Srikakulam District Police

Srikakulam District Police Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Srikakulam District Police, Government Organization, Srikakulam.

శ్రీకాకుళం జిల్లా పోలీసు.గణేష్‌ ఉత్సవ అనుమతులు ఆన్‌లైన్‌లో ఉచితంగణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరికలెక్టర్‌ స్వప్నిల్‌ దినక...
03/09/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.

గణేష్‌ ఉత్సవ అనుమతులు ఆన్‌లైన్‌లో ఉచితం

గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్ పుండ్కర్

మండపాలు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనసరి - జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 3: జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా 'సింగిల్ విండో' విధానంలో రూపాయి కూడా రుసుము చెల్లించకుండా ఉచితంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని, దరఖాస్తు చేసుకోగానే అధికారులే నేరుగా వచ్చి పరిశీలిస్తారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ,జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు తగినంత ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనుమతుల విధానంపై శుక్రవారం డివిజన్, ఆ మరుసటి రోజు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. పర్యావరణహిత మండపాలను ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయిలో కమిటీ సభ్యులు ప్రజలను చైతన్యవంతలను చేయాలని కోరారు. అన్నదానాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని లేకుండా చూడాలని,బీఐఎస్ లేదా ఐఎస్ఐ ప్రమాణాలున్న విద్యుత్ పరికరాలనే మండపాలలో వాడాలని, భారీ విగ్రహాలకు సంబంధించి మండపాల వద్ద ఇంజినీరింగ్ అధికారుల నుంచి నిర్మాణ దృఢత్వ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని తేల్చిచెప్పారు.నిమజ్జన ప్రాంతాల్లో తాగునీరు, వెలుతురు, పారిశుధ్యం, క్రేన్లు అందుబాటులో ఉంచాలని, ఈతగాళ్ల వివరాలను ముందే నమోదు చేసుకుని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ 'గణేష్ ఉత్సవ్ 2026' పోర్టల్ ( https://ganeshutsav.net)ద్వారా దరఖాస్తు చేసుకుంటే స్థానిక సంస్థలు, ఇతర శాఖల అధికారులు పరిశీలించి అనుమతులు ఇస్తారని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఊరేగింపుల్లో అధిక శబ్ద తీవ్రత కలిగిన డీజేలు వినియోగించరాదని కోరారు, మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రమాదకరమైన ప్రవాహం ఉన్న నదులు, కాలువల్లో నిమజ్జనానికి అనుమతి లేదని, తహసిల్దార్లు, పోలీసులు ముందే గుర్తించిన సురక్షిత ప్రాంతాలు, తాత్కాలిక నిమజ్జన గుండాల వద్దనే నిమజ్జనాలు చేయాలని కలెక్టర్, ఎస్పీ దిశా నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద, కాశీబుగ్గ డీఎస్పీ భవాని, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య, విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులు, ఆన్‌లైన్ ద్వారా పలాస టెక్కలి ఆర్డీవోలు కృష్ణమూర్తి అప్పలరాజు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు సింతు సుధాకర్, భాస్కరరావు, డాక్టర్ శేషగిరి తదితరులు పాల్గొన్నారు.
Dgp Andhra Pradesh Srikakulam District Police Andhra Pradesh Police

శ్రీకాకుళం జిల్లా పోలీసుఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద 2.500 కిలోల గంజాయి స్వాధీనంఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్:తేదీ 02.0...
02/09/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు

ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద 2.500 కిలోల గంజాయి స్వాధీనం

ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్:
తేదీ 02.09.2026 ఉదయం 08.00 గంటల సమయంలో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని, ఒక బాలుడిని ఇచ్చాపురం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుండి సుమారు 2.500 కిలోల గంజాయి, ఒక మొబైల్ ఫోన్‌ను ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ. శ్రీ ఎం. ముకుందరావు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా కేసు వివరాలను ఇచ్చాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. చిన్నానాయుడు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని, మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Andhra Pradesh Police | Srikakulam District Police | DGP Andhra Pradesh

శ్రీకాకుళం జిల్లా పోలీసుll ఆస్తి నేరాల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస...
01/09/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు

ll ఆస్తి నేరాల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్.ll

శ్రీకాకుళం, సెప్టెంబర్ 01: పెండింగ్‌లో ఉన్న ఆస్తి నేరాల కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిర్ణీత సమయంలో సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జామ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సై స్థాయి అధికారులతో జిల్లా ఎస్పీ ఆస్తి నేరాల కేసుల దర్యాప్తుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హౌస్‌ బ్రేకింగ్‌, చైన్‌ స్నాచింగ్‌, రాబరీ, డెకాయిటీ, మర్డర్‌ ఫర్‌ గెయిన్‌, ద్విచక్ర వాహనాల దొంగతనాలు తదితర ఆస్తి నేరాలకు సంబంధించిన పెండింగ్‌ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఆస్తి నేరాల కేసుల ఛేదనలో సీసీ కెమెరాల ఫుటేజ్‌ కీలక ఆధారంగా నిలుస్తుందని, నేరం జరిగిన ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను నిశితంగా పరిశీలించి, నిందితుల కదలికలను గుర్తించాలని సూచించారు. నేర స్థలంలో లభించే భౌతిక ఆధారాలతో పాటు సాంకేతిక ఆధారాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి, వాటిని విశ్లేషిస్తూ సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.ఆస్తి నేరాలకు సంబంధించి ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి, ఆలస్యం చేయకుండా క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించాలని స్పష్టం చేశారు. నేరస్థుల గత చరిత్ర, నేరం జరిగిన విధానం, సాంకేతిక ఆధారాలు తదితర అంశాలను సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు చేపట్టాలని సూచించారు.పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి కేసు దర్యాప్తు పురోగతిని సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. దర్యాప్తులో జాప్యం లేకుండా, నిర్ణీత సమయంలో కేసుల ఛార్జ్‌షీట్లను కోర్టులో దాఖలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మరియు సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Srikakulam District Police Dgp Andhra Pradesh Andhra Pradesh Police

శ్రీకాకుళం జిల్లా పోలీసు.ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డుకు ఘన సన్మానంశ్రీకాకుళం, సెప్టెంబర్ 1: ఈ దినం ఉద్యోగ విరమణ పొందిన ...
01/09/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.

ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డుకు ఘన సన్మానం

శ్రీకాకుళం, సెప్టెంబర్ 1: ఈ దినం ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు ఆర్. నరసింహమూర్తిని మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు నరసింహమూర్తిని పూలమాల, దుశ్శాలువతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. అలాగే తక్షణ సహాయంగా రూ.5,000/- ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ అందించిన సేవలను అభినందించారు. ఉద్యోగ విరమణ అనంతరం నరసింహమూర్తి గారు కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సహాయ పరిపాలన అధికారి సత్యనారాయణ, ఆర్ఐ కె.నర్సింగరావు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh Police Srikakulam District Police Dgp Andhra Pradesh

01/09/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.

కళింగపట్నం గ్రామంలో జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు- మెగా పల్లె నిద్ర కార్యక్రమం.
Srikakulam District Police Dgp Andhra Pradesh Andhra Pradesh Police

శ్రీకాకుళం జిల్లా పోలీసు.ll జిల్లా వ్యాప్తంగా 830 గ్రామాల్లో మెగా పల్లె నిద్ర.ll ll హెడ్ కానిస్టేబుల్ నుంచి జిల్లా ఎస్పీ...
01/09/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.
ll జిల్లా వ్యాప్తంగా 830 గ్రామాల్లో మెగా పల్లె నిద్ర.ll

ll హెడ్ కానిస్టేబుల్ నుంచి జిల్లా ఎస్పీ వరకు గ్రామాల్లో రాత్రి బస – ప్రజలతో మమేకం.ll

శ్రీకాకుళం, సెప్టెంబర్ 01: మెగా పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి జిల్లాలోని సుమారు 830 గ్రామాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది పల్లె నిద్ర నిర్వహించి రాత్రి బస చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ తెలిపారు.
హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం, ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువగా ఉండటం, భద్రతా భరోసా కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు.
జిల్లా ఎస్పీ స్వయంగా గార మండలం కళింగపట్నం గ్రామంలో పల్లె నిద్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్థులతో సమావేశమై మహిళా, బాలల భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, రహదారి భద్రత, ఆస్తి నేరాల నివారణ, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టేందుకు పల్లె నిద్ర కార్యక్రమం దోహదపడుతుందని ఎస్పీ తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Andhra Pradesh Police Srikakulam District Police Dgp Andhra Pradesh

శ్రీకాకుళం జిల్లా పోలీసు.ll జిల్లా వ్యాప్తంగా మెగా పల్లె నిద్ర కార్యక్రమం.ll lజిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐ...
31/08/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.

ll జిల్లా వ్యాప్తంగా మెగా పల్లె నిద్ర కార్యక్రమం.ll

lజిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సోమవారం “మెగా పల్లె నిద్ర” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, పోలీస్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు పల్లె నిద్ర నిర్వహిస్తున్నారు.
పోలీసు అధికారులు గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు, రానున్న ఎన్నికల్లో దృష్ట్య గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితి, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు, మహిళ భద్రత, మాదక ద్రవ్యాలు నియంత్రణ పై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రాత్రి వేళల్లో ఆయా గ్రామాల్లోనే బస చేస్తూ ప్రజల్లో భద్రతా భరోసాను కల్పిస్తున్నారు.ప్రజలకు మరింత చేరువగా ఉండి, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని, శాంతియుతమైన వాతావరణాన్ని కల్పించడమే “మెగా పల్లె నిద్ర” కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా పోలీసు శాఖ తెలిపింది.
Dgp Andhra Pradesh Srikakulam District Police Andhra Pradesh Police

31/08/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.
మెగా పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా కళింగపట్నం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్., అనంతరం మీడియాతో మాట్లాడారు.
Dgp Andhra Pradesh Andhra Pradesh Police Srikakulam District Police

శ్రీకాకుళం జిల్లా పోలీసు.ll గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే “మెగా పల్లె నిద్ర” – జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహే...
31/08/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.

ll గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే “మెగా పల్లె నిద్ర” – జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్.ll

ll సీసీ కెమెరాల ఏర్పాటు,మాదక ద్రవ్యాల ప్రభావం, గ్రామస్తుల సమస్యలు ,పలు అంశాల పై గ్రామస్థులతో జిల్లా ఎస్పీ చర్చ.ll

శ్రీకాకుళం: ఆగస్టు 31. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు డీజీపీ గారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలో “మెగా పల్లె నిద్ర” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐ.పి.ఎస్.సోమవారం కళింగపట్నం గ్రామంలో స్వయంగా పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, గ్రామంలోని భద్రతా పరిస్థితులు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలను తెలుసుకోనున్నారు. అనంతరం అదే గ్రామంలో రాత్రి బస చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియా తో మాట్లాడుతూ..గత వారం రోజులుగా జిల్లాలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఇందులో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా “మెగా పల్లె నిద్ర” కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాలను సందర్శించి గ్రామస్థులతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 830 గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గ్రామ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, పోలీసు శాఖకు సంబంధించిన సమస్యలను పరిశీలించి పరిష్కరించడంతో పాటు, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

కళింగపట్నంలో గ్రామస్థులతో ముఖాముఖి
ఈరోజు మొదటి రోజుగా కళింగపట్నం గ్రామాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ గ్రామస్థులతో నేరుగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ సమస్యలు, పబ్లిక్ న్యూసెన్స్, మాదక ద్రవ్యాల ప్రభావం, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.

ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం” – జిల్లా ఎస్పీ:-

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేరాల నియంత్రణ, నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి గ్రామంలో ముఖ్యమైన ప్రాంతాలతో పాటు వీలైనంత వరకు ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్థులకు సూచించారు.ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం*” అని పేర్కొంటూ, సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించడం, నేరాల దర్యాప్తులో ఆధారాలను సేకరించడం సులభతరం అవుతుందని తెలిపారు.

మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం:- యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల క్రయవిక్రయాలు, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.గ్రామాల్లో గంజాయి క్రయవిక్రయాలు, రవాణా లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో ప్రజల సహకారం అత్యంత అవసరమని అన్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి:- రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో ఎటువంటి అనవసర గొడవలు, ఘర్షణలకు తావు లేకుండా ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, మహిళల భద్రత, సైబర్ నేరాలు, భూ వివాదాలు, ట్రాఫిక్ సమస్యలు, పబ్లిక్ న్యూసెన్స్ తదితర అంశాలపై ప్రజలతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రతి 15 రోజులకు గ్రామాన్ని సందర్శించేలా దత్తత కానిస్టేబుల్* ప్రతి గ్రామానికి దత్తత కానిస్టేబుల్‌ను నియమించి, ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామాన్ని సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. గ్రామస్థులతో నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పోలీసు శాఖకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని అన్నారు.

పోలీసుల వైపు నుంచి ఎక్కడైనా నిర్లక్ష్యం లేదా విధుల్లో అలసత్వం కనిపిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.

ప్రతి రోజూ ఒక గ్రామాన్ని సందర్శిస్తూ “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, గ్రామస్థుల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఐ పైడిపు నాయుడు, ఎస్బి ఇన్స్పెక్టర్ ఇమ్మాన్యూల్ రాజ్, ఎస్సై గంగరాజు, స్థానిక గ్రామస్థులు పాల్గొన్నారు
Srikakulam District Police Dgp Andhra Pradesh Andhra Pradesh Police

శ్రీకాకుళం జిల్లా పోలీసుll పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత.ll ll విశ్రాంత పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు అండగ...
31/08/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు

ll పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత.ll

ll విశ్రాంత పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటాం.ll

ll రిటైర్మెంట్, డెత్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా సత్వర చర్యలు చేపట్టాలి.ll

ll సమస్యలు ఉంటే నేరుగా లేదా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.ll

ll జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్.ll

శ్రీకాకుళం,ఆగస్టు 31: పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు పేర్కొన్నారు.విశ్రాంత పోలీసు ఉద్యోగులు, విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని, వారికి ప్రభుత్వం మరియు పోలీసు శాఖ నుంచి అందాల్సిన రిటైర్మెంట్, డెత్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు.పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా రానున్న అమరవీరుల దినోత్సవం 2026 పురస్కరించుకొని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు సోమవారం పోలీసు వెల్ఫేర్ డే కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో విశ్రాంత పోలీసు ఉద్యోగులు, సర్వీసులో ఉండగా మృతి చెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యులు, హోంగార్డు కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ సమావేశమై వారి వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పెన్షన్, గ్రాట్యుటీ, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, విడో బెనిఫిట్స్, కార్పస్ ఫండ్, అడిషనల్ కార్పస్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర ప్రభుత్వ ప్రయోజనాలతో పాటు, కారుణ్య నియామకాలు, పెండింగ్ బకాయిలు మరియు ఇతర శాఖాపరమైన ప్రయోజనాల గురించి కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతి కుటుంబ సభ్యుడితో జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడి, ఇప్పటివరకు ప్రభుత్వం, పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి పొందిన ప్రయోజనాలు, ఇంకా పెండింగ్‌లో ఉన్న బకాయిలు, ప్రయోజనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రయోజనాలను త్వరితగతిన పరిష్కరించి, అర్హులైన వారికి సకాలంలో మంజూరయ్యేలా అవసరమైన ఉత్తరప్రత్యుత్తరాలు చేపట్టాలని సంబంధిత కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించిన కారుణ్య నియామకాలపై కూడా జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రస్తుతం వాటి స్థితి ఏమిటి, ఏ కారణంగా పెండింగ్‌లో ఉన్నాయి అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు.అలాగే, బెనిఫిట్స్ పొందేందుకు అవసరమైన సరైన ధృవీకరణ పత్రాలను సంబంధిత పోలీసు కార్యాలయానికి సమర్పించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. వ్యక్తిగతంగా లేదా శాఖాపరంగా ఏవైనా సమస్యలు ఉన్నా నేరుగా తనను సంప్రదించవచ్చని, అవసరమైతే తన స్వీయ ఫోన్ నంబర్ 6309990800 ద్వారా కూడా సమస్యలను తెలియజేయవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసు కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో సహాయ పరిపాలన అధికారి సత్యనారాయణ, ఆర్‌ఐ కె.వి. నర్సింగరావు, కార్యాలయ సూపరింటెండెంట్లు, పోలీసు కార్యాలయ సిబ్బంది, ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బంది, మృతి చెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యులు, హోంగార్డు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Andhra Pradesh Police Srikakulam District Police Dgp Andhra Pradesh

Address

Srikakulam
532001

Alerts

Be the first to know and let us send you an email when Srikakulam District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Srikakulam District Police:

Shortcuts

Share