BJP AP Minority Morcha

BJP AP Minority Morcha Sabka Saath Sabka Viswas

02/09/2026

🍅🍌 సంప్రదాయ పంటల నుంచి 🥑 అవకాడో సాగు వైపు అడుగులు!

ఒకప్పుడు టొమాటో, అరటి సాగు చేసిన ఈ రైతు.. తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూసి కొత్త ఆలోచనతో ఆ సాగును ప్రారంభించారు.

🌱 YouTube ద్వారా నేర్చుకుంటూ, శాస్త్రీయ వ్యవసాయ సలహాలను పాటిస్తూ దాదాపు 4 టన్నుల అవకాడో దిగుబడి సాధించారు. ఇప్పుడు స్థానిక దుకాణాలకు నేరుగా సరఫరా చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి **‘మన్ కీ బాత్’**లో ప్రస్తావించబడిన ఈ రైతు ప్రయాణం.. దేశంలోని రైతులు కొత్త పంటలు, కొత్త మార్కెట్లు, కొత్త అవకాశాల వైపు ఎలా అడుగులు వేస్తున్నారో చూపిస్తోంది. 🇮🇳🌾

కొత్త ఆలోచన + శాస్త్రీయ వ్యవసాయం = రైతుకు కొత్త ఆదాయ మార్గం!

👉🏻 పూర్తి ఎపిసోడ్: youtube.com/live/lBGdaEePLEY?si=eBs6qtLQ8-KD9aRj

🇮🇳 సేవా సంకల్ప ఉత్సవాలు – రాష్ట్ర కార్యశాలబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారి అధ్యక్షతన, విజయవాడలోని బీజేప...
01/09/2026

🇮🇳 సేవా సంకల్ప ఉత్సవాలు – రాష్ట్ర కార్యశాల

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారి అధ్యక్షతన, విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సెప్టెంబర్ 17 – అక్టోబర్ 17 వరకు చేయబోయే “సేవా సంకల్ప ఉత్సవాలు – ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవ” కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కార్యశాల నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ ఎన్. మధుకర్ జీ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సన్న దయాకర్ గారు పాల్గొన్నారు.

రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు శ్రీ సయ్యద్ బాషా గారితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ మొహమ్మద్ సాదిక్ బాషా, శ్రీ ఫైరోజ్ ఖాన్, శ్రీ నన్నేశ హుస్సేన్ గార్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ రాష్ట్ర కార్యశాలలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





వికసిత్ భారత్‌ కోసం మాదకద్రవ్య రహిత యువత! 🇮🇳దేశ అభివృద్ధిలో యువతే కీలక శక్తి. మాదకద్రవ్యాల నుంచి యువతను దూరంగా ఉంచేందుకు...
30/08/2026

వికసిత్ భారత్‌ కోసం మాదకద్రవ్య రహిత యువత! 🇮🇳

దేశ అభివృద్ధిలో యువతే కీలక శక్తి. మాదకద్రవ్యాల నుంచి యువతను దూరంగా ఉంచేందుకు దేశవ్యాప్తంగా అవగాహన ఉద్యమం వేగంగా విస్తరిస్తోంది.

మాదకద్రవ్య రహిత యువత…
మాదకద్రవ్య రహిత భారత్‌…

ఇదే మన సంకల్పం, ఇదే వికసిత్ భారత్‌ దిశగా మనందరి లక్ష్యం! 🇮🇳

దేశ ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నేరుగా మమేకమయ్యే ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రతి...
30/08/2026

దేశ ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నేరుగా మమేకమయ్యే ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రతి ఒక్కరూ తప్పక వినండి. 🇮🇳

మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులను కూడా ‘మన్ కీ బాత్’ వినేలా ప్రోత్సహించండి.

దేశ ప్రగతి, ప్రజల ఆలోచనలు, స్ఫూర్తిదాయకమైన కథనాలను పంచుకునే ఈ కార్యక్రమంలో మనమూ భాగస్వాములం అవుదాం.

కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్! 😂ప్రతిపక్షాలతో పోరాడాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేకుండానే… సొంత పార్టీ నేతలే అసంతృప్తితో రోడ్...
29/08/2026

కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్! 😂

ప్రతిపక్షాలతో పోరాడాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేకుండానే… సొంత పార్టీ నేతలే అసంతృప్తితో రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందా? 🤣

బీహార్ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోసం నెలల తరబడి ప్రయత్నించినా సమయం దొరకలేదని ఆరోపిస్తున్నారు. ఇతర పర్యటనలకు సమయం ఉన్నా… సొంత పార్టీ నాయకులకు మాత్రం 10 నిమిషాలు కూడా కేటాయించలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పుడు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఎదుటే నిరసనకు సిద్ధమవుతున్నారన్న వార్తలు… కాంగ్రెస్‌లో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతున్నాయి. 😂

బయట ప్రతిపక్షం… లోపలే అసలు ప్రతిపక్షం! 🤣

బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ కున్వర్ బాసిత్ అలీ గారు, మాజీ జాతీయ కార్యదర్శి మరియు సీనియర్ బీజేపీ నాయకులు...
28/08/2026

బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ కున్వర్ బాసిత్ అలీ గారు, మాజీ జాతీయ కార్యదర్శి మరియు సీనియర్ బీజేపీ నాయకులు శ్రీ అరవింద్ మీనన్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ స్నేహపూర్వక భేటీలో పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలు మరియు సమకాలీన రాజకీయ పరిణామాలపై ఆత్మీయంగా చర్చించారు.




28/08/2026

🪢 రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🇮🇳

ఇది కేవలం ఒక దారం కాదు.. ప్రతి సోదరి విశ్వాసం, ఆప్యాయతకు ప్రతీకైన పవిత్ర బంధం.

ఉజ్వల నుంచి నారీ శక్తి వందన్ చట్టం వరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మహిళల భద్రత, గౌరవం, సాధికారతకు అనేక చర్యలు చేపట్టారు.

దేశంలోని ప్రతి సోదరీమణికి రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🌸🇮🇳

12 ఏళ్ల జన ధన్ యోజన – ఆర్థిక సాధికారతకు బలమైన పునాది!ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రారంభమైన ప్రధాన్ మంత్రి...
28/08/2026

12 ఏళ్ల జన ధన్ యోజన – ఆర్థిక సాధికారతకు బలమైన పునాది!

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రారంభమైన ప్రధాన్ మంత్రి జన ధన్ యోజన ద్వారా కోట్లాది మంది ప్రజలు బ్యాంకింగ్ సేవలకు చేరువయ్యారు.

🏦 ₹3.1 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు
🤝 13.5 లక్షలకు పైగా బ్యాంక్ మిత్రాలు
💳 పేదలు, మహిళలు, గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ

ప్రతి ఒక్కరికీ ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి తీసుకువస్తూ…
సమగ్ర అభివృద్ధి – సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థ – సాధికార భారత్! 🇮🇳

🪢 రక్షాబంధన్ పర్వదిన శుభాకాంక్షలు! 🌸అక్కాచెల్లెళ్ల ఆప్యాయతకు, అన్నదమ్ముల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన రక...
28/08/2026

🪢 రక్షాబంధన్ పర్వదిన శుభాకాంక్షలు! 🌸

అక్కాచెల్లెళ్ల ఆప్యాయతకు, అన్నదమ్ముల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో ప్రేమ, ఆనందం, సోదరభావాన్ని నింపాలని ఆకాంక్షిస్తున్నాను.

రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🙏

Address

Dr No : 33-9-15/33-9-6, Boyapativari Street, Anil Estate Lane, Near By Sunrise Hospital, Seetharampuram
Vijayawada
520002

Alerts

Be the first to know and let us send you an email when BJP AP Minority Morcha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP AP Minority Morcha:

Shortcuts

Share