CITU Repalle

CITU Repalle CITU

రేపల్లే .. #సామజిక  #ఉద్యమకారుడు  #మహాత్మా  #జ్యోతిరావు  #పూలే  #199జయంతి... #సీపీఎం... సామాజిక అసమానతలుపై పోరాటంలో అగ్ర...
11/04/2026

రేపల్లే .. #సామజిక #ఉద్యమకారుడు #మహాత్మా #జ్యోతిరావు #పూలే #199జయంతి... #సీపీఎం... సామాజిక అసమానతలుపై పోరాటంలో అగ్రగణ్యుడు మహాత్మా జ్యోతిరావుపూలే 199 జయంతిని రేపల్లే సీపీఎం కార్యాలయంలో నిర్వహించటం జరిగింది.ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి సీపీఎం నాయకులు వై.కిషోర్ పూలమాలవేసి నివాళులు తెలిపారు.ఆనంతరం జయంతిసభలో *సీపీఎం రేపల్లే పట్టణకార్యదర్శి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ* ఈ దేశంలో అట్టడుగు అణచివేయబడిన నిమ్నజాతి వర్గాల,జాతుల కోసం నిరంతరం వారి అసమానతలు పోగొట్టాలని కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే,తొలి సామాజిక ఉద్యమనేత మొట్ట మొదటి మహాత్మా బిరుదాంకితులు జ్యోతిరావు పూలే,చదువు ద్వారానే సమాజంలో అంటరానితనం రూపుమాపాలని కృషి చేసినా మహనీయులు,మహిళా సాధికారత కోసం,మహిళాహక్కులకోసం విద్య,ఉపాధి,గౌరవం కోసం పోరాడిన మహనీయుడు అన్నారు.మహిళలుకి చదువు చెప్పటం కోసం తన భార్యకి చదువు చెప్పించి మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయులుగా సావిత్రి బాయ్ పూలే ని ప్రోత్సహించారు.దేశంలో నేటికి వివిధ రూపాల్లో కొనసాగుతున్న అంటరానితనం కులసమస్య మీద పోరాటాల్లో పూలే స్పూర్తితో ఐక్యంగా ముందుకు వెల్లదాము అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు వై కిషోర్, కె.రమేష్,సిహెచ్.ప్రకాష్,జి.ధర్మరాజు, యు.రామకృష్ణ ప్రసాద్,చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

07/04/2026

✊ సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 17వ మహాసభలు
📅 17, 18, 19 ఏప్రిల్ 2026
📍 నంద్యాల, ఆంధ్రప్రదేశ్

 #లేబర్  #కోడ్లు  #రద్దుచేయాలినీ  #బ్లాక్  #డే... #రేపల్లె బస్ స్టాండ్ సెంటర్ లో కార్మిక సంఘాలు సీఐటీయూ,ఏఐటియుసి,ఏఐఎఫ్టి...
01/04/2026

#లేబర్ #కోడ్లు #రద్దుచేయాలినీ #బ్లాక్ #డే... #రేపల్లె బస్ స్టాండ్ సెంటర్ లో కార్మిక సంఘాలు సీఐటీయూ,ఏఐటియుసి,ఏఐఎఫ్టియు (న్యూ) గా, ఈరోజు నుండి లేబర్ కోడ్లు అమలు అవటం అంటే చీకటిరోజుగా భావిస్తూ నిరసనగా బ్లాక్ డే నిరసన తెలిపారు,ఈ సిఐటీయూ బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్.మణిలాల్,ఏఐటియుసి నాయకులు కె.రమేష్,ఏఐఎఫ్టియు (న్యూ) నాయకులు ఏం.శోభారాణి గారులు మాట్లాడుతూ ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లు రద్దుచేయాలని, 29 కార్మికచట్టాలను పునరుద్ధరించాలని,కార్మికులును బానిసలుగా మార్చే లేబర్ కోడ్లు రద్దుచేయాలని డిమాండ్ చేశారు,ఈరోజు ఏప్రిల్ నుండి లేబర్ కోడ్లు అమలుచేయటానికి సిద్ధం అవుతుంది ఈ కోడ్స్ అమలు అయితే ఉద్యోగ భద్రతను హక్కులు హరిస్తాయని,పోరాడి సాధించుకున్న 8 గంటల పని రద్దై 13 గంలకు పనిగంటలు పెరుగుతాయని,సమ్మెచేసే హక్కు కోల్పోతారు, బానిసలు అవుతారు అందుకే ఈరోజు కార్మికులకు చీకటి రోజు అని 4 లేబర్ కోడ్స్ రద్దు అయ్యేవరకు పోరాటం నిర్వహిస్తామని డిమాండ్ చేశారు,ఈ బ్లాక్ డే లో కార్మికులు సీఐటీయూ,ఏఐటియుసి,ఐ ఎఫ్ టి యు (న్యూ) తదితర నాయకులు ఏం.ఈశ్వరరావు, జాలయ్య డి.ప్రభాకరరావు, కె.ఆశీర్వాదం,పి.విజయ్, యు.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు

రేపల్లె ... #దళిత  #క్రైస్తవులను  #ఎస్‌సిలుగా  #గుర్తించాలి... #సుప్రీంకోర్టుతీర్పును  #పునఃసమీక్షించాలి అని  #రౌండ్‌టేబ...
01/04/2026

రేపల్లె ... #దళిత #క్రైస్తవులను #ఎస్‌సిలుగా #గుర్తించాలి... #సుప్రీంకోర్టుతీర్పును #పునఃసమీక్షించాలి అని #రౌండ్‌టేబుల్‌ సమావేశంలో దళిత,ప్రజా సంఘాలు,రాజకీయ పార్టీలు వక్తులు డిమాండ్‌... దళిత క్రైస్తవులను ఎస్‌సిలుగా గుర్తించాలని రేపల్లె అంబేద్కర్ భవన్ లో దళిత,ప్రజా సంఘాలు ఆధ్వర్యలో నిర్వహించినా రౌండ్‌ టేబుల్‌ సమావేశం తీర్మానించింది,దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్‌ కులాలుగా పరిగణించబోమంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్‌ చేశారు, ఈ సమావేశంలోవివిధ దళిత,కార్మిక, మహిళా,యువజన,విద్యార్థి, మైనార్టీ,క్రైస్తవ,వామపక్ష పార్టీలు నాయకులు తదితర ప్రజాసంఘాలు నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు, కేంద్రంలోని అనుసరిస్తున్న విధానాలు ప్రభావంతోనే ఇటువంటి తీర్పులు వెలువడుతున్నాయని ప్రజలు అర్థం చేసుకోవాలి,చట్టసభల నుంచి న్యాయవ్యవస్థ వరకు కొంతమంది ప్రయోజనాలు కోసం మతతత్వ భావజాలం ప్రభావం పెరుగుతుంది,మన దేశంలో మత మార్పిడి స్వేచ్ఛ ఉన్నప్పటికీ కుల మార్పు సాధ్యం కాదని స్పష్టం చేశారు,కులం సామాజిక నిర్మాణానికి సంబంధించినదిగా ఉండగా, మతం వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినదని వివరించారు,ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని సూచించారు,పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు కులవివక్ష కొనసాగుతుందని,మత మార్పిడి ద్వారా అది తొలగిపోదని స్పష్టం చేశారు, సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15 పరిగణనలోకి తీసుకోకుండా ఈ తీర్పు ఇవ్వడం వల్ల దళితుల హక్కులు దెబ్బతింటాయని పేర్కొన్నారు. మతం మారినా దళితుల సామాజిక, ఆర్థిక పరిస్థితి మారదని అందుకే దళిత క్రిస్టియన్లకు ఎస్ సి లుగా గుర్తించాలి అని ఉమ్మడిగా డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీలు, దళిత నాయకులు,దోవ.రమేష్ రాంజీ, సీహెచ్.మణిలాల్, దారం. సాంబశివరావు,ఏం.శోభారాణి, కే.విజయ భాస్కర్, పి.నాగంజనీయేలు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఏ.భిక్షాలు, కిషోర్, సృజన్,రవి,న్యాయవాదులు ఎండి. సయ్యద్ రెబ్బాని ఏం.విజకుమారి, ఏం.సుబ్బయ్య,

01/04/2026

రేపల్లె... #యునైటెడ్ #ఎలక్ట్రిసిటీ #కాంట్రాక్ట్ #వర్కర్స్ #యూనియన్ (UECWU)3వ #రాష్ట్రమహాసభలు #జయప్రదంచేయాలని #ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా కడపలో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యలు పరిష్కారం లక్ష్యంగా ఏప్రిల్ 8 కడపలో జరుగుతున్న మహాసభలు జయప్రదం చేయాలని రేపల్లె నియోజకవర్గం పరిధిలో విద్యుత్ సబ్ స్టేషన్లు లో కాంట్రాక్ట్ వర్కర్స్ నీ కలిసి ప్రచారం నిర్వహించటం జరిగింది, ఇసుకపల్లి విద్యుత్ ఆఫీసు వద్ద నిర్వహించినా ప్రచారంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (CITU),రాష్ట్ర కన్వీనర్ ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ట్రాన్స్కో, జెన్కోలలో, డిస్కోమ్ లలో పనిచేస్తున్న కార్మికులందరినీ సంస్థలో విలీనం చేసి,రెగ్యులర్ చేయాలి,ప్రతి కార్మికుడికి ఉచిత వైద్యం ఆన్ లిమిటెడ్ హెల్త్ కార్డు ఇవ్వాలి,కోటి రూపాయలు బీమా మరియు కుటుంబ భద్రత కల్పించాలి,మరియు పదవీ విరమణ తరువాత 10 లక్షలు అందించాలి,ఫీల్డ్ అసిస్టెంట్లు కు అర్హతను బట్టి స్కిల్డ్ గా గుర్తించి వారికి 27,953/- రూపాయల వేతనాన్ని చెలించాలి,2019 తర్వాత చేరిన షిఫ్ట్ ఆపరేటర్లు కు 27,953/- వేతనాలు చెలించాలి,ప్రతి 33/11kv సబ్స్టేషన్ లలో నైట్ వాచ్మెన్ నియమించాలి,జెన్ కో లో పీసు రేటు కార్మికులను మ్యాన్ పవర్ కిందకు మార్చాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు పరిష్కారం కోసం భవిష్యత్తు నిర్ణయాలు చేయటం జరుగుతుంది అన్నారు.ఈ ప్రచారంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బి.సురేష్, సిఐటియు బాపట్లజిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బాబురావు,సిఐటియు కోశాధికారి సీహెచ్.మణిలాల్ సబ్ స్టేషన్లు పరిధిలో కాంట్రాక్ట్ వర్కర్స్ పాల్గొన్నారు

 #అంగన్వాడిలా  #వేతనాలుపెంపుదలపట్ల  #ప్రభుత్వ  #నిర్లక్ష్య  #వైఖరిని  #నిరసిస్తూ, #సమస్యలు  #పరిష్కరించాలినీ  #నిరసన  #ధ...
31/03/2026

#అంగన్వాడిలా #వేతనాలుపెంపుదలపట్ల #ప్రభుత్వ #నిర్లక్ష్య #వైఖరిని #నిరసిస్తూ, #సమస్యలు #పరిష్కరించాలినీ #నిరసన #ధర్నా... ఇచ్చినా హామీ మేరకు తక్షణమే వేతనాలకు పెంపుదల చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్షురాలు కే.ఝాన్సీ, సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్. మణిలాల్ డిమాండ్ చేశారు* సమస్యలు పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్ట్ కార్యాలయలు వద్ద జరుగుతున్న నిరసన ధర్నా పిలుపు నేపధ్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూగా రేపల్లె ప్రాజెక్ట్ వద్ద ధర్నా నిర్వహించి,సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సిడిపిఓ సుచరిత గారికి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా *అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే.ఝాన్సీ మాట్లాడుతూ* ఈ ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంచుతామని చెపుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనటం సమంజసం కాదని 42 రోజుల పోరాటం ద్వారా గత ప్రభుత్వంతో రాతపూర్వకమైన ఒప్పందం చేసుకోవడం మరియు ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఈ ప్రభుత్వం వేతనాలు తక్షణం పెంచాలని అన్నారు, గ్రాడ్యుటి ప్రకటించినప్పటికీ సరైన పద్ధతిలో లేకపోవడంతో అనర్హులవుతున్నారు రిటైర్డ్ అయిన మధ్యలో మరణించిన వర్తించేలాగా గ్రాడ్యుటినీ మార్పు చేయాలి,వేసవికాలంలో తీవ్రమైన ఎండలు వల్ల అనారోగ్యాలు పాలవుతున్న వర్కర్స,హెల్పర్స్ ఆరోగ్యాన్ని రక్షించే లాగా మే నెల మొత్తం వేసవి సెలవులు ప్రకటించాలి,*సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ* వేతనాలు పెంపుదల కోసం పోరాడిన అంగన్వాడీలపై గత ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే,ఈ ప్రభుత్వం సానుభూతి మాటలు చెబుతూ ఆర్థిక పరిస్థితి బాలేదు అంటూ 22 నెలల నుంచి వేతనాలు పెంచకపోవడం అంగన్వాడీలు మోసం చేయటం,ఈ ప్రభుత్వంలో ప్రజాధనాన్ని వివిధ ప్రచారాలు పేరుతో వృధా చేస్తున్నారు.కానీ రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలా వేతనాలు పెంపుదల చేయకుండా గత ప్రభుత్వం వ్యవహరించిన రీతిలోనే చేయటం సమంజసం కాదు తక్షణం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో రేపల్లె ప్రాజెక్టు అధ్యక్షురాలు కే రత్నకుమారి,కార్యదర్శి నిర్మల జ్యోతి, నాయకులు ఎన్. కృష్ణకుమారి డీ.జ్యోతి,జయప్రద, అమల,శారద, రాజ్యలక్ష్మి,హేమలత అంగన్వాడీ వర్కర్స, హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు

30/03/2026

#రేపల్లె, #నిజాంపట్నం #మండలాల్లో #మత్స్యకారులు #యాత్రలో #నిజాంపట్నం #హార్బర్, #దిండి #ఆక్వా #ఫుడ్ #పార్క్ #నిర్మాణం #పనులు #వేగవంతంగాపూర్తిచేయాలని, #జిల్లాలో #టూరిజం #అభివృద్ధిలో #మత్స్యకారులు #ఉపాధికి #ఇబ్బందిలేకుండా #ప్రణాళికలు #రూపొందించాలి...మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొల్లాటి.శ్రీను డిమాండ్ చేశారు నిజాంపట్నం,రేపల్లె మండలాల పరిధిలో బాపట్ల జిల్లా మత్స్యకార్మిక సంఘం ఆధ్వర్యంలో నిజాంపట్నం మండలం పరిధిలో గోకర్ణమఠం, నిజాంపట్నం హార్బర్,నిజాంపట్నం గ్రామంలో ఫిషర్మెన్ కాలనీ, లైన్స్ కాలనీ,దిండి అదవల,నిర్మాణంలో ఉన్న బీచ్ రోడ్డు,దిండి ఆక్వా ఫుడ్ పార్కును, నిజాంపట్నం హార్బర్ ను,నక్షత్ర నగర్,కొత్తపాలెం,రేపల్లె మండలంలో మోళ్ళగుంట,గంగడిపాలెం,పిరాటలంక పెనుమూడి,జొన్నవారిపాలెం తదితర గ్రామాల్లో పర్యటించి అనేకమంది మత్స్య కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకోవడం జరిగింది,ఈ సందర్భంగా మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొల్లాటి.శ్రీను మాట్లాడుతూ ప్రధానంగా 450 కోట్ల రూపాయలతో నిజాంపట్నం హార్బర్ పనులు చేస్తున్నప్పటికీ వేగవంతంగా చేయకపోవడం మరియు హార్బర్ ఆధునీకరణలో భాగంగా వంతెన ఏర్పాటు చేయాలని బోట్ యజమానులు కోరుకుంటున్నప్పటికీ ఆ రకంగా అభివృద్ధి చేస్తారా లేదా అని అనేకమంది మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు మరియు భూసేకరణ సమస్యతో హార్బర్ నిర్మాణం పనులు మధ్యలోనే ఆగిపోతాయేమో అనే అనుమానాలు కూడా వ్యక్తంచేశారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మత్స్యకారులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలాగా హార్బర్ నిర్మాణం పూర్తి చేయాలని,85 కోట్లతో దిండి వద్ద నిర్మాణ పనులు ప్రారంభించినా ఆక్వా ఫుడ్ పార్కు సంబంధించిన పనులను వేగవంతంగా చేయాలని ఈ ప్రాంతంలో మత్స్యకార గ్రామాల్లో ఉన్న చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని,స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి,రాష్ట్రంలో అనేక చోట్ల మత్స్యకారులు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా,స్థానికులా అనుమతి లేకుండా విషపూరిత కెమికల్ ఫ్యాక్టరీలు నిర్మాణం చేస్తున్నారు,టూరిజం పేరుతో చాలాచోట్ల మత్స్యకారుల నివాసాలు ఖాళీ చేస్తున్నారు,అలాంటి వాటికి బాపట్ల జిల్లాలో తావు ఇవ్వకుండా ఈ ప్రాంతంలో మత్స్యకారులకు ఉపయోగపడేలాగా పరిశ్రమలు నిర్మాణం,టూరిజం అభివృద్ధిచేయాలని అన్నారు,బాపట్ల జిల్లా టూరిజం అభివృద్ధికి పలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఆ ప్రణాళికల వల్ల మత్స్యకారులు ఉపాధికి ఇబ్బంది లేకుండా టూరిజాన్ని అభివృద్ధి చేయాలని,నిజాంపట్నం మండలం పరిధిలో గతంలో 270 మందికి వేట నిషేధభృతి మత్స్య భరోసా అనేక కారణాలతో ఆపివేశారు,ఆ సమస్య పట్ల అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారూ, మత్స్యకారులు నష్టపోతున్నారని అన్నారు,నిజాంపట్నం మండలం పరిధిలో వచ్చినా సమస్యలు పట్ల బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడతామని,ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు రాష్ట్రంలో మత్స్యకారులకు ప్రాతినిధ్య వహిస్తున్న మంత్రులకు వినతిపత్రాలు అందిస్తామని తెలిపారు.ఈ యాత్రలో నిజాంపట్నం మండలం పరిధిలో మత్స్యకారులు కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు,నిజాంపట్నం మండలం పరిధిలో జరిగిన యాత్రలో ఈ జాతాలో మత్స్య కార్మిక సంఘం నాయకులు,చేతి వృత్తుదారుల సంఘం నాయకులు,సిఐటియు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.బాబురావు,నాయకులు టి.కృష్ణమోహన్,ఎం.కొండయ్య,ప్రతాప్,ఏసుబాబు,బాబ్జి, బి.ఆర్య,ప్రతాప్, వి.మావో,సిహెచ్.మణిలాల్,కే.శరత్ బాబు,బి.అగస్టిన్,పి.మనోజ్,కే.గోపి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

30/03/2026
30/03/2026
30/03/2026

#బాపట్లజిల్లా #మత్స్యకారయాత్రలో #నిజాంపట్నం #హార్బర్ #ఆధునీకరణ #నిర్మాణపనులను డి పి ఆర్ ప్రకారం పూర్తిస్థాయిలో వేగవంతంగా #పెండింగ్ #లేకుండా #పనులుపూర్తిచేయాలని #డిమాండ్ చేశారు

30/03/2026

#బాపట్లజిల్లా #మత్స్యకార #యాత్రలో #రేపల్లె #నియోజకవర్గం #దిండివద్ద #100ఎకరాల్లో #85కోట్లతో #నిర్మాణపనులు #ప్రారంభమైన #ఆక్వా #ఫుడ్ #పార్కును #పరిశీలించి #స్థానిక #మత్స్యకారులకే #ఉద్యోగాలు #ఇవ్వాలని #వేగవంతంగా #నిర్మాణపనులు #చేపట్టాలిని #డిమాండ్

Address

Repalle

Website

Alerts

Be the first to know and let us send you an email when CITU Repalle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category