tirupati mayor municipal corporation

tirupati mayor municipal corporation Dr.R Sireesha yadav garu
Mayor of Tirupati Municipal Corporation

26/02/2025
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన వినాయక చవితి పూజల్లో టిటిడి ఛైర్మన్, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు, మునిసిపల్ ...
19/09/2023

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన వినాయక చవితి పూజల్లో టిటిడి ఛైర్మన్, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు, మునిసిపల్ శాఖా మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారు, మేయర్ డాక్టర్ శిరీష గారు, కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ గారు, డిప్యూటీ మేయర్లు శ్రీ అభినయ రెడ్డి గారు, శ్రీ ముద్ర నారాయణ గారు, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు.

*శ్రీ శక్తి స్వరూపిణి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్...
19/09/2023

*శ్రీ శక్తి స్వరూపిణి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి*

తిరుపతి, సెప్టెంబర్ 18 : తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి పట్టణంలోని శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి అమ్మవారిని ప్రాచీన సంప్రదాయాన్ని పాటిస్తూ గౌ. ముఖ్య‌మంత్రి వ‌ర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమలకు బయలుదేరే ముందు ద‌ర్శించుకున్నారు.

శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆలయ మర్యాదలతో టిటిడి ఛైర్మన్ కరుణాకర రెడ్డి, ఎండోమెంట్ కమీషనర్ సత్యనారాయణ, ఆలయ చైర్మన్ గోపి యాదవ్, ఈ ఓ మునికృష్ణయ్య, పూజారులు తదితరులు స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర భూగర్భ గనులు, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి కే నారాయణ స్వామి, రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యువజనుల శాఖ మంత్రి ఆర్కే రోజా, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆది మూలపు సురేష్, టీటీడి బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి, ఎంపీ గురుమూర్తి, ఎంఎల్సీలు కళ్యాణ చక్రవర్తి, భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం, ఎం ఎల్ ఏ లు సత్యవేడు, శ్రీకాళహస్తి, రైల్వే కోడూరు, కె.ఆదిమూలం , బియ్యపు మధుసూధన్ రెడ్డి, కోరముట్ల శ్రీనివాసులు, తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణారెడ్డి, తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ డి కే బాలాజీ, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, డిప్యూటీ మేయర్ లు భూమన అభినయ రెడ్డి, సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ, ఆలయ సిబ్బంది తదితరులు వున్నారు.

శ్రీనివాస సేతు నిర్మాణ పనులు పరిశీలించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి...
15/09/2023

శ్రీనివాస సేతు నిర్మాణ పనులు పరిశీలించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష గారు,జె.ఈ.ఓ. సదా భార్గవి గారు, తిరుపతి కమిషనర్ హరిత గారు.టి.టి.డి. అధికారులు,నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

స్థానిక అక్కారంపల్లి రోడ్డు వద్ద ఉన్న పెట్రోల్ బంకు నుండి కొత్తపల్లిలోని నలంద స్కూల్ వరకు నూతనంగా నిర్మించిన 40 అడుగుల మ...
15/09/2023

స్థానిక అక్కారంపల్లి రోడ్డు వద్ద ఉన్న పెట్రోల్ బంకు నుండి కొత్తపల్లిలోని నలంద స్కూల్ వరకు నూతనంగా నిర్మించిన 40 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డును స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి గారు, మేయర్ డాక్టర్ శిరీష గారు, కమిషనర్ హరిత గారు,ఉప మేయర్ భూమన అభినయ్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉప మేయర్ ముద్ర నారాయణ గారు, కార్పొరేటర్ ఆదాం రాధకృష్ణ రెడ్డి గారు, ఇతర కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

15.09.2023.. ప్రభుత్వ రంగం లో 5 మెడికల్ కళాశాలలు ప్రారంభోత్సవం సందర్భంగా తిరుపతి ఎస్వీయూ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో లో ఏ...
15/09/2023

15.09.2023.. ప్రభుత్వ రంగం లో 5 మెడికల్ కళాశాలలు ప్రారంభోత్సవం సందర్భంగా తిరుపతి ఎస్వీయూ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో లో ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీ కె.వెంకట రమణా రెడ్డి .,టిటిడి చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి .,ఎమ్మెల్సీ శ్రీ సిపాయి సుబ్రమణ్యం., మేయర్ డా.శిరీష తదితరులు...

*కె.ఆర్.హాస్పిటల్ అధినేత డాక్టర్ రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నగర మేయర్ డాక్టర్ శిరీష*తిరుపతి వరదరాజుల స...
13/09/2023

*కె.ఆర్.హాస్పిటల్ అధినేత డాక్టర్ రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నగర మేయర్ డాక్టర్ శిరీష*

తిరుపతి వరదరాజుల స్వామి ఆలయం సమీపంలో కే.ఆర్. హాస్పిటల్ నందు బుధవారం డాక్టర్ రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మేయర్ గారు తెలియజేశారు. జన్మదిన సందర్భంగా శాలువా కప్పి, బుకే అందజేసి ఘనంగా కేక్ కటింగ్ నిర్వహించారు.
మేయర్ డాక్టర్ శిరీష, తులసి యాదవ్, అనిల్, రమేష్ తదితరులు డాక్టర్ రమేష్ దంపతులకు చిరు సన్మానం చేశారు.

*ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అందులో భాగంగానే వై.యస్.ఆర్ పెన్షన్లు అందజేత**27వ ...
13/09/2023

*ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అందులో భాగంగానే వై.యస్.ఆర్ పెన్షన్లు అందజేత*

*27వ డివిజన్ స్థానికుల లబ్ధిదారులకు నూతన పింఛన్లు పంపిణీ చేసిన మేయర్ డాక్టర్ శిరీష*

తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్ నందు బుధవారం ఉదయం 27వ డివిజన్ సంబంధించి పింఛన్లు నగర మేయర్ డాక్టర్ డాక్టర్ అందజేశారు.

27వ డివిజన్ పరిధిలోని కొత్త పింఛన్లు మంజూరు అయిన వాటిని మేయర్ శిరీష లబ్ధిదారులకి పింఛన్లు పంపిణీ చేశారు.

మేయర్ మాట్లాడుతూ వై.యస్.ఆర్. పింఛన్లు ఉదయం 5 గంటల నుండి ఇంటి దగ్గర వెళ్లి తలుపు తట్టి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

వైయస్సార్ పింఛన్ కానుక జనవరి ఒకటి నుంచి పెరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లే అందజేస్తున్నది. పింఛన్, రైస్ కార్డులు,ఆరోగ్య శ్రీ పథకాలు ఎంపికైన వారికి ప్రతి నెల మొదటి రోజే లబ్ధిదారుల గడప ముందుకొచ్చి ఠంచనుగా పింఛను అందిస్తున్నామని తెలియజేశారు. గతంలోలా చాంతాడంత క్యూలలో వృద్ధులు, దివ్యాంగులు నిలబడే అవస్థలు లేవని, ఆత్మ అభిమానం చంపుకోవాల్సిన పనిలేదని తెలిపారు. ఒకవేళ పెన్షన్లు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వార్డు సచివాలయాన్ని సంప్రదించాలని, వారి దగ్గర ఉండి చెయ్యి పట్టుకుని నడిపించి పెన్షన్ అందే విధంగా సాయం చేస్తారని లబ్ధిదారులకి వివరించారు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాల అందాలని ఆయన సంకల్పం అని తెలియజేశారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో జూన్ 2020న, పాలనలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు సీఎం గారు నాంది పలికారు. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే పింఛన్లు మంజూరు చేసే విధానాన్ని ప్రారంభించారు. పింఛన్లు దరఖాస్తులు స్వీకరణ, మంజూరు అనేది నిరంతర ప్రక్రియ గా కొనసాగుతుందని ఈ సందర్భంగా మేయర్ తెలియజేశారు.
27వ డివిజన్లో వృద్ధాప్యం పెన్షన్లు 126 మందికి, వితంతు పెన్షన్లు 90 మందికి, ఒంటరి మహిళ పెన్షన్లు ఏడు మందికి, వికలాంగుల పెన్షన్లు 21 మందికి, కిడ్నీ పేషంట్లకి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని. ఒక్క 27వ డివిజన్లోనే 245 మందికి పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష వారితో పాటు భరణి యాదవ్, గీతా యాదవ్,చింత రమేష్,డివిజన్ కార్యదర్శి గోపాల్, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

నగరపాలక సంస్థ పరిధిలోని 22 వ వార్డులోని పద్మావతి నగర్, గాయత్రి నగర్, మునిరెడ్డి నగర్ లో నూతనంగా వేసిన సి.సి.రోడ్లు, 50 వ...
11/09/2023

నగరపాలక సంస్థ పరిధిలోని 22 వ వార్డులోని పద్మావతి నగర్, గాయత్రి నగర్, మునిరెడ్డి నగర్ లో నూతనంగా వేసిన సి.సి.రోడ్లు, 50 వ వార్డుల్లో గల శ్రీనగర్ కాలనీలో, శ్రీరామ ఆలయం వద్ద వేసిన సి.సి.రోడ్లు, వాటర్ పైప్ లైన్ ను ప్రారంభిస్తున్న టిటిడి ఛైర్మన్, ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, మేయర్ డాక్టర్ శిరీష గారు, కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీ ముద్ర నారాయణ గారు, కార్పొరేటర్లు, అధికారులు.

రాయలసీమ రంగస్థలి-తిరుపతిశ్రీ కృష్ణదేవరాయ కళాదర్బార్33వ జాతీయస్థాయి సంగీత, సాహిత్య నృత్య కశోత్సవాలు తిరుపతి మహతి ఆడిటోరియ...
09/09/2023

రాయలసీమ రంగస్థలి-తిరుపతి

శ్రీ కృష్ణదేవరాయ కళాదర్బార్

33వ జాతీయస్థాయి సంగీత, సాహిత్య నృత్య కశోత్సవాలు తిరుపతి మహతి ఆడిటోరియంలో శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష గారు ప్రత్యేక ఆహ్వానం మేరకు పాల్గొన్నారు.
మేయర్ శిరీష మాట్లాడుతూ కళాకారులకి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని తెలిపారు. రాయలసీమ రంగస్థలి వారు ప్రోత్సహిస్తున్న వివిధ కళాకారులును అభినందించే విషయమని కొనియాడారు. సంగీత,సాహిత్య, నృత్య కళాకారులకు శాలువాలుతో సన్మానాలు, సత్కారాలు,షిల్డ్ ను అందజేశారు.
గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిటిడి మాజీ బోర్డు మెంబర్ పొలకల అశోక్ కుమార్, ప్రతాప్ స్వామి, ధనంజయలు నాయుడు, కొత్తపల్లి మునిరత్నం, అక్కిపల్లి ముని కృష్ణ యాదవ్, కళాబృందాలు, తదితరులు పాల్గొన్నారు.

Address

Tirupati
517501

Website

Alerts

Be the first to know and let us send you an email when tirupati mayor municipal corporation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share