05/12/2019
రైతు భీమా డబ్బులు మోసం చేసి ఖాజేసిన తుకారం అనే నేరస్తున్ని అరెస్ట్ చేసిన కంగ్టి పోలీసులు
కంగ్టి మండలంలోని నాగూర్ (k) గ్రామానికి చెందిన ఒక రైతు మరణిస్తే, ఆ రైతు యొక్క భార్య అయిన శాంతమ్మకు ప్రభుత్వం తరపున 5,00,000/- లక్షల రూపాయలు బ్యాంకు ఎకౌంటు లో రావడం జరిగింది అంతే కాక కళ్యాణ లక్ష్మి పతాకంలో భాగంగా 75,000/- రూపాయలు కుడా అదే ఎకౌంటు లోకి వచ్చాయి. అందులోనుండి శాంతమ్మ 3.25 లక్షల రూపాయలు బాంక్ ఎకౌంటు నుండి తీసుకున్నారు. అనంతరం కొన్ని రోజుల తరువాత శాంతమ్మ బ్యాంక్ కు వెళ్లి మిగిలిన డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించగా ఆ ఎకౌంటు లో డబ్బులు లేవని బ్యాంక్ అధికారులు తెలియచేసారు. తన ఎకౌంటు నుండి వేరే వ్యక్తి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న బాదితురాలు కంగ్టి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా Cr No: 73/2019 u/s: 419,420, 468, 471, 66 IT act ప్రకారం కంగ్టి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. విచారణలో తుకారాం అనే వ్యక్తికి బాదితురాలి బ్యాంక్ ఎకౌంటు ATM దొరకిందని, అతను ఆ ATM కార్డు నెంబర్ ఆధారంగా గూగుల్ పే ఎకౌంటు క్రియేట్ చేసి అందులో ఉన్న 2.5 లక్షల రూపాయలను దొంగాలించడం జరిగిందని తేలింది. దీంతో కంగ్టి CI వెంకటేశ్వర్లు గారు, SI అబ్దుల్ రఫీక్ గారు ఆ నేరస్తున్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరచడం జరిగింది.