Sadasivpet Police Station

Sadasivpet Police Station This is the official page of Sadasivpet Police Station, Sangareddy District.

10/02/2024

• ప్లాస్టిక్ బాటిల్స్ లేదా క్యాన్లలో పెట్రోల్ పోయుటకు అనుమతి లేదు.
• ప్రతి పెట్రోల్ బంక్ నందు హై రెజల్యూషన్ కలిగిన సి.సి.టి.వి. కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
• పెట్రోల్ బంక్ యజమానులకు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ పలు సూచనలు..
ప్లాస్టిక్ బాటల్స్ లేదా క్యాన్ లలో పెట్రోల్ కొనుక్కొని కొంతమంది నేరస్తులు పలురకాల నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో గల పెట్రోల్ బంక్ యజమానులకు తెలియజేయునది ఏమనగా పెట్రోలియం యాక్ట్ 2002 ప్రకారం పెట్రోల్ ను ప్లాస్టిక్ బాటల్స్ లేదా క్యాన్ లలో పోయాడానికి అనుమతి లేదు, వాహనాల ట్యాంక్ నందు మాత్రమే పోయాలి. ఎవరైనా పై చట్టాన్ని ఉల్లంగించి, బాటల్స్ లేదా క్యాన్ లలో పెట్రోల్ పోసినట్లైతే అట్టి పెట్రోల్ బంక్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పెట్రోల్ బంక్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ప్రతి పెట్రోల్ బంక్ నందు హై రెజల్యూషన్, నైట్ విజన్ కలిగిన సి.సి.టి.వి. కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఆ కెమెరాల యొక్క స్టోరేజ్ 90 రోజుల వరకు ఉండేవిదంగా హార్డ్ డిస్క్ లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా బాటిల్స్ నందు పెట్రోల్ పోయాలని బలవంతం చేసినట్లైతే స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వలని అన్నారు.

01/02/2024
(సంగారెడ్డి లోకల్ టైమ్స్ న్యూస్):-  • ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలి. జిల్లా ఎస్పీ చెన్నూరి రూ...
30/12/2023

(సంగారెడ్డి లోకల్ టైమ్స్ న్యూస్):-

• ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలి.
జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్

డిసెంబర్-31 శనివారం సాయంత్రం నుండే ప్రారంభమైయే నూతన సంవత్సర వేడుకలకు సంభందించి పిల్లలు, పెద్దలు, యువత ఎంతో ఉత్సాహంగా, అధిక సంఖ్యలో పాల్గొంటారని, జిల్లా పరిధిలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ అన్ని రకాల భద్రతపరమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ట్రాఫిక్‌, టాస్క్‌ఫోర్స్‌, షీ టీమ్స్‌ బృందాలతో పాటు పెట్రోలింగ్‌ విభాగాలకు చెందిన పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ పట్టణాలలో, గ్రామాలలో కూడా విస్తృత స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలు ఈ వేడుకలను ప్రజలు ఆర్థరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాల్సి వుంటుందని సూచించారు. ట్రాఫిక్‌ కు అంతరాయం కలిగించే విధంగా, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా వ్యవహరించరాదని అన్నారు. నూతన సంవత్సర వేడుకలలో మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ ప్రతి సంవత్సరం ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోవడం, అవయవాలను కోల్పోయి విగత జీవులుగా మారుతున్నారన్నారు. జిల్లా ప్రజలు ఎవరైనా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వినియోగాయానికి పాల్పడితే అలాంటి వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని అన్నారు. పోలీసు వారు విధించిన అంక్షలను ఎవరైన బేకాతరు చేసి, ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 నంబర్‌కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని అన్నారు.
గడిచిన సంవత్సరం నుండి కొత్త పాఠాలు చేర్చుకొని, కొత్త ఆశలతో నూతన సంవత్సరం-2024 లోనికి అడుగుపెట్టాలని, వివాదాలకు తావులేకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా ప్రజలను జిల్లా ఎస్పీ రూపేష్ కోరారు.

Address

Sadasivpet
Sadasivpet
502291

Website

Alerts

Be the first to know and let us send you an email when Sadasivpet Police Station posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category