18/03/2022
✒️ *బస్సు ను ఢీ కొట్టిన టిప్పర్ లారీ*
✒️ *-ఇద్దరి పరిస్థితి విషమం*
✒️ *-12 మందికి తీవ్ర గాయాలు*
✒️ *-సరిహద్దుల్లో ఆగిన లారీలు*
✍️....
తమిళనాడు రాష్ట్రం మాదరపాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదరపాక్కం కుట్ రోడ్ వద్ద (సిరువాడ మలుపు) బస్సును మట్టి తరలిస్తున్న టిప్పర్ లారీ మితిమీరిన వేగంతో వచ్చి ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రంకు చెందిన 112 A బస్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.
బస్ లో ప్రయాణిస్తున్న సుమారు 13 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని ప్రాథమిక సమాఛారం.
వీరిని రెండు అంబులెన్స్ వాహనాల ద్వారా చైన్నై కు తరలించారని అధికార వర్గాల సమాచారం.
112 A బస్సు చైన్నై నుంచి సత్యవేడు కు వస్తుండగా మాదరపాక్కం, సిరువాడ కు వెళ్లే మలుపు వద్ద సత్యవేడు నుంచి మట్టిని
రెడ్ హెల్స్ కు తరలిస్తున్న
టి ఎన్20 సి వి 4019 నెంబర్ గల లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
బస్ ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది.
*భారీగా ఆగిన లారీలు*
కంకర, ఎర్రమట్టి ఇతర వస్తువులును తమిళనాడు కు తరలించే టిప్పర్ లారీలు బొమ్మాజీగుంట వద్ద నిలిచి పొయాయి. మట్టిని తరలిస్తున్న లారీ బోల్తా కొట్టింది. అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు దాంతో లారీలు ఆపేశారు. రెండు రాష్ట్రాల సరి హద్దు వద్ద జరుగుతున్న మట్టి అక్రమ రవాణా ,ఎక్కవ టన్నేజి తో వెళ్లే వాహనాల విషయాలను తమిళనాడు పోలీస్ నిఘా విభాగం అధికారులు ఆరా తీస్తున్నారు.