పిచికారి చేయాలని, ఇలా అనేక అంశాల పై సంబధిత అధికారులతో చర్చించానని తెలిపారు.

Address

Ranga Reddy

Website

Alerts

Be the first to know and let us send you an email when Vinayaka Nagar Division posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share