Annamayya District అన్నమయ్య జిల్లా

Annamayya District అన్నమయ్య జిల్లా Annamayya is Newly formed District in Andhra Pradesh. Madanapalle is the Head Quarter of Annamayya District.
(1)

**వంటల్లో ఎవరెస్ట్, ఎల్జీ ‘ఇంగువ’ వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే!**ప్రముఖ మసాలా దినుసుల తయారీ సంస్థలైన ఎవరెస్ట్ (Evere...
30/08/2026

**వంటల్లో ఎవరెస్ట్, ఎల్జీ ‘ఇంగువ’ వాడుతున్నారా?
అయితే ఇది మీ కోసమే!**

ప్రముఖ మసాలా దినుసుల తయారీ సంస్థలైన ఎవరెస్ట్ (Everest Food Products), ఎల్జీ (Laljee Godhoo) ఇంగువ ఉత్పత్తులపై భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) తాత్కాలిక నిషేధం విధించింది. నాణ్యతా లోపాల కారణంగా FSSAI ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో ఉన్న స్టాక్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.

**ల్యాబ్ టెస్టుల్లో తేలిన అసలు విషయాలు**

ఒక వినియోగదారుడి ఫిర్యాదుతో మహారాష్ట్ర, గుజరాత్‌లలోని ఎవరెస్ట్, ఎల్జీ యూనిట్లలో FSSAI శాంపిల్స్ సేకరించి పరీక్షించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
* తగ్గిన ముడి ఇంగువ: నిబంధనల ప్రకారం కాంపౌండెడ్ ఇంగువలో కనీసం 5% ఆల్కహాల్-సాల్యుబుల్ ఎక్స్‌ట్రాక్ట్ ఉండాలి.
కానీ FSS-2011 నిబంధనలకు విరుద్ధంగా శాంపిల్స్‌లో కేవలం 0-3% మాత్రమే తేలింది.
అంటే ఉండాల్సిన దానికంటే 30-40% తక్కువగా ముడి ఇంగువను వాడుతున్నారు.
* భారీగా స్టార్చ్ (పిండి పదార్థం) కల్తీ: ఎల్జీ యూనిట్ నుంచి సేకరించిన 6 రకాల ముడి ఇంగువలో స్టార్చ్ గరిష్ఠ పరిమితి కేవలం 1% మాత్రమే ఉండాల్సి ఉండగా, ఏకంగా 15-32% వరకు పిండి పదార్థం ఉన్నట్లు గుర్తించారు.

**మరో 3 రకాల ఎవరెస్ట్ మసాలాల్లోనూ లోపాలు**

ఎవరెస్ట్ సంస్థకు చెందిన ఎగ్ కర్రీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా తయారీలోనూ ప్రమాణాలు పాటించడం లేదని FSSAI తేల్చింది. అయితే వీటి విక్రయాలపై ప్రస్తుతానికి ఎలాంటి నిషేధం విధించలేదు.

నిబంధనలు పాటించే వరకు ఇంగువపై నిషేధం అమల్లో ఉంటుందని, తప్పులను సరిదిద్దుకోకుంటే తదుపరి చర్యలు తప్పవని FSSAI స్పష్టం చేసింది.

**ఇద్దరి ప్రాణాలు తీసిన వేపచెట్టు గొడవ!**మనిషిలో పెరిగిపోతున్న క్షణికావేశం, స్వార్థం ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టేలా చేస్తు...
29/08/2026

**ఇద్దరి ప్రాణాలు తీసిన వేపచెట్టు గొడవ!**

మనిషిలో పెరిగిపోతున్న క్షణికావేశం, స్వార్థం ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టేలా చేస్తున్నాయి.
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో కేవలం ఒక వేపచెట్టు వివాదం రెండు నిండు ప్రాణాలను బలిగొంది.

ఇంటి సరిహద్దులో ఉన్న వేపచెట్టు విషయమై వెంకటేశ్వర్లు, భూక్యా సైదా కుటుంబాల మధ్య దాదాపు 25 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. శనివారం ఉదయం వెంకటేశ్వర్లు కొందరితో కలిసి ఆ వేపచెట్టును నరికించారు.
ఇది చూసిన సైదా కుమారుడు భూక్యా రాము ఆగ్రహంతో వెంకటేశ్వర్లుతో గొడవపడి, గొడ్డలితో దాడి చేసి అక్కడికక్కడే హతమార్చాడు.

అయితే, కేసును పక్కదారి పట్టించేందుకు, పరస్పరం జరిగిన దాడుల్లోనే వెంకటేశ్వర్లు చనిపోయాడని నమ్మించేందుకు అడ్డువచ్చిన సొంత తండ్రి సైదాపై కూడా రాము గొడ్డలితో దాడి చేసి దారుణంగా చంపేశాడు.

ఈ దారుణం చూసి ఆగ్రహించిన గ్రామస్తులు రాము ఇంటిపై రాళ్లదాడికి దిగగా.. పరిస్థితిని అదుపుచేసేందుకు వచ్చిన మేళ్లచెరువు ఎస్సై నవీన్ కుమార్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే ఆయన్ను హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఒక చిన్న చెట్టు వివాదం 25 ఏళ్ల శత్రుత్వంగా మారి.. చివరకు కన్నతండ్రినే నరుక్కునే స్థాయికి దిగజార్చింది.
ఆవేశం ఆలోచనను చంపేస్తే మిగిలేది ఇలాంటి నెత్తుటి విషాదాలే!

28/08/2026

"గంగజలం సాక్షిగా...
ప్రజాధనాన్ని సమంగా నొక్కేస్తాం!" 🤦‍♂️😂

రాజకీయాల్లో 'సమన్యాయం', 'సమాన పంపిణీ' అంటే ఏమిటో ఈ కౌన్సిలర్లను చూసి నేర్చుకోవాల్సిందే!

నిజాయితీగా పనిచేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసే రోజులు పోయాయి... ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏకంగా చేతిలో గంగాజలం పట్టుకుని సరికొత్త శపథం చేశారు!

శపథం దేనికంటారా?
"కార్పొరేషన్ ఆదాయాన్ని, నగరంలో జరిగే అభివృద్ధి పనుల్లోని కమీషన్లను ఎవ్వరం గొడవ పడకుండా... మొత్తం 60 మంది కౌన్సిలర్లం సమానంగా పంచుకు తింటాం" అని!
ఎంతటి ఐక్యమత్యం! ఎంతటి క్రమశిక్షణ! 👏

ఇందుకు సంబంధించిన వీడియో గత 2 రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ వైరల్ అవ్వడంతో... వ్యవహారం కాస్తా మేయర్ అర్చనా వర్మ, మున్సిపల్ కమిషనర్ సౌమ్యా గురురాణి వరకు వెళ్లింది.
వారు వెంటనే అలర్ట్ అయ్యి కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేసి, విచారణకు ఆదేశించారు.

పాపం... నొక్కేయడంలో కూడా ఇంత పారదర్శకత, ఈక్వల్ షేరింగ్ మెయింటైన్ చేస్తుంటే నోటీసులు ఇచ్చి వారి ఐక్యతను దెబ్బతీయడం న్యాయమేనా ఫ్రెండ్స్?! 🤷‍♂️

27/08/2026

కేవలం నిమిషాల వ్యవధిలోనే విధ్వంసం.
నేపాల్ లో ఆకస్మిక వరదలు ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించాయో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
God Saves Nepal!

ప్రేమించినప్పుడు ‘పేపర్ లీక్’... బ్రేకప్ అయ్యాక ‘పోలీస్ కంప్లైంట్’! 💔😂👮‍♂️"నువ్వు లేకపోతే నేను లేను" అనే పాత డైలాగులు ఇప...
27/08/2026

ప్రేమించినప్పుడు ‘పేపర్ లీక్’...
బ్రేకప్ అయ్యాక ‘పోలీస్ కంప్లైంట్’! 💔😂👮‍♂️

"నువ్వు లేకపోతే నేను లేను" అనే పాత డైలాగులు ఇప్పుడు అవుట్ డేటెడ్ బ్రదర్.. "నువ్వు నాతో లేకపోతే నీ ఉద్యోగం కూడా ఉండదు!" అనేదే ఈ కొత్త ట్రెండ్!

మహారాష్ట్రలోని నందుర్బార్‌కు చెందిన లోకేష్ అలియాస్ గౌరవ్ రాజేంద్ర పాటిల్ అనే ‘ఆణిముత్యం’ చేసిన ఘనకార్యం ఇది.
మార్చి 22న జరిగిన ఎంపీఎస్సీ (MPSC) ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) డిపార్ట్‌మెంట్‌కు చెందిన ‘డ్రగ్ ఇన్‌స్పెక్టర్ గ్రూప్-బి’ స్క్రీనింగ్ పరీక్ష కోసం తన ప్రియురాలు రుతుజా పాటిల్ కష్టపడుతుంటే చూడలేకపోయాడు.
ఏకంగా ఎగ్జామ్ పేపర్‌నే లీక్ చేయించి, ప్రశ్నలు తెచ్చిచ్చి ఆమె ఎగ్జామ్ క్లియర్ చేసేలా చేశాడు.

కట్ చేస్తే... ఎగ్జామ్ పాస్ అవ్వగానే ఇద్దరి మధ్యా బ్రేకప్ అయ్యి కథ అడ్డం తిరిగింది!

గుండె పగిలిన మన ‘దేవదాస్’ ఊరుకుంటాడా?
"నేను సెట్ చేసిన జాబ్‌తో నన్నే వదిలేసి పోతావా?" అనుకున్నాడో ఏమో... నేరుగా MPSC అధికారుల దగ్గరికే వెళ్లి, "అయ్యా! మార్చి 22న జరిగిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎగ్జామ్ పేపర్ నేనే లీక్ చేసి ఇచ్చా, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి" అని అసలు విషయం బయటపెట్టేశాడు!

దెబ్బకి రంగంలోకి దిగిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, డీసీపీ రాజ్‌ తిలక్ రోషన్ విచారణ జరిపి అసలు గుట్టు తేల్చారు.
ఆ ఒక్క కాండిడేట్ కోసమే పేపర్ లీక్ అయినట్లు తేలింది. ఇంకేముంది...

* MPSC ఆ రిక్రూట్‌మెంట్‌నే పూర్తిగా రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ పెడతామని ప్రకటించింది.
* మన ప్రేమికుడు గౌరవ్ పాటిల్‌తో పాటు మరో 3 మంది MPSC ఉద్యోగులు, ఓ కోచింగ్ అకాడమీ డైరెక్టర్‌తో కలిపి మొత్తం 6 మందిని పోలీసులు ఊచలు లెక్కపెట్టించారు!

"లవ్ లో పడి పేపర్ లీక్ చేసినా తప్పులేదు కానీ... రిజల్ట్స్ వచ్చాక బ్రేకప్ చెబితే మాత్రం కెరీర్, గవర్నమెంట్ జాబ్ రెండూ గాల్లో కలిసిపోతాయి!"

27/08/2026

అదృష్టవంతులు..

నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్ నుంచి తృటిలో తప్పించుకున్నారు.

26/08/2026

నేపాల్‌లో ఒక్కసారిగా పోటెత్తిన వరద..
టిబెట్ సరిహద్దుల్లో కొట్టుకుపోయిన వంతెనలు.
పలు గ్రామాలు ఖాళీ..

26/08/2026

**నేపాల్‌లో జల ప్రళయం..
28 మంది భద్రతా సిబ్బంది గల్లంతు! 🚨🌊**

హిమాలయ దేశం నేపాల్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.
రసువా జిల్లాలో బోటేకోషి నది ఉగ్రరూపం దాల్చడంతో భారీ విపత్తు సంభవించింది.
ఈ ఆకస్మిక జలప్రళయంలో విధుల్లో ఉన్న 28 మంది భద్రతా సిబ్బంది ఆచూకీ గల్లంతైంది.

వరద తీవ్రత క్రమంగా దిగువన ఉన్న త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాలకు సైతం విస్తరిస్తుండటంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.
నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.

రంగంలోకి దిగిన నేపాల్ ఆర్మీ, పోలీస్, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (APF) దళాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.
వరద తాకిడి ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

**బెలూన్ ఆట.. ప్రాణం తీసింది! తల్లిదండ్రులూ ఒక్క నిమిషం ఆలోచించండి! 💔🎈**మనం ఎంతో సరదాగా పిల్లల చేతికి ఇచ్చే చిన్న బెలూన్...
25/08/2026

**బెలూన్ ఆట.. ప్రాణం తీసింది!
తల్లిదండ్రులూ ఒక్క నిమిషం ఆలోచించండి! 💔🎈**

మనం ఎంతో సరదాగా పిల్లల చేతికి ఇచ్చే చిన్న బెలూన్ కూడా ఎంతటి పెను ప్రమాదానికి దారితీస్తుందో తెలిపే హృదయ విదారక ఘటన ఇది.

తమిళనాడులోని పచ్చూరుకు చెందిన వస్త్ర వ్యాపారి సత్య, కుమార్ దంపతులకు ఇద్దరు మగ కవల పిల్లలు ఉన్నారు.
సోమవారం సాయంత్రం వారిలో ఆరేళ్ల సోమనాథ్ అనే బాలుడు ఇంట్లో సరదాగా బెలూన్ ఊదుతూ ఆడుకుంటున్నాడు.
ఊహించని విధంగా ఆ బెలూన్ ఒక్కసారిగా గొంతులోకి జారి ఇరుక్కుపోయింది.
శ్వాస ఆడక ఆ చిన్నారి క్షణాల్లో స్పృహ కోల్పోయాడు.

కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
అనంతరం వైద్యులు బాలుడి గొంతులో ఇరుక్కుపోయిన బెలూన్‌ను బయటకు తీశారు.
కళ్లముందే నవ్వుతూ ఆడుకున్న ఆరేళ్ల చిన్నారి విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది.

**తల్లిదండ్రులూ... కాస్త గమనించండి:**

పిల్లలు ఆడుకునే చిన్న చిన్న వస్తువులు, బెలూన్లు, నాణేలు, చిన్న బొమ్మల పట్ల ఎల్లప్పుడూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
ఊదే సమయంలో పొరపాటున లోపలికి లాగితే శ్వాసనాళాలు మూసుకుపోయి క్షణాల్లో ప్రాణాలకే ముప్పు వస్తుంది.

ఈ విషాద వార్త ప్రతి ఒక్కరినీ తీవ్రంగా ఆలోచింపజేస్తోంది.
చిన్న పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకు తెలిసేలా ఈ సమాచారాన్ని షేర్ చేయండి.

మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఏసీబీ మెరుపు దాడి.. లెక్క తేలిన లంచం సొమ్ము ఎంతంటే?!అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ రిజి...
25/08/2026

మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఏసీబీ మెరుపు దాడి..
లెక్క తేలిన లంచం సొమ్ము ఎంతంటే?!

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు చేపట్టిన ముమ్మర తనిఖీలు ఎట్టకేలకు ముగిశాయి. సోమవారం రాత్రి కార్యాలయంపై ఆకస్మిక దాడి చేసిన అధికారులు రికార్డులు, కంప్యూటర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సోదాల్లో మొత్తం రూ.1,25,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఇందులో రూ.45,000 మాత్రమే ప్రభుత్వ సొమ్ముగా తేలగా, మిగిలిన రూ.82,865 నగదును అనధికారిక లంచం సొమ్ముగా ఏసీబీ అధికారులు నిర్ధారించారు.
ఈ మేరకు పూర్తి వివరాలను ఏసీబీ డీఎస్పీ సీతారామ రావు స్వయంగా మీడియాకు వెల్లడించారు.

Address

Rayachoti
516269

Website

Alerts

Be the first to know and let us send you an email when Annamayya District అన్నమయ్య జిల్లా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Annamayya District అన్నమయ్య జిల్లా:

Shortcuts

Share

Category