13/04/2022
భారత యుద్ధము జరిగిన పిమ్మట మన దేశములో జరిగిన చరిత్ర మనకు మన వారు అన్నీ చక్కగా పాలకుల వివరాలతో సహా అందించారు. అవన్నీ కావ్య పరిభాషలో ఉండటం.. అందరికీ చేరువ కాలేదు. వీటిని ఆనాటి పండితులు పరిష్కరించి అందించినా మన వారు పాశ్చాత్యులు మరియు కొందరు అమ్ముడుబోయిన మిడిమిడి జ్ఞానుల వివరణలతో చరిత్ర అనేది కాచి వడబోసిన సత్యాల మయంగా గాక వక్రీకరణలతో అందరికీ పరిచయం చేయబడ్డది.
మన చరిత్ర మనకు బోధించనివి కింద క్లుప్తంగా ఔత్సాహికుల కోసం అందించాను... వీటన్నింటినీ మనవాళ్ళు పరిశోధన చేసి మన భవిష్యత్ తరాలకు తిరిగి మనము పరిచయం చేయాలి. ఇవన్నీ కల్పిత గాథలు కావు..చారిత్రిక సత్యాలు.
పరీక్షితాబ్ధము - భారత యుద్ధము పిమ్మట , శ్రీకృష్ణ నిర్యాణమునకు పూర్వము ధర్మరాజు ముప్పది ఆరేళ్ళ పాలనము తర్వాత పరీక్షిత్తు కు పట్టాభిషేకం చేసి వారు దేశాటనం వెళ్లారు.
బార్హదృధాబ్ధము - మగధను పాలించిన బార్హద్రధ వంశ పాలనం
ప్రద్యోతనాబ్ధము - మగధ ను పాలించిన ప్రద్యోతన వంశ పాలనం
శిశునాగాబ్ధము - మగధను పాలించిన శిశునాగవంశ పాలనము
తృతీయ గోనందాబ్ధము - కాశ్మీర పాలకులు
పశుప్రేక్ష దేవాబ్ధము - నేపాల్ పాలకులు
భూమ వర్మాబ్ధము - నేపాల్ పాలకులు
నందాబ్ధము - మగధను పాలించిన మగధ వంశ పాలనము
మౌర్యాబ్ధము - మగధను పాలించిన మౌర్య వంశ పాలనము.
శుంగాబ్ధము - మగధను పాలించిన శుంగ వంశ పాలనము.
ప్రతాపాదిత్యాబ్ధము - కాశ్మీర్ పాలకులు
కాణ్వాబ్ధము - మగధను పాలించిన కాణ్వ వంశ పాలనము
ఆంధ్రాబ్ధము - మగధను పాలించిన ఆంధ్ర శాతవాహనుల పాలనము
మేఘవాహనాబ్ధము - కాశ్మీరపాలకులు
శక కాలబ్ధము - శకులను ఓడించి తరిమి ధర్మ స్థాపన
శ్రీహర్షాబ్ధము - ఉజ్జయినీ రాజధానిగా శకులను ఓడించి తరిమి ధర్మ స్థాపనము చేసిన శ్రీహర్షుని పాలనము. ఇతడు శక కర్త. ఆది శంకరుని గురువు అయిన గోవింద భగవత్పాదునికి పూర్వాశ్రమములో సన్యాసాశ్రము స్వీకరించక మునుపు కలిగిన కుమారుడు.మనం నేడు పాటించే పంచాంగ శకాలు శాలివాహన , విక్రమార్క శకానికి పూర్వము శ్రీహర్ష శకం వాడుకలో ఉండెడిది.
గుప్తాబ్ధము - మగధను పాలించిన గుప్త వంశ పాలనము
వసంతదేవాబ్ధము - నేపాల్ పాలకులు
అంశువర్మాబ్ధము - నేపాల్ పాలకులు
విక్రమాబ్ధము - మాలవ దేశము ముఖ్యముగా పాలించిన విక్రమాదిత్యుని పాలనము. మొదటి కాళిదాసు ఈతని కాలానికి చెందిన వారే.శకులను తిరిగి పారద్రోలి శక కర్త అయ్యారు. ఈతని మనవడు శాలివాహన..
శాలివాహనాబ్ధము - ప్రమర వంశానికి చెందిన విక్రమాదిత్యుని పిమ్మట అతని కుమారుడి తర్వాత ఆయన శాలివాహన శక కర్త అయ్యారు. నేడు మనం అనుసరిస్తున్న పంచాంగ శకం శాలివాహన శకం ఇతడి పేరు మీదనే ఆరంభించ బడినది. భోజరాజు ప్రమరవంశములో పదునాల్గవ తరము వాడు.
వీర దేవాబ్ధము - కాశ్మీర్ పాలకులు
కర్కోటాబ్ధము - కాశ్మీర్ పాలకులు
హర్షవర్ధనాబ్ధము - కనౌజ్ ని పాలించిన రాజు
ప్రతాపరుద్రాబ్ధము - కాకతీయ పాలకుల వీరవిక్రమ ధీరత
గుణకామ దేవాబ్ధము - నేపాల్ పాలకులు
సదాశివ దేవాబ్దము - నేపాల్ పాలకులు
కొల్లాబ్ధము - కేరళ రాజవంశ పాలనము
ఉత్పలాబ్ధము - నేపాల్ పాలకులు
నేపాళాబ్ధము - నేపాల్ ని పాలించిన జయదేవ మల్లుని పాలనము.
నారాయణ దేవాబ్ధము - నేపాల్ పాలకులు
యశస్కర దేవాబ్ధము - కాశ్నీర దేశ పాలకులు
ప్రథమ లోద్రాబ్ధము - కాశ్మీర దేశ పాలకులు
భోజ దేవాబ్ధము - ఇతడే ప్రమర వంశానికి చెందిన తెలుగు బ్రహ్మ క్షత్రియులు అయిన విక్రమాదిత్యుని వంశములో పదునాల్గవ తరము వారు అయిన భోజరాజు .మూడవ కాళిదాసు ఈతని పాలనకు చెందినవారు.ధారా నగరము ఈతని రాజధాని.
ద్వితీయ లోద్రాబ్ధము - కాశ్నీర రాజ వంశము.
రామదేవాబ్ధము - దేవగిరి పాలకుల చరిత్ర.
హరి సింహ దేవాబ్ధము - నేపాల్ పాలకులు
కృష్ణారాయాబ్ధము - విజయనగర రాజవంశావళి
పృథ్వీ నారాయణాబ్ధము - నేపాల్ పాలకులు.
ఇవన్నీ కూలంకషముగా తెలిస్తే గానీ భారత చరిత్ర మీద మనకు కొంతయినా మనకు పట్టు గలిగినట్టు..ఇవేమీ లేకుండా మొఘలులు, సుల్తానులు తోనే దేశ చరిత్ర అంటూ మనమీద రుద్ధబడిన చరిత్ర మనకు అవసరమా!ఆలోచించండి