27/01/2025
Date:24-01-2024
రాజన్న సిరిసిల్ల జిల్లా.
*పత్రిక ప్రకటన.*
తేదీ 21.01.2025 నాడు రాత్రి 9:30 గంటలకు ముస్తఫానగర్ కి చెందిన రసామల్ల మహేష్,మాల్యాల సురేందర్ అనే ఇద్దరు వ్యక్తులు గంభిరావుపేట మండలం నుండి ముస్తఫానగర్ వెళుతుండగా కామారెడ్డి నుండి గంభిరావుపేట వస్తున్న మహమ్మద్ హమీద్ హుస్సేన్, మహమ్మద్ అమాన్ ఖాన్ ల రెండు మోటార్ సైకిల్ పై ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నారు. అట్టి విషయంపై మాట మాట పెరిగి ఈ వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసి మండల కేంద్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించగా ఇట్టి ఘర్షణ దారి తీసిన రెండు వర్గాలపై కేసు నమోదు చేసి అందులోని నాలుగు వ్యక్తులైన మహమ్మద్ హమీద్ హుస్సేన్,మహమ్మద్ అమాన్ ఖాన్, రసామల్ల మహేష్,మాల్యాల సురేందర్ ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎల్లారెడ్డిపేట్ సి.ఐ శ్రీనివాస్ తెలిపారు
*ప్రజలకు విజ్ఞప్తి..*
మతంకు సంబంధించి కానీ వర్గాలకు సంబంధించిన విషయాలపై ఇతర వర్గాల మనోభావాలను కించపరిచే విధంగా ప్రవర్తించినా,మతపర అంశాల కోణంలో హింసకు పాల్పడుతూ శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలా అనుచితంగా ప్రవర్తించిన ఏదైనా వదంతులను సోషల్ మీడియాలో వ్యాపింప చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని,ఎలాంటి ఉద్వేగాలకు లోనూ కాకుండా సంయమనం పాటిస్తూ శాంతి భద్రతల సంరక్షణకు పోలీస్ శాఖకు సహకరించాలని సి.ఐ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.