ITDP Tanuku Niyojakavargam

ITDP Tanuku Niyojakavargam రాష్ట్ర అభివృద్ధి కోసం....

02/04/2026



02/04/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా "అమరావతి" ని ప్రకటించాలని తొలినుంచీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకు సానుకూలమైన పరిస్థితి రావడం చాలా సంతోషం.



కూటమి ఎంపీ లతో ప్రధానమంత్రి గ్రూప్ ఫోటోప్రధానమంత్రి నరేంద్ర మోదీ కు ధన్యవాదాలు తెలిపిన కూటమి ఎంపీ లు
02/04/2026

కూటమి ఎంపీ లతో ప్రధానమంత్రి గ్రూప్ ఫోటో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కు ధన్యవాదాలు
తెలిపిన కూటమి ఎంపీ లు



మేలుకో తెలుగోడా..2014-19 కుట్రలు మళ్ళీ షురూ..గోదావరి జిల్లాల్లో దళిత-కాపు చిచ్చు...గుంటూరు-కృష్ణా జిల్లాల్లో కమ్మ - కాపు...
17/10/2025

మేలుకో తెలుగోడా..

2014-19 కుట్రలు మళ్ళీ షురూ..

గోదావరి జిల్లాల్లో దళిత-కాపు చిచ్చు...
గుంటూరు-కృష్ణా జిల్లాల్లో కమ్మ - కాపు చిచ్చు

మిగతా చోట్ల వీలైనంత కమ్మ కుల ద్వేషం నూరిపోయడం..

వందల ఫేక్ అకౌంట్లు.. తాడేపల్లి ఆఫీస్ నుండి ప్రతిరోజు డిజిటల్ కంటెంట్..

నెగటివ్ కంటెంట్ నే మరోసారి నమ్ముకున్న వైసీపీ..

*ప్రధాని పర్యటనను సైతం ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్న వైకాపా* *వైకాపా ఫేక్ ప్రచారం పై కేంద్రం ఇంటెలిజెన్స్ ఆరా* *ప్రధానిక...
16/10/2025

*ప్రధాని పర్యటనను సైతం ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్న వైకాపా*

*వైకాపా ఫేక్ ప్రచారం పై కేంద్రం ఇంటెలిజెన్స్ ఆరా*

*ప్రధానికి ఆహ్వానం పలికిన సందర్భాన్ని సైతం ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్న వైకాపా*

*ఎటువంటి వినతి పత్రం ఇవ్వకుండానే మెడికల్ కాలేజీలు, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చాలని వినతి పత్రం ఇచ్చినట్టు, ప్రధానిని కోరినట్టు అసత్య ప్రచారం.*

*అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏనాడూ ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష పార్టీ ను ఆహ్వానించని వైకాపా*

*కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం వైకాపా ప్రజా ప్రతినిధులకు సైతం ఆహ్వానం*

*కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీలకి అతీతంగా ప్రోటోకాల్ పాటించి ప్రజా ప్రతినిధులకు గౌరవం.*

*కూటమి ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని కూడా నిలబెట్టుకొని వైకాపా ప్రజా ప్రతినిధులు.*

*ప్రధాని కార్యక్రమాన్ని సైతం తమ ఫేక్ ప్రచారానికి వాడుకున్న వైకాపా*

06/03/2025

*తణుకు పరిధి హైవేపై ఫ్లై ఓవర్లు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే*

*తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై ఉండ్రాజువరం జంక్షన్, తేతలి వై జంక్షన్ వద్ద చేపట్టిన ఫ్లై ఓవర్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గత టీడీపీ హయాంలో ప్రారంభించిన ఈ పనులు ఇప్పటికీ 60 శాతం కూడా పూర్తి కాలేదని ఆయన పేర్కొన్నారు. తేతలి వై జంక్షన్ ఫ్లైఓవర్ కోర్టు స్టే కారణంగా నిలిపివేశారని చెప్పారు*.

06/03/2025

*దాడుల్లో సీజ్‌ చేసిన రేషన్‌ బియ్యం ఎక్కడకు వెళుతున్నాయి*

*ఆక్షన్ లో కొనుగోలు చేస్తున్న ట్రేడర్లు రీసైక్లింగ్‌ చేస్తున్నారు*

*రేషన్‌ బియ్యం ప్రజలు వండుకుని తినేలా మార్పు తీసుకురావాలి*

*శాసనసభలో మాట్లాడిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు*
Arimilli RadhaKrishna

మాజీ ఎమ్మెల్యే పాడెనుమోసిన Arimilli RadhaKrishna                                                                        ...
05/03/2025

మాజీ ఎమ్మెల్యే పాడెనుమోసిన Arimilli RadhaKrishna
#తెలుగుదేశం పార్టీ #ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం #పార్టీ తరపున పోటిచేసి తణుకు ఎమ్మెల్యేగా గెలిచిన #చిట్టూరి #వెంకటేశ్వరరావు గారు. బుధవారం మరణించినారు. అస్వస్థతతో బాధపడుతూ #మృతి చెందిన వెంకటేశ్వరరావు గారు భౌతికకాయాన్ని , #తణుకు #నియోజకవర్గం #శాసనసభ్యులు #ఆరిమిల్లి రాధాకృష్ణ గారు సందర్శించి #నివాళులు అర్పించారు,
అనంతరం #అంత్యక్రియల్లో పాల్గొని ఆయన పాడెను మోసారు. 🥲

03/03/2025

అకాల వరదలకు రైతులు చాలా నష్టపోయారు...

రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేయండి...శాసనసభ లో #తణుకునియోజకవర్గశాసనసభ్యులు Arimilli RadhaKrishna గారు విన్నపం.

*క్షేత్రస్థాయిలో సమన్వయంతో కృషి**పట్టభద్రుల ఓట్లు నమోదులోనూ ముందంజ**పోలింగ్ శాతంలోను అదే దూకుడు**జిల్లాలో పోలింగ్ శాతంలో...
28/02/2025

*క్షేత్రస్థాయిలో సమన్వయంతో కృషి*

*పట్టభద్రుల ఓట్లు నమోదులోనూ ముందంజ*

*పోలింగ్ శాతంలోను అదే దూకుడు*

*జిల్లాలో పోలింగ్ శాతంలో "తణుకు" ప్రథమ స్థానం*

*జిల్లాలో అత్యధికంగా 73.59 శాతం పోలింగ్ నమోదు*

*సత్ఫలితాలు ఇచ్చిన ఎమ్మెల్యే రాధాకృష్ణ సమీక్షలు, సూచనలు*

************

ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో తణుకు నియోజకవర్గ కూటమి క్యాడర్ కీలక పాత్ర పోషించింది. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సమన్వయంతో మొదటి నుంచి పార్టీ కేడర్ ఉత్సాహం చూపించింది. ముఖ్యంగా పాఠశాలలు, ప్రధాన సంఘాలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశాలు అత్యధికంగా పోలింగ్ నమోదు కావడానికి దోహదపడ్డాయి.

ఎప్పటికప్పుడు కార్యకర్తలు, నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఓట్లు నమోదులోను, ఓటర్లను చైతన్య పరచడంలోనూ ఎమ్మెల్యే రాధాకృష్ణ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా ఇంటింటికి ఎన్నికల ప్రచారంతోపాటు ప్రతి 50 మంది ఓటర్లకు ఇన్చార్జిని నియమించి ఒక్కో ఓటర్ ను కనీసం మూడుసార్లు కలిసేలా ప్రణాళికలు చేయడం సత్ఫలితాలు ఇచ్చింది.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు పడిన శ్రమ వృధా కాకుండా జిల్లాలోనే తణుకు నియోజవర్గంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం. ప్రధానంగా పట్టభద్రుల ఓటర్లను చైతన్యపరిచి ఓటు నమోదులో కీలకంగా వ్యవహరించిన కేడర్ అదే ఉత్సాహంతో ఓటర్లను పోలింగ్ స్టేషన్ వరకు తీసుకువచ్చి ఎన్నికల్లో పాల్గొనేలా చేయడంతో విజయం సాధించారు.

పశ్చిమగోదావరి జిల్లాలోనే అత్యధికంగా తణుకు నియోజవర్గంలో 73.59 శాతం పోలింగ్ నమోదయింది. తణుకు నియోజకవర్గంలో తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలో 12,793 మంది ఓటర్లు ఉండగా వీరిలో 9,414 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలోని అత్యధికంగా 73.59% ఓట్లు పోలయ్యాయి. ఓట్లు నమోదు లోను పార్టీ కేడర్ క్షేత్రస్థాయిలో సమన్వయంతో అత్యధికంగా ఓటర్లు తమ ఓటును నమోదు చేయించుకోవడం విశేషం.

Address

Tanuku
Tanuku

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Tanuku Niyojakavargam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share