Srisailam Hindu Mala Anna Trust

Srisailam Hindu Mala Anna Trust Sri Bhramaramba Mallikarujuna Hindu Mala Anna Trust, Non Profit Organization. Near Tollgate Srisailam

శ్రీశైల క్షేత్రం మహత్తరమైన యోగ భూమి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో శ్రీశైల క్షేత్రానికి గల విశేషాలు కోకొల్లలు ఈ క్షేత్రం అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం రెండవ క్షేత్రం మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవది అఖండ భూమండలంలో ఆధ్యాత్మిక సంపద గల భరత ఖండంలో శ్రీశైలం భూకైలాసం శ్రీశైలంలోని శివలింగ దర్శనం జన్మరాహిత్యాన్ని కలిగించి ముక్తిని ప్రసాదించే మహత్తర జ్యోతిర్లింగం ఋషులకు యోగుల

కు సిద్ధులకు ఔషధాలకు నిలయమైన అనంత విశేషాలు కలిగి ఉన్న అద్భుతమైన పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీశైలం ఈ భూమండలానికి నాభిస్థానం

జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు వారు ఇచ్చట తపస్సు అనుసరించుట చే ఈ క్షేత్రమునకు ఒక ప్రత్యేకత విశిష్టత ఏర్పడినది కృష్ణా నది తీరమున ప్రకృతి రమణీయమైన పర్యావరణ అరణ్య మధ్య ప్రదేశమున నెలకొని ఉన్న ఈ మహా క్షేత్రం దినదినాభివృద్ధి గావించు చున్నది యాత్రికుల సంఖ్య మిక్కుటంగా పెరుగుచున్నది అట్టి యాత్రికులకు ఉచిత భోజన వసతి కల్పించడం ఈశ్వర ఆరాధనలో భాగంగా పరిగణింపబడుచున్నది ఇచ్చట చేయు అన్నదానము ఈ హా పరలోక సాధనము విశేష ఫలదాయకం

ప్రయోగాలు లక్షమందికి , కాశీలో రెండు లక్షల మందికి పవిత్ర గంగానది ఒడ్డున ఏడు లక్షల మందికి అన్నదానం చేస్తే ఎంత పుణ్యమో ఈ శ్రీశైల క్షేత్రములో ఒక్కరికీ అన్నదానం చేస్తే అంతటి పుణ్యాన్ని కలిగిస్తుంది అని పురాణాలు సూచిస్తున్నాయి

శ్రీశైల క్షేత్రం సముద్ర మట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తులో కలదు ఇక్కడ నుండి కాశీకి సొరంగమార్గం ఉన్నట్లు ప్రసిద్ధి కాశీ పుణ్య క్షేత్రంలో మరణం అరుణాచలంలో భగవన్నామ స్మరణం శ్రీశైలం దర్శనం ముక్తి ప్రదాయకం శ్రీశైలంలో అనంత కోటి లింగం లు కలవు దేవతలు అవతార పురుషులు హిరణ్యకశిపుడు శ్రీరామచంద్రుడు పాండవులు దర్శించి పూజలు చేసి ఆలయాలు నిర్మించి నట్లు continue...
ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఆచార్య నాగార్జునుడు శ్రీకృష్ణదేవరాయలు మరియు చత్రపతి శివాజీ వంటి ప్రముఖులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న శాసనాలు తెలియజేస్తున్నాయి

ఈ పుణ్య క్షేత్రం నందు అన్ని కులముల వారు వారి వారి స్తోమతను బట్టి అన్నదాన సత్రంలో నిర్మించుకొని స్వామి అమ్మవార్ల దర్శనం కొరకు వచ్చే వారికి భోజన వసతి సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి అదే విధంగా అత్యధిక జనాభా గల మాల కులస్తులకు అంటే మనకు ఇంతవరకు వసతులు గల సత్రము లేదు కనుక మాల కులస్తులు అందరూ వారివారి స్తోమతను బట్టి ఆర్థిక సహాయం చేస్తూ క్షేత్రానికి వచ్చే భక్తులకు సేవ చేయుట మనందరి బాధ్యతగా భావించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున హిందూ మా అన్న సత్రం మన హిందూ మాలలకు గాను శ్రీశైల దేవస్థానం వారు మొదట రెండు ఎకరాల స్థలంలో కేటాయించడం జరిగింది కానీ మన దగ్గర సత్రం నిర్మించుకునేందుకు స్తోమత లేక స్థలం అలాగే ఉండిపోయింది ఈ విషయాన్ని గమనించిన దేవస్థానం వారు ఆ స్థలాన్ని నోటీసులు పంపి స్వాధీనం చేసుకోవడం జరిగింది నూతనంగా ఎన్నికైన కమిటీ మరోసారి దరఖాస్తు చేసుకోగా 50 సెంట్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఒక దాత ద్వారా ధనమును అప్పుగా తెచ్చి పది గదులను నిర్మిం చడం జరిగింది ఆ తర్వాత మన హిందూ మహా దాతలు ముందుకు వచ్చి కొన్ని గదులు నిర్మించడం జరుగుతున్నది ఇప్పటికైనా మన హిందూ మహిళలు ముందుకు వచ్చి సగర్వంగా నిర్మించుకుందాం చరిత్రలో చేతకాని వారిగా నిలిచిపోతారు ఇది మాలలు గమనించగలరు

31/01/2026
18/02/2025

💐 మన హిందూ మలలకు 🙏 నమస్కారం.
శ్రీశైలం లోని మన హిందూ మల సత్రము నందు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శివరాత్రి పర్వదినం పురష్కరించుకుని అన్నదాన కార్యక్రమం జరపబడుచున్నది. కావున మన మాలలందరు తమ తమ వంతు సహాయసహకారాలు అందించాలని కోరుతున్నాము. దాతలు ఎవరైనా వస్తు రూపంలో అయిన సరే ధన , ధాన్య రూపంలో అయిన సరే విరాళంగా ఇవ్వవచ్చు. Cell 9985670475, 9441912733, 9553995943

UNION BANK
NAME: SBMH MALA ANNA TRUST
ACCOUNT NUMBER: 051511100000964
IFSC: UBIN0805157

Google pay: 7337381765

హిందూ మాల అన్నదాన సత్రం శ్రీశైలం. 🙏💐

గమనిక :- దాతలు ఎవరైనా సరే ధాన్యం పంపించడాలచిన వాళ్ళు. శివరాత్రి మూడు రోజుల ముందు పంపించగలరు. శివరాత్రి మూడు రోజుల ముందు నుండి బస్ ట్రాన్స్పోర్ట్ సాకర్యం అందకపోవచ్చు.

శ్రీశైలంలోని మన హిందూ మాల అన్న ట్రస్టు, సత్రమునకు హైదరాబాదుకు చెందిన  హిందూ మాల వివాహ పరిచయ వేదిక వ్యవస్థాపకులు మరియు మన...
17/06/2024

శ్రీశైలంలోని మన హిందూ మాల అన్న ట్రస్టు, సత్రమునకు హైదరాబాదుకు చెందిన హిందూ మాల వివాహ పరిచయ వేదిక వ్యవస్థాపకులు మరియు మన సత్రం ట్రస్ట్ కమిటీ సభ్యులు “పురుషోత్తం శ్రీనివాస్” గారు మన సత్రమునకు అవసరమైన సీసీ కెమెరాలు విరాళంగా అందజేయడం జరిగింది. అంతేకాకుండా తామే దగ్గరుండి ఫిట్టింగ్ కూడా వారే ఏర్పాటు చేయించడం బాధ్యతగా స్వీకరించి పూర్తి చేయడం జరిగింది. అదేవిధముగా మన సత్రం అధ్యక్షులు “పాలేటి కోటేశ్వర రావు” గారు వారిని స్వామి అమ్మవార్ల ప్రసాద శేషవస్త్రాలతో సత్కరించడం జరిగింది. సీసీ కెమెరాలు డొనేట్ చేసిన పురుషోత్తం శ్రీనివాస్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు స్వామీ అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. 🙏💐💐

*హిందూ మాల సత్రం గదులు మరియు నిరంతర దాతలకు*🙏*ముఖ్య మనవి!*🙏నేడు *మన హిందూ మాల సత్రం గదులు మరియు నిరంతర (ప్రతి నెల ఇచ్చుదా...
29/03/2024

*హిందూ మాల సత్రం గదులు మరియు నిరంతర దాతలకు*
🙏*ముఖ్య మనవి!*🙏
నేడు
*మన హిందూ మాల సత్రం గదులు మరియు నిరంతర (ప్రతి నెల ఇచ్చుదాతలు) దాతలైన మీరు *సత్రం అబివృద్దికి* మీరు ముందుకు వచ్చినందుకు మీకు అందరకీ హృదయ పూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము . 🙏🙏🙏 మీకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాయి ఈ నెల 29-03-2024 తేదీన శుక్రవారం నాడు ఉదయం 10-00గంటలకు మీ తో ప్రత్యేక సమావేశాన్ని సత్రం నందు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడం జరిగింది. కావున మీరు తప్పక అందరూ హాజరై సమావేశంలో సత్రం అబివృద్దికి కావలసిన మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు అదేవిధంగా ఇంతవరకు సత్రం నందు కానీ,మాద్వార కానీ , వ్యక్తి గతంగా గానీ జరిగిన పొరపాట్లు ,లేదా తప్పిదాలు జరిగి ఉంటే వాటిని మీ పెద్ద మనసుతో క్షమించి వాటిని సరిదిద్దు కొనెలా తగిన సూచనలు, సలహలు ఇవ్వాలని ,సత్రం అబివృద్దికి మంచి సూచనలు సలహాలు ఇస్తారని ఆశిస్తూ , మీరు తప్పక సమావేశానికి హాజరై సూచనలు సలహాలు ఇవ్వాలని మా ప్రత్యేక మనవి 🙏

మీ ,మా, మన,
సత్రం కమిటీ,
హిందూ మాల సత్రం
శ్రీశైలం 🙏🙏🙏🙏🙏
*దాతలకు ముఖ్య గమనిక*
ఈ సమావేశానికి వచ్చు వారందరికీ మధ్యాహ్నం మరియు రాత్రి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది .

*హిందూ మాల సత్రం గదులు మరియు నిరంతర దాతలకు 🙏*ముఖ్య మనవి!*🙏*మన హిందూ మాల సత్రం గదులు మరియు నిరంతర (ప్రతి నెల ఇచ్చుదాతలు) ...
26/03/2024

*హిందూ మాల సత్రం గదులు మరియు నిరంతర దాతలకు
🙏*ముఖ్య మనవి!*🙏

*మన హిందూ మాల సత్రం గదులు మరియు నిరంతర (ప్రతి నెల ఇచ్చుదాతలు) దాతలైన మీరు *సత్రం అబివృద్దికి* మీరు ముందుకు వచ్చినందుకు మీకు అందరకీ హృదయ పూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము . 🙏🙏🙏 మీకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాయి ఈ నెల 29-03-2024 తేదీన శుక్రవారం నాడు ఉదయం 10-00గంటలకు మీ తో ప్రత్యేక సమావేశాన్ని సత్రం నందు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడం జరిగింది. కావున మీరు తప్పక అందరూ హాజరై సమావేశంలో సత్రం అబివృద్దికి కావలసిన మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు అదేవిధంగా ఇంతవరకు సత్రం నందు కానీ,మాద్వార కానీ , వ్యక్తి గతంగా గానీ జరిగిన పొరపాట్లు ,లేదా తప్పిదాలు జరిగి ఉంటే వాటిని మీ పెద్ద మనసుతో క్షమించి వాటిని సరిదిద్దు కొనెలా తగిన సూచనలు, సలహలు ఇవ్వాలని ,సత్రం అబివృద్దికి మంచి సూచనలు సలహాలు ఇస్తారని ఆశిస్తూ ,

మీరు తప్పక సమావేశానికి హాజరై సూచనలు సలహాలు ఇవ్వాలని మా ప్రత్యేక మనవి 🙏🙏🙏

మీ ,మా, మన,
సత్రం కమిటీ,
హిందూ మాల సత్రం
శ్రీశైలం 🙏🙏🙏🙏🙏
[3/25, 9:24 PM] Hi: *దాతలకు ముఖ్య గమనిక*
++++++++++++++++
ఈనెల 29న సత్రం నందు జరిగే సమావేశానికి వచ్చు వారందరికీ మధ్యాహ్నం మరియు రాత్రి భోజన సదుపాయం కల్పించడం జరుగుతుంది🙏🙏🙏🙏🙏

హిందూ మాల సూత్రానికి కర్నూలు నగరం నుండి శ్రీశైలం కు ఎస్ నాగప్ప వీధి నుండి బియ్యం ప్యాకెట్లు కిరాణము కూరగాయలు హిందూ మాల స...
04/03/2024

హిందూ మాల సూత్రానికి కర్నూలు నగరం నుండి శ్రీశైలం కు ఎస్ నాగప్ప వీధి నుండి బియ్యం ప్యాకెట్లు కిరాణము కూరగాయలు హిందూ మాల సోదరులు మాల సత్రానికి పంపీయడం జరిగినది

2024 Calendar: Srisailam Hindu Mala Anna Trust Srisailam
19/01/2024

2024 Calendar: Srisailam Hindu Mala Anna Trust Srisailam

Address

Near Toll Gate, Opp Tribal Museum Srisailam
Srisailam
518101 SRISAILAM

Alerts

Be the first to know and let us send you an email when Srisailam Hindu Mala Anna Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Srisailam Hindu Mala Anna Trust:

Share