జనం భరోసా జగన్

జనం భరోసా జగన్ జనం కోసం జగన్
జగన్ కోసం జనం

బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమాని కోరికను నెరవేర్చిన వైయస్ జగన్ గారు కర్నూలులో గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధ...
04/09/2026

బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమాని కోరికను నెరవేర్చిన వైయస్ జగన్ గారు

కర్నూలులో గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విశ్వనాథ్‌ వైయస్ జగన్ గారికి వీరాభిమాని. జీవితంలో ఒక్కసారైనా వైయస్ జగన్ గారిని కలవాలని.. ఫొటో దిగాలని ఆశపడిన విశ్వనాథ్

విషయం తెలుసుకుని.. ఈరోజు కర్నూలుకి వచ్చిన వైయస్ జగన్ గారి వద్దకు విశ్వనాథ్‌ను తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు

విశ్వనాథ్ కోరిక తెలుసుకుని ఆప్యాయంగా పలకరించి.. ఫొటో దిగిన వైయస్ జగన్ గారు. అధైైర్యపడొద్దని అండగా ఉంటానని భరోసా. దాంతో ఆనందంతో ఉప్పొంగిపోయిన విశ్వనాథ్

03/09/2026

వైయస్ జగన్ గారి రాకతో దద్దరిల్లిన కర్నూల్

ఈరోజు సెయింట్‌ జోసెఫ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌­లో జరిగిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన వైయస్ జగన్ గారు

వైయస్ జగన్ గారు వస్తున్నారని తెలిసి.. భారీగా గ్రౌండ్స్ వద్దకు చేరుకున్న పార్టీ శ్రేణులు, అభిమానులు

03/09/2026



Kurnool, September 3: YSR Congress Party President and former Chief Minister Y.S. Jagan Mohan Reddy visited Kurnool and attended the wedding reception of Janak, son of former MLA S.V. Mohan Reddy, at St. Joseph’s College Grounds.

YS Jagan personally greeted the newlywed couple, Shriya and Janak, blessed them and conveyed his heartfelt wishes for a happy and prosperous married life.

Bride Shriya is the daughter of former Rajahmundry RUDA Chairperson Sharmila and Medapati Anil Reddy. YS Jagan interacted with the family members on the occasion and wished the couple a life filled with happiness, mutual understanding and togetherness. YSRCP leaders, elected representatives, former public representatives and party cadre were present at the reception and greeted YS Jagan during his visit.

The former Chief Minister spent time with the families of the bride and groom before leaving the venue after extending his blessings to the newlyweds.

 వైయస్‌ జగన్‌ కర్నూలు పర్యటనమాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి. మోహన్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన శ్రీ వైయస్‌ జగన్‌నూత...
03/09/2026



వైయస్‌ జగన్‌ కర్నూలు పర్యటన
మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి. మోహన్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన శ్రీ వైయస్‌ జగన్‌
నూతన వధూవరులు శ్రియ–జనక్‌లను ఆశీర్వదించిన మాజీ ముఖ్యమంత్రి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ కర్నూలులో పర్యటించారు.

కర్నూలులోని సెయింట్‌ జోసెఫ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి. మోహన్‌రెడ్డి కుమారుడు జనక్‌ వివాహ రిసెప్షన్‌కు శ్రీ వైయస్‌ జగన్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులు శ్రియ–జనక్‌లను శ్రీ వైయస్‌ జగన్‌ ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

వధువు శ్రియ, రాజమండ్రి రుడా మాజీ ఛైర్మన్‌ షర్మిల, మేడపాటి అనిల్‌రెడ్డి దంపతుల కుమార్తె. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని గడపాలని శ్రీ వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

03/09/2026

Nara Chandrababu Naidu గారూ… ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం నుంచి, ఆ ఇప్పటికే ఉన్న పంపులతో గోదావరి నీటిని ఎత్తి, ఇప్పటికే ఉన్న పోలవరం ఎడమ కాలువలో వదిలి, దాన్ని చూపించి “పోలవరం నీళ్లు తెచ్చేశాం” అంటూ డప్పు కొట్టుకోవడం ఏంటి? పోలవరం రిజర్వాయర్‌ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీళ్లు ఇవి కావనీ మీకూ తెలుసు, అందరికీ తెలుసు. కానీ ప్రచారం మాత్రం వేరే లెవల్‌. నీళ్లు పురుషోత్తపట్నానివి… కాలువ వైయస్సార్‌ హయాంలో నిర్మించినది… క్రెడిట్‌ కోసం ఆరాటం మాత్రం మీదా? ఇదేం మ్యాజిక్‌?

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మీరు వరుసగా చేస్తున్న పబ్లిసిటీ ఈవెంట్లన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే కదా? మొన్న వెలిగొండ… ఇవాళ పోలవరం ఎడమ కాలువ… ఇంకోరోజు ఇంకోటి. మీరు మొదలుపెట్టని, మీరు పూర్తిచేయని ప్రాజెక్టులకు మీ పేరు చెప్పుకోవడం, మీ అనుకూల మీడియాతో వాటి సృష్టికర్తలు మీరు అన్నట్టుగా భజన చేయించుకోవడం మీకు అలవాటే. ఒకవేళ అరకొర పనులు చేసినా, అవి కూడా అంచనాలు పెంచేసి దోచేయడానికే. ఏ సాగునీటి ప్రాజెక్టును తీసుకున్నా మీ మోడస్‌ ఆపరెండీ, మీ ధోరణి, మీ నైజం ఇదే.

పురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు, ఈ ప్రాజెక్ట్‌, ఈ పంపులు కొత్తవికాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా? మరెందుకు ఈ డ్రామా? అసలు పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనుల్లో 79% పనులు వైయస్సార్‌గారి హయాంలోనే పూర్తైతే, ఇప్పుడు ఆ పనులన్నింటి మీద నిలబడి “అంతా నేనే చేశా” అని చెప్పుకోవడం చంద్రబాబుగారూ మీకే చెల్లింది!

పోలవరం ప్రాజెక్టు విషయంలో 2014–19 మధ్య మీరు చేసిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలు, చేసిన తప్పిదాలు, అవినీతి, దోపిడీ… ఇవన్నీ రాష్ట్రానికి శాపంలా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మందుచూపు, సరైన ప్రణాళిక, ప్రాధాన్యతలు పాటించకుండా, పద్ధతీపాడూ లేకుండా మీరు తప్పులు చేస్తే, ఆ చేసిన తప్పులను సరిదిద్దడానికి మా ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. స్పిల్‌వే, కాఫర్‌ డ్యాం పనులను అరకొరగా చేసి ప్రాజెక్టును చెల్లాచెదురు చేశారు. చివరకు స్పిల్‌వేకు పనులు పూర్తికాకుండానే, నదీ ప్రవాహాన్ని డైవర్ట్‌ చేయకుండానే, మెయిన్‌డ్యాం పునాది పనుల్లో భాగమైన డయాఫ్రంవాల్‌ చేపట్టారు. మీరు చేసిన తప్పుల వల్ల, మీ నిర్వాకాల వల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడం ఒక్కటే కాకుండా, వరదల వల్ల వచ్చిన నీరు, అప్పటికి పాక్షికంగా చేసిన స్పిల్‌వే ద్వారా డైవర్ట్‌ కాక, ఎగున అరకొరగా చేసిన కాఫర్‌ డ్యాంవల్ల, ఆ గ్యాప్‌ల ద్వారా నీరు చొచ్చుకుని వచ్చి, మెయిన్ డ్యాం కింద పునాదులు, అంటే డయాఫ్రంవాల్‌ కొట్టుకుపోయి నష్టంకూడా జరిగింది.

వీటన్నింటినీ సరిదిద్దుతూ ముందుగా అప్రోచ్‌ ఛానల్‌, స్పిల్‌ ఛానల్‌, స్పిల్‌వే పనులు, కాఫర్‌ డ్యాంలను పూర్తిచేసి, ఆ తర్వాత మెయిన్‌ డ్యాం ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన పనులను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్లాం, ప్రణాళికా బద్ధంగా. పోనీ ఇప్పుడైనా సవ్యంగా చేస్తున్నారంటే అదీ లేదు. ప్రాజెక్టును మళ్లీ సుడిగుండంలోకి నెడుతున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా పోలవరం ఎత్తు సంగతి తేల్చండి చంద్రబాబుగారూ. పోలవరం FRL 45.72 మీటర్లు అయితే, నీటినిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. తాము 41.15 మీటర్ల వరకే నిధులిస్తామని కేంద్రం చెబుతోంది. మరి పూర్తి స్థాయి ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది? పూర్తి సామర్థ్యంతో నీటిని ఎలా నిల్వ చేస్తారు? నిర్వాసితులకు ప్యాకేజీ ఎప్పుడు చెల్లిస్తారు? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటి చంద్రబాబుగారూ?

మరోవైపు ఉత్తరాంధ్రకు గొప్ప మేలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. పురుషోత్తపట్నం పంపుల నుంచి వచ్చే నీళ్లతోనే ఉత్తరాంధ్రకు మేలు జరిగిపోతుందా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంగతేంటి? ఈ స్కీంకు వైయస్సార్‌ గారు 2009లోనే రూ.7,214.10 కోట్ల పరిపాలనా అనుమతి ఇస్తే, మా ప్రభుత్వంలో మారిన ధరలు, భూసేకరణ, నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని 2022లో రూ.17,050.20 కోట్లకు అంచనాలను సవరించి పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చాం. కీలకమైన Package-1, Package-2 పనులను టెండర్లు, అగ్రిమెంట్ల దశ వరకు తీసుకెళ్లాం. భూసేకరణకు ప్రత్యేక యూనిట్లు కూడా ఏర్పాటు చేశాం. మరి మీ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఉత్తరాంధ్ర మీద ప్రేమ ప్రసంగాల్లోనేనా?

చంద్రబాబుగారూ… పోలవరం విషయంలో డ్రామాలు మానండి. పనులపై దృష్టిపెట్టండి. 41.15 మీటర్లు కాకుండా, 45.72 మీటర్ల నిర్దేశిత ఎత్తులో పోలవరాన్ని పూర్తిచేయండి. దీనివల్ల పూర్తిస్థాయి స్టోరేజీ సాధ్యపడుతుంది, తద్వారా పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడంతోపాటు, పూర్తి గ్రావిటీతో కుడి, ఎడమ కాలువల ద్వారా నీళ్లు అందించగలుగుతాం. అప్పుడు పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతలతో సంబంధం లేకుండానే గ్రావిటీతోనే పోలవరం ఎడమకాల్వతోపాటు, కుడికాల్వకు నీళ్లు పుష్కలంగా పంపగలం. మరి ఇదిచేయకుండా ఇన్ని డ్రామాలు ఎందుకు?

02/09/2026

కుటుంబ సభ్యులతో కలిసి వైయస్‌ఆర్ ఘాట్ వద్ద వైయస్ జగన్ గారు ఘన నివాళులు💐

02/09/2026

Every Truth Reveals Itself When The Right Time Comes.. 💯❤️✨

02/09/2026

...నాన్న గారి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించడం జరిగింది.

*మన ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు  దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సంద...
02/09/2026

*మన ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా
నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో *దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు* అర్పించిన వైసిపి నాయకులు,కార్యకర్తలు
అనంతరం
👉 నిడదవోలు పట్టణ వై.యస్.ఆర్ కాలనీలో *దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు* అర్పించారు .

👉 *నిడదవోలు పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషంట్లకు పండ్లు, భోజనం ప్యాకెట్లు అందచేశారు

*ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కామిశెట్టి సత్తిబాబు గారు మండల అధ్యక్షులు అయినీడి పల్లారావు గారు,ఎంపీపీ పట్టణ, మరియు వివిధ గ్రామాల, వైఎస్ఆర్సిపి , కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు

Address

West Godavari
Tanuku
534211

Website

Alerts

Be the first to know and let us send you an email when జనం భరోసా జగన్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share