Nadukuditi Eswara Rao - Ner

Nadukuditi Eswara Rao - Ner Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nadukuditi Eswara Rao - Ner, Etcherla, Srikakulam.

02/09/2026

"ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు"

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజాసేవ పట్ల అచంచలమైన సంకల్పంతో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు నా క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించాము.

ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరిన్ని విజయాలు కలగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాము.

ఈ వేడుకల్లో జనసేన ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ విశ్వక్సేన్ గారు, కూటమి పార్టీల నాలుగు మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

"భద్రమహంకాళి సన్నిధిలో ప్రత్యేక పూజలు"ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కోటపాలెం పంచాయతీలో కొలువైన శ్రీ భద్రమహంకాళి అ...
01/09/2026

"భద్రమహంకాళి సన్నిధిలో ప్రత్యేక పూజలు"

ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కోటపాలెం పంచాయతీలో కొలువైన శ్రీ భద్రమహంకాళి అమ్మవారిని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాము.

ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించాము. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

"అర్హులందరికీ పింఛన్.. ప్రతి ఇంటా సంక్షేమం!"'ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ' కార్యక్రమంలో భాగంగా  ఈరోజు పంచాయతీ ఛాంబర్ రాష...
01/09/2026

"అర్హులందరికీ పింఛన్.. ప్రతి ఇంటా సంక్షేమం!"

'ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ' కార్యక్రమంలో భాగంగా ఈరోజు పంచాయతీ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, నా శ్రీమతి రజనీ NER గారితో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశాము.

రణస్థలం మండలం బంటుపల్లి, కొచ్చెర్ల పంచాయతీలు, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం పంచాయతీ, లావేరు మండలం లోపెంట పంచాయతీల్లో పింఛన్లు పంపిణీ చేశాము.

పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హునికీ చేరేలా కృషి చేస్తూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము.

బంటుపల్లిలో కొత్త పెన్షన్ అందజేశాను 🙏రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీలో భర్తను కోల్పోయిన పేద మహిళకు Spouse ఎన్టీఆర్ భరోసా...
01/09/2026

బంటుపల్లిలో కొత్త పెన్షన్ అందజేశాను 🙏

రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీలో భర్తను కోల్పోయిన పేద మహిళకు Spouse ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేశాను.

పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాం.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ప్రజలకు అండగా… ప్రజా సంక్షేమమే లక్ష్యంగా🤝

ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కోటపాలెం పంచాయతీలో కొలువై ఉన్న శ్రీ భద్రమహంకాళి అమ్మవారిని విజయనగరం పార్లమెంటు సభ్య...
01/09/2026

ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కోటపాలెం పంచాయతీలో కొలువై ఉన్న శ్రీ భద్రమహంకాళి అమ్మవారిని విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారితో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందాను.

ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను.

అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ప్రసాదించాలని కోరుకున్నాను.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అమ్మవారి ఆశీస్సులతో ప్రజాసేవే మా సంకల్పం… 🙏

పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం 🤝ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు మండలాల్లో నిర్వహించిన పెన్షన్ ...
01/09/2026

పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం 🤝

ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు మండలాల్లో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని, అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశాను.

📍 రణస్థలం మండలం – కొచ్చెర్ల పంచాయతీ, కొమరవానిపేట గ్రామం
📍 ఎచ్చెర్ల మండలం – బుడగట్లపాలెం పంచాయతీ
📍 లావేరు మండలం – లోపెంట గ్రామం

ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాను. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది.

ప్రజల సంక్షేమం, పేదల అభ్యున్నతే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తాను.

ఈ కార్యక్రమాల్లో విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, కూటమి నాయకులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే మా సంకల్పం…
ఎచ్చెర్ల అభివృద్ధే మా లక్ష్యం🙏

"సంచార జాతుల సేవలు చిరస్మరనీయం"అనకాపల్లిలోని డా.రావు గోపాలరావు కళాక్షేత్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ...
31/08/2026

"సంచార జాతుల సేవలు చిరస్మరనీయం"

అనకాపల్లిలోని డా.రావు గోపాలరావు కళాక్షేత్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన “స్ఫూర్తి” సంచార, అర్ధ సంచార విముక్త దివాస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో సంచార, అర్ధ సంచార జాతులు అందించిన సేవలు, వారి త్యాగాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం. వారి అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించాను.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గారు , ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగళి గోపి శ్రీనివాస్ గారు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు గారు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు.

31/08/2026
బంటుపల్లిలో ఘనంగా “నమస్తే ఎచ్చెర్ల” కార్యక్రమం 🇮🇳ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో యువ నాయకుడు, బీఎల...
30/08/2026

బంటుపల్లిలో ఘనంగా “నమస్తే ఎచ్చెర్ల” కార్యక్రమం 🇮🇳

ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో యువ నాయకుడు, బీఎల్‌ఏ–1 Teja Nadukuditi ఆధ్వర్యంలో నిర్వహించిన “నమస్తే ఎచ్చెర్ల” కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారితో కలిసి బంటుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాను.

గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం నా ప్రధాన లక్ష్యం. బంటుపల్లి గ్రామంలో చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.

అనంతరం నిర్వహించిన “నమస్తే ఎచ్చెర్ల” కార్యక్రమంలో జిల్లా నాయకులు, నాలుగు మండలాల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, NER యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రజలతో నేరుగా మమేకమై, ప్రతి గ్రామంలోని సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే “నమస్తే ఎచ్చెర్ల” కార్యక్రమం లక్ష్యం.

కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో, ప్రజల ఆశీస్సులతో ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమం, ప్రగతిలో అగ్రగామిగా నిలిపేందుకు మరింత అంకితభావంతో పనిచేస్తాను.

ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి...
ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి...
ఎచ్చెర్ల నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి... 🇮🇳

Address

Etcherla
Srikakulam
532407

Telephone

+919701333666

Website

Alerts

Be the first to know and let us send you an email when Nadukuditi Eswara Rao - Ner posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Nadukuditi Eswara Rao - Ner:

Shortcuts

Share