Kodela Yuvasena Nekarikallu

Kodela Yuvasena Nekarikallu మన సత్తెనపల్లి - మన కోడెల

02/09/2026

పల్నాడు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు… డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు గారు. 🙏

నందమూరి తారక రామారావు గారి పిలుపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా సేవలందించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్‌గా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహానేత కోడెల గారు.

ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలతో అట్టుడికిన పల్నాడులో శాంతి, అభివృద్ధి, ప్రజాసేవకు కొత్త అర్థం చెప్పిన నాయకుడు.
పల్నాడు ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి… వారి కన్నీటిని తుడిచేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిరంతరం శ్రమించిన ప్రజానాయకుడు.

కోడెల గారు ఒక వ్యక్తి కాదు…
పల్నాడు అభివృద్ధికి ఒక చిరునామా.
ప్రజాసేవకు ఒక నిదర్శనం.
పల్నాడు ప్రజల గుండెల్లో చెరగని జ్ఞాపకం. ❤️

ఆయన చేసిన సేవలు కాలం గడిచినా మరువలేనివి…
పల్నాడు అభివృద్ధి గురించి మాట్లాడిన ప్రతిసారీ కోడెల గారి పేరు తప్పక గుర్తొస్తుంది.

కోడెల అంటే అభివృద్ధి…
కోడెల అంటే ప్రజాసేవ…
కోడెల అంటే పల్నాడు ఆత్మగౌరవం! ✊💥

నర్సరావుపేటలో కోటప్పకొండ దేవాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్
02/09/2026

నర్సరావుపేటలో కోటప్పకొండ దేవాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్


31 ఏళ్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచన, రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా ఆచరణ..ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్ర భవ...
01/09/2026

31 ఏళ్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచన, రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా ఆచరణ..ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్ర భవిష్యత్తే ధ్యేయంగా సాగుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Nara Chandrababu Naidu గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన అనుభవం.. రాష్ట్ర ప్రగతికి మరింత బలంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.



దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ... దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.  ...
15/08/2026

దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ... దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.


పత్రికా ప్రకటనతిరుమల, 2026 ఆగస్టు 14టీటీడీకి డా. కోడెల కుటుంబం తరఫున రూ.20 లక్షల విరాళంపేదలకు వైద్య సేవలు అందిస్తున్న టీ...
14/08/2026

పత్రికా ప్రకటన
తిరుమల, 2026 ఆగస్టు 14

టీటీడీకి డా. కోడెల కుటుంబం తరఫున రూ.20 లక్షల విరాళం

పేదలకు వైద్య సేవలు అందిస్తున్న టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి డా. కోడెల కుటుంబం తరఫున రూ.20 లక్షల విరాళం అందించారు.

నవ్యాంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ ఆశయాలకు అనుగుణంగా ఆయన మనవళ్లు చిరంజీవి కోడెల గౌతం రూ.10 లక్షలు, చిరంజీవి కోడెల జేయాదిత్య రూ.10 లక్షలు విరాళంగా అందించినట్లు తెలిపారు.

ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీలను శుక్రవారం తిరుమలలోని టీటీడీ ఈవో కార్యాలయంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు డా. కోడెల శివరాం కృష్ణ అందించారు.

పేదలకు వైద్య సహాయం అందించేందుకు టీటీడీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు విరాళం అందించిన డా. కోడెల కుటుంబాన్ని ఈవో అభినందించారు.

భక్తులు, దాతలు టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మరింతగా సహకరించాలని ఆయన కోరారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

10/08/2026
చేనేత వస్త్రాలను ధరిద్దాం... నేతన్నల నైపుణ్యాన్ని, శ్రమను ఆదరిద్దాం... మన నేతన్నల భవిష్యత్తుకు ఆసరాగా నిలుద్దాం... జాతీయ...
07/08/2026

చేనేత వస్త్రాలను ధరిద్దాం... నేతన్నల నైపుణ్యాన్ని, శ్రమను ఆదరిద్దాం... మన నేతన్నల భవిష్యత్తుకు ఆసరాగా నిలుద్దాం... జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.

ఉత్తరాంధ్ర కలలు ఈరోజే రెక్కలు తొడుగుతున్నాయి.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చారిత్రాత్మక మార్పు దిశ...
01/08/2026

ఉత్తరాంధ్ర కలలు ఈరోజే రెక్కలు తొడుగుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చారిత్రాత్మక మార్పు దిశగా దూసుకుపోతున్న ఉత్తరాంధ్ర... అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రపంచానికి అనుసంధానం కాబోతోంది.






Address

Sattenapalle

Telephone

+919398689860

Website

Alerts

Be the first to know and let us send you an email when Kodela Yuvasena Nekarikallu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kodela Yuvasena Nekarikallu:

Shortcuts

Share