05/09/2026
తల్లిదండ్రులు జన్మనిస్తే.. ఉపాధ్యాయులు జీవితానికి దిశానిర్దేశం చేస్తారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దూమల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించాను. వారి లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలను తెలుసుకున్నాను.
విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తూ, వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తున్న ఉపాధ్యాయుల సేవలు అమూల్యమైనవి. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా గురువులు అందించిన విద్య, మార్గదర్శకత్వం కూడా ఒక ముఖ్య కారణం.
విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగుతూ లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలి. సోషల్ మీడియా, గంజాయి వంటి వాటికి దూరంగా ఉంటూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
Telangana State Police