14/09/2025
ఉద్యోగ,ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ & టిఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ మారం జగదీశ్వర్ అన్న గారిని కరీంనగర్ స్వగృహంలో డియస్సీ 2002 హిందీ ఉపాధ్యాయ మిత్రులతో మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలపై ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారి దృష్టికి ఆలస్యంగా నియామకమైన డీఎస్సీ 2002 హిందీ ఉపాధ్యాయుల సంబంధించి జిపిఎఫ్ అకౌంట్స్ కేటాయింపు ఫైల్ ఆర్థిక శాఖలో ఉన్న అంశాన్ని,డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు ఓపిఎస్ అమలుతో పాటు మొత్తంగా ఉద్యోగ,ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ అమలు చేస్తే సిపిఎస్ ఉద్యోగి ఖాతాకు ప్రభుత్వం జమ చేసిన 10 శాతం అమౌంట్ ను వెనక్కి తీసుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం గురించి వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందిస్తూ డియస్సీ 2002 హిందీ ఉపాధ్యాయులకు జిపిఎఫ్ అకౌంట్స్ తక్షణమే కేటాయింపుకు,సిపిఎస్ రద్దుకు కృషి చేస్తామని అన్నారు.