JanaSena Party

  • Home
  • JanaSena Party
Call Directions Website Contact the organization

JanaSena Party The Official page of JanaSena Party, founded by Mr.Pawan Kalyan.

అమలాపురం నియోజకవర్గం, ఉప్పులగుప్తం మండలం, కూనవరం గ్రామానికి చెందిన జనసేన నాయకులు పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన శ...
12/11/2026

అమలాపురం నియోజకవర్గం, ఉప్పులగుప్తం మండలం, కూనవరం గ్రామానికి చెందిన జనసేన నాయకులు పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన శ్రీ ఆకుల రామారావు గారు ప్రమాదవశాత్తు మరణం చెందటం బాధాకరం. జనసేన పార్టీ తరపున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.

చిలకలూరిపేట నియోజకవర్గం, మిట్టపాలెం గ్రామానికి చెందిన జనసైనికుడు జనసేన పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన శ్రీ బండికట...
12/11/2026

చిలకలూరిపేట నియోజకవర్గం, మిట్టపాలెం గ్రామానికి చెందిన జనసైనికుడు జనసేన పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన శ్రీ బండికట్ల రాజ గోపాల్ గారు ప్రమాదవశాత్తు మరణం చెందటం బాధాకరం. జనసేన పార్టీ తరపున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.

12/11/2026

విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ సదస్సులో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు.

12/11/2026

Economic growth & environmental protection must go hand in hand. We must create wealth without destroying the wealth of nature.
-


12/11/2026

Since we came to power, we've attracted huge investments with the potential to create lakhs of jobs

- Pawan Kalyan


మీ కలతోపాటు.. ఆంధ్రప్రదేశ్ కలను నిజం చేయడంలో భాగస్వాములు కండి• భవిష్యత్తు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ గొప్ప వేదిక• గ్రామాల...
12/11/2026

మీ కలతోపాటు.. ఆంధ్రప్రదేశ్ కలను నిజం చేయడంలో భాగస్వాములు కండి

• భవిష్యత్తు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ గొప్ప వేదిక
• గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ పెట్టుబడులు పెట్టాలి
• చిన్నస్థాయి పారిశ్రామికవేత్తలను కలుపుకొని వెళ్లండి
• శాంతిభద్రతల పరిరక్షణ, వేగంగా అనుమతులు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం
• క్షేత్రస్థాయిలో పెట్టుబడుల ప్రతిఫలాలు కనిపించాలి
• విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొని, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని. పెట్టుబడిదారులు ఉన్నతమైన ఆలోచనలతో రాష్ట్రానికి రండి.. మీరు అత్యంత ఉన్నంతగా ఎదుగుతారు. మీరు ఓ స్పష్టమైన విజన్ తో పెట్టుబడులు పెట్టండి... రాష్ట్రం మీకు సొంతిల్లులా పని చేస్తుంది. మీరు భవిష్యత్తు మీద భరోసాతో ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి.. తక్కువ సమయంలో రాష్ట్ర కలను, మీ కలను నిజం చేసుకోండి’ అని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయి భద్రత, భరోసా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం వేదికగా రెండ్రోజుల పాటు జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 58 దేశాల నుంచి 3,800 మంది ప్రతినిధులు రావడంతో పాటు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా భేటీ అయి, రాష్ట్రానికి సీఐఐ సదస్సు వేదికగా రాబోతున్న పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను వివరించారు. అనంతరం సదస్సుకు హాజరైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించి, కేంద్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులతో కలిసి అరకు కాఫీను తాగారు. అనంతరం సదస్సులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ... “ఆంధ్రప్రదేశ్ 1053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు ముఖ ద్వారంగా రాష్ట్రం పనిచేస్తోంది. ఇక్కడ మానవవనరులు, ఇన్నోవేషన్ ఆలోచనలు, ప్రతిభ కలిగిన యువతరానికి కొదవ లేదు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తే, వారికి పూర్తిగా సహకరించేందుకు, వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది.

పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే ముందున్నాం

1995లో సీఐఐ సదస్సులు ప్రారంభం అయిన దగ్గర నుంచి ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి ముందుకు సాగుతున్నాం. 2024లో జరిగిన సీఐఐ సదస్సులో 714 సంస్థలతో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాం. దాని ద్వారా 19.3 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా చేసుకున్నాం. ఇటీవల కాకినాడలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో 15 ఎంఓయూల ద్వారా రూ.4,256 కోట్ల పెట్టుబడులు పెట్టేలా, 14 వేల ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న 31వ సీఐఐ సదస్సులో సైతం 150 ఎంఓయూలు, రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నాం. ఇది రాష్ట్రానికి ప్రగతి బాట. భవిష్యత్తు తరాలకు పూలబాట. దేశంలోనే రాష్ట్రం పెట్టుబడుల సాధనలో ముందు ఉండటానికి స్థిరమైన ప్రభుత్వం, భవిష్యత్తుపై ఆశలు, ఆలోచనలే ప్రధానం. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేం తగిన విధంగా ముందుకు వెళ్తాం.
రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు క్షేత్రస్థాయిలో వెనువెంటనే తమ కార్యకలాపాలు మొదలుపెట్టేలా చొరవ తీసుకోవాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తగిన విధంగా సహకరిస్తుంది. రాష్ట్ర గతిని మారేలా మీ ఆలోచనలు, భవిష్యత్తు పునాదులు ఉండాలి. కేవలం భారీ పెట్టుబడిదారులకే కాకుండా, చిన్నస్థాయి ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు దీనిలో భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారికి మేం అన్ని విధాలుగా తగిన సహకారం అందిస్తాం. అక్కడున్న వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. నేను పారిశ్రామికవేత్తలకు చెప్పేది ఒక్కటే...
మా మానవవనరులను నమ్మి పెట్టుబడి పెట్టండి. ఉత్పత్తి కోసమే కాదు... వినూత్న ఆలోచనలనీ నమ్మి పెట్టుబడి పెట్టండి...
మీరు బాధ్యతను తీసుకోండి.. పర్యావరణాన్ని, ప్రకృతికి నాశనం చేయకుండా ముందుకు సాగుతామని ప్రతినబూనండి” అన్నారు. సదస్సులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు శ్రీ టీజీ భరత్, శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీలు శ్రీ భరత్, సీఐఐ అధ్యక్షులు శ్రీ ముకుందన్, సీఐఐ డిసిగ్నేట్ ప్రెసిడెంట్ శ్రీమతి సుచిత్రా ఎల్లా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

31st CII Partnership Summit, VisakhapatnamLive Link:
12/11/2026

31st CII Partnership Summit, Visakhapatnam

Live Link:

Follow JanaSena Chief & Andhra Pradesh Deputy Chief Minister Pawan ...

సిఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విమానాశ్రయంలో ఘన స్వాగత...
12/11/2026

సిఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు

ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఏలూరు మేయర్ గా ఎన్నికైన శ్రీ రెడ్డి అప్పలనాయుడు మర్యాదప...
11/11/2026

ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఏలూరు మేయర్ గా ఎన్నికైన శ్రీ రెడ్డి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ అప్పలనాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

10/11/2026

ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.

Address


Alerts

Be the first to know and let us send you an email when JanaSena Party posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to JanaSena Party:

Shortcuts

  • Want your organization to be the top-listed government service?

Share