02/08/2022
01-08-2022న, వత్సవాయి మండలం, ఎన్టీఆర్ జిల్లా ఎమ్మార్వో ఆఫీస్ వద్ద మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరుగుతున్నాయి ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నో వందలాది ఎంఆర్పిఎస్ వేదికల పైకి బిజెపి నాయకులు పెద్దలు విచ్చేసి ఎమ్మార్పీఎస్ 28 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం సామాజిక న్యాయం కాబట్టి మేము మద్దతు తెలుపుతున్నాము అని అధికారంలోకి రాకముందు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఎన్నో లేఖలు రాశారు అలాగే అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేస్తాము అని హామీ ఇచ్చి ఈనాటికి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కానీ నిర్లక్ష్య ధోరణి ప్రవర్తిస్తుంది కాబట్టి బిజెపి ప్రభుత్వానికి నిజంగా ఉద్యమ పట్ల వర్గీకరణ పట్ల నిబద్ధత ఉంటే కచ్చితంగా ఈ పార్లమెంటు సమావేశా లోనే వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము.
*పాల్గొన్నవారు:*
*1.మంద వెంకటేశ్వరరావు మాదిగ*
*ఉమ్మడి కృష్ణ జిల్లా ఇంచార్జ్*
2. *పేరెల్లి ఎలిషా మాదిగ*
*(MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)*
3. మాడుగుల అశోక్ మాదిగ
మండల ఇన్చార్జి
4. మోదుగు శ్రీనివాసరావు విహెచ్పిఎస్ వ్యవస్థాపక జాతీయ కార్యదర్శి
5. కుక్కలు సురేష్ మాదిగ
ఎంఈఎఫ్ జాతీయ కార్యదర్శి
ఏసుపోగు శ్రీరామ్, దారెల్లి క్రాంతి,దారెల్లి జాన్సన్, దారెల్లి శ్యాంబాబు, మాజీ శ్రీనివాసరావు, దారిలో గణపతి, మేడి ఫిలిప్ తదితరులు పాల్గొన్నారు.
ఈ దీక్షను వత్సవాయి మండలం జడ్పిటిసి మేంబర్ వేసుకోగు దేవమని పూలమాలలు వేసి ప్రారంభించారు.
ఇట్లు:
*పెరెల్లి. ఎలిషా మాదిగ*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి