02/06/2026
శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి బూత్ లెవెల్ ఏజెంట్ల సమీక్షా సమావేశం మరియు శిక్షణ కార్యక్రమం
• బూత్ స్థాయి బలోపేతమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అసలైన బలం.
• సరస్వతి ఆడిటోరియంలో వైభవంగా జరిగిన SIR ఓటర్ల వెరిఫికేషన్ శిక్షణా తరగతులు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధినేత గౌరవ శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు.. శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ (SIR)కు సంబంధించిన బూత్ వైస్ వెరిఫికేషన్‌పై ప్రత్యేక సమీక్షా సమావేశం మరియు శిక్షణ కార్యక్రమం ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, తిరుపతి ఎంపీ శ్రీ మద్దెల గురుమూర్తి గారు, ఎమ్మెల్సీ శ్రీ సిపాయి సుబ్రమణ్యం గారు మరియు ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ,పార్టీ విజయానికి బూత్ స్థాయి కార్యకర్తలే నిజమైన వెన్నెముక. రాబోయే రోజుల్లో ప్రతి ఎన్నికల్లోనూ గెలుపు అనేది బూత్ స్థాయి సమర్థవంతమైన నిర్వహణపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఏజెంట్, కార్యకర్త నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రతి ఓటరుతో మమేకమవ్వాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు అందించిన అపూర్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది" అని పిలుపునిచ్చారు.అలాగే, ప్రస్తుతం జరుగుతున్న SIR ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించేలా చూడాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, సిద్ధ గుంట సుధాకర్ రెడ్డి,జడ్పిటిసి సంధ్యారాణి,ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి,బర్రి సుదర్శన్ రెడ్డి,చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి,కూనాటి రమణయ్య యాదవ్,కొగిలి సుబ్రహ్మణ్యం,గంగారి రమేష్,సిరాజ్ బాషా,ఉత్తరాజి సర్వన కుమార్, చంద్రయ్యః నాయుడు,కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డి,కంట ఉదయ్ కుమార్,పఠాన్ ఫరీద్,గోరా,శ్రీవారి సురేష్,బతి శెట్టి,కోలూరు హరి నాయుడు,ప్రభాకర్,నాగేష్,మున్నా రాయల్,బులెట్ జయశ్యాం రాయల్,దయాకర్ రెడ్డి,పులి రామచంద్ర, రామ్ చంద్ర రెడ్డి,దిలీప్ యాదవ్,పసల కృష్ణయ్య, జనార్దన్ యాదవ్,నాగరాజు రెడ్డి, సురేంద్ర యాదవ్, మల్లి మొదలియర్, మధు మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాధాకృష్ణ రెడ్డి,మనోహర్ రెడ్డి, ఆర్కాడు శంకర్, నాగార్జున రెడ్డి,విజయ కుమార్ రెడ్డి
మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs) రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులు మరియు వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.