20/04/2024
తేదీ 20-4-24 నాడు ఉదయం అందదా 4 గంటలకు తోగుట SI గారు మరియు సిబ్బంది కలిసి చందాపూర్ కొల్గురు టీ జంక్షన్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో AP 09Q4198 నెంబర్ గల ఒక మారుతి ఆల్టో కార్ అనుమానస్పదంగా కనిపించి పోలీసు వారిని చూసి పారిపోతునకు ప్రయత్నించగా అంతలో తొగుట ఎస్ఐ గారు మరియు సిబ్బంది వానికి పట్టుకొని విచారించగా వారి పేర్లు1. మహమ్మద్ నసీరుద్దీన్ తండ్రి లాల్ మొహమ్మద్ వయసు 33 సంవత్సరాలు క్యాస్ట్ ముస్లిం వృత్తి కూలి, 2. మహమ్మద్ షాదుల్ అలియాస్ భుజాంగు, వయస్సు 24 సంవత్సరాలు కులం ముస్లిం వృత్తి కూలీ 3. మజీద్ పల్లి సురేష్ తండ్రి దుర్గయ్య వయసు 35 సంవత్సరాలు కులం ముదిరాజు వృత్తికూలీ, అందరి గ్రామం తూప్రాన్ మండలం తూప్రాన్ జిల్లా మెదక్ అని తెలుపుతూ వీరు ముగ్గురు మరియు వీరి గ్రామానికి చెందిన అరికెల మల్లేశం తండ్రి అంజయ్య వయసు 23 సంవత్సరాలు కులం ముదిరాజ్, వాన్కర్ శ్రీనివాస్ తండ్రి దశరథం వయసు 29 సంవత్సరాలు కులం కటికే, గ్రామం మరియు మండలం తూప్రాన్ జిల్లా మెదక్, గార్లు కలిసి కూలి పని చేస్తుండేవారు అలా పనిచేయడం వల్ల వచ్చే సంపాదన వీరి జల్సాలకు వీరి కుటుంబ పోషణకు సరిపోవడం లేదని ఎలానైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో ఎక్కడైనా ఊరు చివరలలో మేకల మరియు గొర్రెల షెడ్లలో గొర్లను దొంగలించి వాటిని ఎక్కడైనా అమ్ముకొని అలా వచ్చిన డబ్బులతో జల్సాలు చేద్దామని నిర్ణయించుకున్నారు అయితే మహమ్మద్ నసీరొద్దీన్ మొహమ్మద్ షాదుల్ మజీద్ పల్లి సురేష్ లు కలిసి గ్రామాలలో తిరుగుతూ ఎక్కడైనా గొర్ల గాని మేకల గాని షెడ్లను కనిపిస్తే అందులో నుండి గొర్రెలు ను కానీ మేకలను దొంగలించి వారి కారులో AP 09AQ 4198 లో వేసుకుని తూప్రాన్ లో అరికెల మల్లేశం వాన్కారి శ్రీనివాస లకు అప్పగించగా వాటిని వారిద్దరూ మార్కెట్లో అమ్మగా వచ్చిన డబ్బులు ఒకరి వద్ద ఉంచుకునేవారు అలా ఎక్కువ మొత్తంలో జమ అయిన తర్వాత ఐదు భాగాలుగా పంచుకుందామని నిర్ణయించుకున్నారు, పథకంలో భాగంగా మొహమ్మద్ నసీరుద్దీన్ మహమ్మద్ షాదుల్ మజీద్ పల్లి సురేష్ లు కలిసి గత రెండు నెలలుగా శివంపేట మండలం గూడూరు గ్రామంలో ఒక గొర్రె పొట్టేలు నాలుగు గొర్రెలను దొంగలించినారు అదేవిధంగా కొండపాక మండలం మర్పడ గ్రామ శివారులో ఒక గొర్ల షెడ్లు రెండు మేకలను దొంగరించినారు అదేవిధంగా సిద్దిపేట మండలం తడకపల్లి గ్రామ శివారులో ఒక మేకల షెడ్డులో నుండి మూడు మేకులను దొంగలించినారు అదేవిధంగా తొగుట మండలం రాంపూర్ గ్రామంలో ఒక మేకల షెడ్డులో నుండి రెండు మేకలను దొంగలించినారు అదేవిధంగా దౌల్తాబాద్ మండలం ముబారసు పూర్ గ్రామంలో ఒక మేకల షెడ్డు కనిపించగా అందులోనుండి రెండు మేకలను దొంగలించినారు దొంగిలించిన ప్రతిసారి వారు మేకలను వారి కారులో వేసుకొని వాటిని అరికెల మల్లేశం వాన్కారి శ్రీనివాసరావు అప్పగించగా వారు వాటిని ఎక్కడైనా మార్కెట్లో అమ్మి అట్టి డబ్బులను ఒకరి వద్ద ఉంచుకునేవారు , అదేవిధంగా ఈరోజు తేదీ20.04.2024 నాడు వేకువ జామున గజ్వేల్ వైపు ఎక్కడైనా గొర్ల షెడ్డులు గాని మేకల షెడ్లు కానీ కనిపిస్తే వాటిలో నుండి మేకలను దొంగలించుకుందామని చెప్పి అనుకొని మొహమ్మద్ నసీరుద్దీన్ మొహమ్మద్ షాదుల్ మజీద్ పల్లి సురేష్ కలిసి వారి కారులో వస్తుండగా పోలీసు పట్టుకున్నారు. వారి వద్ద నుండి మేకలను దొంగతనం చేసి అమ్మగా వచ్చిన డబ్బులు 72000 పోలీస్ వారు స్వాధీనం చేసుకొని మహమ్మద్ నసీరుద్దీన్ మహమ్మద్ షాదుల్ మజీద్ పల్లి సురేష్ లను వారిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండు కు పంపించనైనది మిగతా ఇద్దరూ అరికెల మల్లేశం వానకారి శ్రీనివాసులు పరారీలో ఉన్నారు,
SK లతీఫ్
సర్కిల్ ఇన్స్పెక్టర్ తోగుట సర్కిల్