Nedurumalli Ramkumar Reddy

Nedurumalli Ramkumar Reddy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nedurumalli Ramkumar Reddy, Political organisation, nedurumalli bangla, Venkatagiri.

తిరుపతి 31-10-2025 *వెంకటగిరి రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కు వినతిపత్రం అంద...
31/10/2025

తిరుపతి
31-10-2025

*వెంకటగిరి రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కు వినతిపత్రం అందించిన నేదురుమల్లి*

పాలనా సౌలభ్యంతోపాటు భౌగోళిక, సాంస్కృతిక అనుబంధం ప్రాతిపదికగా తీసుకొని వెంకటగిరి అర్బన్, రూరల్ , డక్కిలి, బాలాయపల్లి మండలాలతో కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ...

* విద్య, వైద్య మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు వెనుకబడి ఉన్న వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను జిల్లా కలెక్టర్ కు వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.

* వెంకటగిరి ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన రెవిన్యూ డివిజన్ ఏర్పాటు అంశం ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్ఆర్సిపి నిర్వర్తించినట్లు తెలియజేశారు.

21/10/2025

వెంకటగిరి ప్రజలకు అత్యవసర విజ్ఞప్తి – మీ నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి

​బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో, రాబోయే రెండు రోజులలో మన వెంకటగిరి నియోజకవర్గంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

​ఈ నేపథ్యంలో, ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వారి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.

అధికారులకు విజ్ఞప్తి:

అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, ప్రజల భద్రత కోసం ముందస్తు రక్షణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం తక్షణమే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి అవసరమైన సహాయాన్ని అందించి ఆదుకోవాలని తెలియజేశారు.

ప్రజలు తప్పనిసరిగా పాటించవలసిన అత్యవసర జాగ్రత్తలు:

• ​లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలకు తరలి వెళ్లాలి.

• ​వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహించేటప్పుడు వాటిని దాటే సాహసం అస్సలు చేయవద్దు.

• ​పాత మరియు శిథిలావస్థలో ఉన్న భవనాలు, గోడలకు దూరంగా సురక్షిత ప్రాంతంలో ఉండండి.

• ​ఎలక్ట్రిక్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దు. ఇంట్లోకి నీరు వస్తే వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి.

• ​తగినంత త్రాగునీరు, మందులు, టార్చ్ లైట్లు, కొవ్వొత్తులు, పొడి ఆహారం వంటి అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలి.

• ​వర్షంలో లేదా వరద నీటి దగ్గర పిల్లలు ఆడకుండా చూసుకోవాలి.

​నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి
వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, వెంకటగిరి.

విజయానికి సంకేతంగా నిలిచే ఈ దసరా మీ జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ అందరికి ఆయుధ పూజా శుభాకాంక్షలు...
02/10/2025

విజయానికి సంకేతంగా నిలిచే ఈ దసరా మీ జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ అందరికి ఆయుధ పూజా శుభాకాంక్షలు...

వెంకటగిరి పోలేరమ్మ  జాతర సందర్భంగా ప్రజలందరికీ హార్థిక శుభాకాంక్షలు. ఆమ్మవారి ఆశీస్సులతో అందరికీ సుభిక్షం, ఆరోగ్యం కలగాల...
11/09/2025

వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా ప్రజలందరికీ హార్థిక శుభాకాంక్షలు. ఆమ్మవారి ఆశీస్సులతో అందరికీ సుభిక్షం, ఆరోగ్యం కలగాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను.

శ్రీ వినాయక చవితి పర్వదినాన ఆ శ్రీ వినాయకుడి ఆశీస్సులతో మీరు చేపట్టిన ప్రతి పనిలో విఘ్నాలన్ని తొలిగిపోయి ఎల్లప్పుడూ అందర...
27/08/2025

శ్రీ వినాయక చవితి పర్వదినాన ఆ శ్రీ వినాయకుడి ఆశీస్సులతో మీరు చేపట్టిన ప్రతి పనిలో విఘ్నాలన్ని తొలిగిపోయి ఎల్లప్పుడూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.



12/08/2025

చరిత్ర మరువని..మరువలేని మహోన్నత నాయకుడు...మన ప్రియతమ రాజేశేఖరుడు...పుట్టిన రోజు... సంధర్భంగామన పెద్దాయన కి ఘన నివాళులు.....
08/07/2025

చరిత్ర మరువని..మరువలేని మహోన్నత నాయకుడు...

మన ప్రియతమ రాజేశేఖరుడు...

పుట్టిన రోజు... సంధర్భంగా

మన పెద్దాయన కి ఘన నివాళులు...🙏🙏🙏

*అక్రమమైనింగ్ పై ఢిల్లీలోని కేంద్ర మైనింగ్ సెక్రటరీకి పిర్యాదు చేసిన నేదురుమల్లి* ఢిల్లీలోని కేంద్ర మైనింగ్ సెక్రటరీ శ్ర...
23/05/2025

*అక్రమమైనింగ్ పై ఢిల్లీలోని కేంద్ర మైనింగ్ సెక్రటరీకి పిర్యాదు చేసిన నేదురుమల్లి*

ఢిల్లీలోని కేంద్ర మైనింగ్ సెక్రటరీ శ్రీ కాంతారావు గారిని తిరుపతి ఎంపీ గురుమూర్తి గారితో కలిసి వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేసిన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు
ఈ ఫిర్యాదు పై స్పందించిన మైనింగ్ సెక్రటరీ శ్రీ కాంతారావు గారు తక్షణమే వివరాలు తెప్పించుకొని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు
ఈ ఫిర్యాదును మైనింగ్ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారికి, సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దుబే గారికి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందని, అక్రమ మైనింగ్ పై తుది వరకు అంచలవారీగా పోరాటం చేస్తామని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు తెలియజేశారు

ఈ విజయం మా కౌన్సిలర్లు జగనన్నకు ఇచ్చినా బహుమతి.
11/04/2025

ఈ విజయం మా కౌన్సిలర్లు జగనన్నకు ఇచ్చినా బహుమతి.

11/04/2025

వెంకటగిరి మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం లొ గెలిచిన సందర్భంగా వై ఎస్ ఆర్ సి పి అధినేత  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిన...
10/04/2025

వెంకటగిరి మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం లొ గెలిచిన సందర్భంగా వై ఎస్ ఆర్ సి పి అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా అధికారపక్షం ఎన్ని కుట్రలు సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మన పార్టీ కౌన్సిలర్స్ చూపిన ధైర్య సహాసాలు గురుంచి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది.

Address

Nedurumalli Bangla
Venkatagiri
524132

Website

Alerts

Be the first to know and let us send you an email when Nedurumalli Ramkumar Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share