08/09/2026
క్లాస్‌రూమ్‌లోనే కాలర్ పట్టుకుని దౌర్జన్యం
బిగ్ టీవీ, సాక్షి రిపోర్టర్ల ఆగడాలు
మెగా డీఎస్సీ టీచర్ చక్రపాణిరెడ్డిపై కుట్ర
---------------------------------------------------
జర్నలిజం పేరు చెప్పుకుని కొందరు చేస్తున్న దౌర్జన్యాలకు ఇది నిదర్శనం! సరిహద్దుల్లో దేశాన్ని కాపాడిన ఒక మాజీ జవాను.. రిటైరయ్యాక కష్టపడి చదువుకుని మెగా డీఎస్సీలో సొంత టాలెంట్‌తో టీచర్ జాబ్ కొడితే, ఆయన్ను క్లాస్‌రూమ్‌లోనే కాలర్ పట్టుకుని బెదిరించారు. కుప్పం నడిమూరు స్కూల్లో డీఎస్సీ టీచర్ చక్రపాణిరెడ్డిపై జరిగిన ఈ దాడి ఇప్పుడు రాష్ట్రమంతా పెద్ద దుమారం రేపుతోంది. అసలు ఆయనపై ఎందుకు దాడి చేశారో ఇప్పుడు వివరంగా చూద్దాం.
బాధిత టీచర్ వి. చక్రపాణిరెడ్డి ఆర్మీలో హవల్దార్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత బీఈడీ చేసి, మెగా డీఎస్సీలో ఎక్స్-సర్వీస్‌మెన్ కోటా కింద మంచి మార్కులు తెచ్చుకుని జాబ్ సాధించారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే.. ఆయన సర్టిఫికెట్లు నూటికి నూరు శాతం ఒరిజినల్. ఆర్మీ రికార్డులను సైనిక సంక్షేమ బోర్డు, విద్యాశాఖ పూర్తిగా చెక్ చేసిన తర్వాతే ఆయనకు స్కూల్లో పోస్టింగ్ ఇచ్చారు. కానీ, డీఎస్సీ పేరు చెడగొట్టాలనే కుట్రతో ఆయన సర్టిఫికెట్లు దొంగవంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు.
కూటమి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ ద్వారా ఏకంగా 16 వేల ఉద్యోగాల దాకా భర్తీ చేయడంతో మినిస్టర్ నారా లోకేష్‌కు జనాల్లో విపరీతమైన మంచి పేరు వచ్చింది. అయితే లోకేష్‌కు వస్తున్న ఆ ఆదరణ చూసి జగన్ వర్గం అస్సలు తట్టుకోలేకపోతోంది. ఇక సాక్షిని ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో, జగన్ వర్గం తెరవెనుక బిగ్ టీవీతో చేతులు కలిపింది. జగన్‌కు మేలు జరిగేలా బిగ్ టీవీని అడ్డం పెట్టుకుని ఇలాంటి కుట్ర రాజకీయాలు నడిపిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ క్రమంలోనే ఘటనకు ముందు రోజు బిగ్ టీవీ రిపోర్టర్ చక్రపాణిరెడ్డికి ఫోన్ చేసి, "నీ గురించి వార్త రాకూడదంటే మాకు డబ్బులు ఇవ్వాలి" అంటూ బెదిరించాడు. తాను న్యాయంగానే ఉద్యోగం తెచ్చుకున్నానని, రూపాయి కూడా ఇచ్చేది లేదని ఆయన తెగేసి చెప్పారు. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతోనే మరుసటి రోజు బిగ్ టీవీ, సాక్షి రిపోర్టర్లు పక్కా ప్లాన్‌తో దాడికి దిగారు.
క్లాస్‌రూమ్‌లో ఆయన పిల్లలకు పాఠాలు చెప్తుండగా, ఎలాంటి పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేశారు. చిన్న పిల్లల ముందే చక్రపాణిరెడ్డి చొక్కా కాలర్ పట్టుకుని.. "సర్టిఫికెట్లు చూపించు.. నీ ఉద్యోగం ఊడగొడతాం" అంటూ గొడవ చేశారు. పిల్లలు భయపడి ఏడ్వగా, ఆ అరుపులు విని ఊరి జనం రావడంతో ఆ విలేకరులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ అన్యాయంపై కుప్పం స్థానికులు, టీచర్ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. దేశాన్ని కాపాడిన మాజీ జవాన్‌కు అండగా నిలిచి, ఆయన్ను దగ్గరుండి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి మరీ నిందితులపై కేసులు పెట్టించారు. బడిలోకి వచ్చి గూండాగిరీ చేసిన బిగ్ టీవీ, సాక్షి విలేకరులను వెంటనే అరెస్ట్ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.